“శ్రీదేవి” మృతిపై దుబాయ్‌ పత్రిక సంచలన కథనం..! మన మీడియా ప్రచారం చేసింది తప్పా..? అసలేమైంది.?

బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి దాదాపు నాలుగు రోజులు అక్కడే ఉన్నారు. ముంబైలో జరిగిన ఓ పుట్టిన రోజు వేడుక కోసం వెనక్కి వచ్చిన బోనీకపూర్ మళ్లీ శనివారం మధ్యాహ్నం దుబాయ్ చేరుకున్నారు. అయితే దుబాయ్‌కి తిరిగి వస్తున్న సంగతి శ్రీదేవికి బోనీకపూర్ చెప్పలేదు. నేరుగా ఆమె బస చేసిన ‘జువైరా ఎమిరేట్స్ టవర్స్’ హోటల్‌కు వెళ్లారు.

ఆమెను ఆశ్చర్యపరిచిన బోనీకపూర్… నిద్రపోతున్న శ్రీదేవిని సాయంత్రం 5:30 గంటల సమయంలో నిద్రలేపారు. ఎప్పుడొచ్చారు అని ఆశ్చర్చపోయిన శ్రీదేవి దాదాపు ఆయనతో 15 నిమిషాలు మాట్లాడారు. ఇద్దరు కలిసి డిన్నర్‌కు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో స్నానం చేసి వస్తానని చెప్పి శ్రీదేవి బాత్‌రూంలోకి వెళ్లారు. దాదాపు పావుగంటైనా ఆమె బాత్ రూం నుంచి బయటకు రాలేదు. దాంతో అనుమానం వచ్చిన బోనీ కపూర్ తలుపుతట్టారు. లోపల నుంచి మాట వినిపించలేదు. అలకిడి లేదు… స్నానం చేస్తున్న శబ్దం లేదు. దాంతో హోటల్ సిబ్బంది సాయంతో బోనీ కపూర్ తలుపు పగలకొట్టి చూశారు. బాత్ టబ్‌లో శ్రీదేవి అచేతనంగా పడి ఉండటం కనిపించింది. బోనీకపూర్‌ ఆమెను బతికించుకోవడానికి ప్రయత్నం చేశారని ‘ఖలీజ్ టైమ్స్’ కథనం.

దీన్ని బట్టి శ్రీదేవి రాత్రి 11:30 నిమిషాల సమయంలో చనిపోలేదని, ముందే 7:30 గంటలకు చనిపోయిందని ఖలీజ్ టైమ్స్ పత్రిక కథనం. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె భౌతికకాయాన్ని పోస్టుమార్టం చేసేందుకు తీసుకెళ్లారు. మరో కథనం ప్రకారం శ్రీదేవి చనిపోయే సమయానికి బోనీ కపూర్ ఆమెతో లేరనే ప్రచారం జరుగుతోంది. దాంతో అసలు ఏం జరిగిందనే అనుమానాలు పెరిగిపోయాయి. శ్రీదేవితో బోనీకపూర్ లేకపోతే ఎక్కడ ఉన్నారు.. ఏం చేస్తున్నారు. శ్రీదేవి రెండు రోజులుగా హోటల్ గదికే ఎందుకు పరిమితమయ్యారు. ఇవన్నీ సమాధానాలు దొరకాల్సిన ప్రశ్నలు.

Comments

comments

Share this post

scroll to top