ఆ సినిమాలో ఒకే ఒక్క పాత్ర!…ఆ పాత్రకి సెలెక్ట్ అయిపోయిన “Dubsmash” ఫేమ్ ఎవరో తెలుసా?

సాధారణంగా ఒక సినిమాలో ఎన్నో పాత్రలు ఉంటాయి…ఎంత తక్కువ అనుకున్న కనీసం ఓ 20 ఉంటాయి…అతితక్కువ పాత్రలతో అని రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు తీసిన “దొంగల ముట” అనే సినిమాలోనే మొత్తం మీద ఓ 20 పాత్రలు ఉంది ఉంటాయి…కానీ ఇప్పుడు తమిళం లో కొత్త ప్రయత్నం చేయనున్నారు ఓ ప్రముఖ దర్శకుడు దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్… సూషీంద్రాం దగ్గర పని చేసిన “సురేష్ కుమార్” డైరెక్టర్ గా తొలి ప్రయత్నం లోనే ఈ ప్రయోగానికి పూనుకున్నారు…వారం రోజుల క్రితమే “నాగల్” అనే మూవీకు కొబ్బరికాయ కొట్టినా…సినిమాలో ఆ ఒక్క పాత్రలో నటించాడానికి ఎవరన్నది తెలియలేదు…

అయితే ఆ ఒక్క పాత్రకి ఒకరిని సెలెక్ట్ చేశారు…ఆమె ప్రముఖ హీరోయిన్ కానే కాదు!…కేవలం ఆమె చేసిన డబ్‌స్మాష్‌ వీడియోల ద్వారా సోషియల్ మీడియా లో ట్రెండ్ అవ్వడం వల్ల ఆ ఒక్క పాత్రలో నటించే లక్కీ చాన్స్ కొట్టేసింది!…ఇంతకీ ఆమె పేరు ఏంటి అనుకుంటునరా?..”మృణాళిని” అని డబ్‌స్మాష్‌ క్వీన్ !…ఫేస్‌బుక్ లో ఎంతో మంది ఫాలొవర్స్ ని సంపాదించుకుంది…ఎక్స్‌ప్రెషన్స్ తో చంపేయగలదు అంటారు ఆమె వీడియో చూసినవారు!…సినిమా మొత్తం తను ఒక్కదాన్నే నటిస్తుండడం, తెరపై ఒక్కదాన్నే కనిపించనుండడం అద్భుతంగా అనిపిస్తోందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలియగానే మృణాళిని ఎగిరి గంతేసింది అంట. ఈ సినిమా ఒక థ్రిలర్ కథతో తెరకి ఎక్కనుంది…వచ్చే వారం చెన్నై లో షూటింగ్ మొదలు అవ్వనుంది. ఈ లోపు ఆ అమ్మాయి ఫోటోలు, వీడియో లు ఒక లుక్ వేస్కొండి!

Watch Video Here:

 

Comments

comments

Share this post

scroll to top