ఆ డ‌చ్ క‌ళాకారులు ప‌చ్చి ఆహార ప‌దార్థాల‌ను క్యూబ్‌లుగా ఒకే సైజ్‌లో క‌ట్ చేశారు… ఎందుకు..?

మాంసం, పండ్లు, కూర‌గాయలు… ఇలా ఏ ఆహార‌మైనా ఏ ఆకారంలో ఉంటుంది? దేనికీ నిర్దిష్ట‌మైన ఆకారం అంటూ ఉండ‌దు. అదలా ఉంది, ఇదిలా ఉంది అంటూ చెప్పుకోవ‌డ‌మే త‌ప్ప‌, క‌చ్చిత‌మైన కొల‌త‌ల‌తో కూడిన ఆకృతిలో ఏ ఆహారం కూడా ఉండ‌దు. అయితే కింద ఇచ్చిన బొమ్మ‌ను చూశారా?

cube-food

అన్నీ ఒకే ఆకారంలో ప‌ర్‌ఫెక్ట్‌గా ఉన్నాయి? ఏంటివ‌న్నీ అనుకుంటున్నారా? అయితే ఓసారి జాగ్ర‌త్తగా ప‌రిశీలించి చూడండి. ఆ… ఇప్పుడు కొద్దిగా గుర్తొచ్చిందా? పూర్తిగా వ‌చ్చేసిందా? అయితే అవేమిటో చెప్పేస్తారా? మీరేమిటి కొంచెం జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే అవేమిటో అంద‌రికీ తెలిసిపోతుంది. అవేనండీ మ‌నం నిత్యం తినే ఆహార ప‌దార్థాలు.

ల‌ర్న‌ర్ట్‌, శాండ‌ర్ అనే ఇద్ద‌రు డ‌చ్ క‌ళాకారులు మ‌నం నిత్యం తినే ప‌లు పండ్లు, కూర‌గాయలు, మాంసం ఇలా దాదాపు 98 ర‌కాల‌కు చెందిన ప‌చ్చి ఆహార ప‌దార్థాల‌న్నింటినీ ఒకే సైజ్‌లో అన్నీ క్యూబ్స్‌లా ఉండే విధంగా ఆక‌ర్ష‌ణీయంగా క‌ట్ చేశారు. ఈ ఆహార క్యూబ్స్ సైడ్స్ అన్నీ ఒకే కొల‌త‌ను క‌లిగి ఉన్నాయ‌ట‌. ప్ర‌తి సైడ్ క‌చ్చితంగా 2.5 సెంటీ మీట‌ర్లు వ‌చ్చేలా వారు క‌ట్ చేశారు.

cube-food

అయితే వారు ఇలా ఆహార ప‌దార్థాల‌ను ఎందుకు క‌ట్ చేసి ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టారో తెలుసా? క్యూబ్ ఆకారంలో ఉన్న ఆహారం చూస్తే సాధార‌ణంగా ఎవ‌రికైనా తిండి తినాల‌నే యావ పుడుతుంద‌ట‌. ఆ యావ కాస్తా ఆక‌లికి దారి తీస్తుంద‌ట‌. దాన్ని తెలియ‌జేయ‌డం కోస‌మే వారు ప్ర‌యోగాత్మ‌కంగా ఇలా ఆయా ఆహార ప‌దార్థాల‌ను క‌ట్ చేసి పెట్టారు.

మీక్కూడా వాటిని చూస్తే నోరూరిపోతుందా? అయితే ఇంకెందుకాల‌స్యం మీరూ ఇలాగే క‌ట్ చేసుకుని తినండి! అయితే అతిగా మాత్రం తిన‌కండే! ఎందుకంటే అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్ అన్నారు పెద్ద‌లు. అంటే దేన్న‌యినా అతిగా చేయ‌కూడ‌దు, తిన‌కూడ‌దు అని అర్థం.

Comments

comments

Share this post

scroll to top