దుబాయ్ లో ఇండియన్ నరకయాతన.! కోర్ట్ విచారణకు రెండేళ్లుగా 1000 KM కు పైగా కాలినడక.!

15 రోజులకోసారి  విచారణ నిమిత్తం కోర్ట్ కు హాజరవ్వాలి.నేనుండేది దుబాయ్ లోని సోనాపూర్, వెళ్లాల్సింది కరామా….రెండింటికి మధ్య దూరం 22 కిలోమీటర్లు… బస్ లో వెళ్దామంటే చేతిలో చిల్లిగవ్వలేదు. అందుకే గత రెండేళ్లుగా….పోనూ 22 కిలో మీటర్లు, రాను 22 కిలో మీటర్లు కాలినడకన వెళుతున్నాను. దీని కోసం ఉదయం 4 గంటలకే నా నడక స్టార్ట్ చేస్తాను. కోర్ట్ సమయానికి ముందే  నేనక్కడుంటాను.  ఎండాకాలంలో….ఇసుక తుఫాన్లకు, ఎండవేడిమికి, ఉక్కపోతకు కూడా తట్టుకుంటూ…నడుచుకుంటూ కోర్ట్ కు వెళ్లేవాడిని. ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోయేవాడిని, దయచేసి నా గోడును అర్థం చేసుకోండి, నన్ను మా దేశానికి పంపించండి. ప్రస్తుతానికి నేనొక పార్క్ లో తలదాచుకుంటున్నాను.

selvaraj2

ఇది దుబాయ్ కి బతుకుదెరువు కోసం వెళ్లిన సెల్వరాజ్ దీనగాథ….. తమిళనాడులోని తిరుచిరాపల్లి కి చెందిన  జగన్నాథన్ సెల్వరాజ్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. ఉద్యోగంలో చేరిన  రెండు సంవత్సరాలకు తల్లి చనిపోవడంతో తల్లి అంత్యక్రియలకు సొంతూరికి వెళ్లాలని అక్కడి కంపెనీ వాళ్లకు చెప్పాడు. అయినా వాళ్లు నిరాకరించారు. ఇదే క్రమంలో ఆ కంపెనీ సెల్వరాజ్ ను ఉద్యోగం నుండి తీసివేసింది. అకారణంగా తనను ఉద్యోగం నుండి తీసేసారని అక్కడి కోర్ట్ ను ఆశ్రయించాడు సెల్వరాజ్… చేతిలో డబ్బుల్లేవ్, ఉండడానికి ఇళ్లు లేదు, కోర్ట్ తీర్పు వస్తే….స్వదేశానికి వెళ్లడానికి టికెట్ డబ్బులొస్తాయనే ఆశతో…గత రెండేళ్లుగా దాదాపు 1000 కిలోమీటర్లు కాలినడక కోర్ట్ కు వెళుతూ న్యాయపోరాటం చేస్తున్నాడు.

selvaraj

ఈ అవస్థలన్నీ ఇక నేను పడలేను…దయచేసి నాకు టిక్కెట్ కొనిచ్చి..మాదేశానికి నన్ను పంపించండి అంటూ ఆవేదనగా అడుగుతున్నాడు…44 సంవత్సరాల సెల్వరాజ్.

 

Comments

comments

Share this post

scroll to top