“రంగస్థలం” లో “సమంత” కి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.? ఆమె గురించి 10 ఆసక్తికర విషయాలివే.!

“అట్టా గిల్లేత్తావేటీ…గాజులు కొనిపెట్టమంటే…”‘ఆ… పేమంటే ఇంతే మరి ఇలాగే సెప్తారు. నీకినపడదని ఓ అరిసి సెప్పరు”అంటూ రంగస్థలంలో  సమంత డైలాగ్ చెప్తుంటే విజిల్సే విజిల్స్.. అచ్చమైన గోదారి యాసలో మాట్లాడిన మాటలకు అందరూ ఫిదా అయ్యారు..కాని రంగస్థలంలో సమంతాకి డబ్బింగ్ చెప్పుకున్నది సమంతా కాదు..మరెవరో తెలుసా… జ్యోతివర్మ…తన గురించి ఆసక్తికరమైన విషయాలు..

 • జ్యోతివర్మ..సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం.సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు..
 • జ్యోతివర్మ గొంతు విన్న వాళ్ల నాన్న ఫ్రెండొకరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ట్రై చేయమని సలహా ఇవ్వడంతో ఈ దిశగా అడుగులేశారు..సక్సెస్ అయ్యారు..

 • ఫస్ట్ టైం వాయిస్ టెస్ట్ కి వెళ్లినప్పుడు అక్కడ వారిచ్చిన పేపర్లు గబగబా చదివి బైటికొచ్చేశారట.అప్పటికి ఆమెకి డబ్బింగ్ గురించి ఏం తెలియదట..వారం రోజుల తర్వాత సెలక్ట్ అయినట్టు వార్త వచ్చింది..అదే నచ్చావులే సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్.. అప్పటినుండి వరుసగా డబ్బింగ్ చెప్తూనే ఉన్నారు.
 • రంగస్థలం సినిమాలో  సమంతాకి డబ్బింగ్ చెప్పడంతో అందరూ జ్యోతి వర్మ గురించి ఆరా తీస్తున్నారు కాని..ఇంతకుముందు సూపర్ హిట్ అయిన వేదం సినిమాలో అనుష్క పోషించిన సరోజ పాత్రకు డబ్బింగ్ చెప్పింది కూడా జ్యోతి వర్మనే..
 • వేదంలో సరోజ పాత్రకి డబ్బింగ్ చెప్పడంతో తన గొంతు రొమాంటిక్ గా ఉందని అన్ని అవే అవకాశాలు రావడంతో పంథా మార్చుకుని అన్ని రకాల పాత్రలకు డబ్బింగ్ చెప్పగలనని నిరూపించుకున్నారు.
 • రంగస్థలం సినిమాలో సమంతా పాత్రకి సమంతే డబ్బింగ్ చెప్పుకుందామనుకున్నారట.కాని జ్యోతివర్మ గొంతు విన్న సుకుమార్ డబ్బింగ్ చెప్పడానికి జ్యోతిని ఎంపిక చేశారట.జ్యోతివర్మ,సమంతా కి డబ్బింగ్ చెప్పే తొలి సినిమా మలి సినిమా కూడా ఇదే..ఎందుకంటే ఇకపై తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని సమంతా ప్రకటించింది.

 • సినిమాలకే కాదు సీరియల్స్ నటులకు కూడా జ్యోతి వర్మ డబ్బింగ్ చెప్తున్నారు..కుటుంబానికి టైం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సీరియల్స్ కి డబ్బింగ్ చెప్పడం తగ్గించారు.
 • డబ్బింగ్ చెప్పాలంటే మూడ్ బాగుండాలంటారు జ్యోతి.మూడ్ బాగోక నాయకి సినిమాలో త్రిష పాత్రకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్లినప్పుడు రోజంతా చెప్పినా సెట్ కాలేదట..అదే డబ్బింగ్ నెక్ట్స్ డే సింగిల్ టేక్ లో కంప్లీట్ చేశారట..

జ్యోతివర్మ డబ్బింగ్ చెప్పిన కొన్ని చిత్రాలు,హీరోయిన్లు

 • రంగస్థలం- సమంత
 • కంచె-  ప్రజ్ఞా జైస్వాల్‌
 • వేదం- అనుష్క
 • రారండోయ్‌ వేడుక చూద్దాం- రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
 • వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌- రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
 • జేమ్స్‌బాండ్‌- సాక్షి చౌదరి
 • నాయకి- త్రిష
 • రెబల్‌- దీక్షా సేథ్,
 • రాజుగారి గది–2- సీరత్‌ కపూర్, అభినయ..

కొన్ని మర్చిపోలేని డైలాగులు

 • రంగస్థలం- ‘‘ఆ పేమంటే ఇంతే మరి ఇలాగే సెప్తారు. నీకినపడదని ఓ అరిసి సెప్పరు’’
 • వేదం- ‘‘అవున్సారు డబ్బులకమ్ముడుపోతాం. ఎందుకంటే మాకు సదువు రాదు ఉద్దోగం లేదు, మరి మీకేమైందయ్యా’’
 • వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌- ‘‘ప్రతి రూపాయికి కౌంట్‌ ఇక్కడ’’
 • రారండోయ్‌ వేడుక చూద్దాం- ‘‘భ్రమరాంబకు కోపమొస్తుంది ; భ్రమరాంబకి అది నచ్చలేదు ; ఇప్పుడు భ్రమరాంబకి కోపం వచ్చింది’’
 • కంచె- ‘‘ఓయ్‌ షేక్‌స్పియర్‌! ఏంటోయ్‌! మా అన్నయ్యను కాదని నా దగ్గరకు వద్దామనుకుంటున్నావా’’

డబ్బింగ్‌చెప్పిన సీరియల్స్‌

 • ఆడదే ఆధారం
 • తూర్పు వెళ్లేరైలు ∙
 • దేవత
 •  కొత్తబంగారం
 • కల్యాణ తిలకం
 •  పసుపు కుంకుమ.

watch video here:

Comments

comments

Share this post

scroll to top