ఆ రాజే ఇప్పుడు నక్షత్రం అయ్యాడు..కారణం విష్ణుమూర్తి.( పురాణ శిశువులు-3)

పూర్వం ఉత్తనపద అనే రాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు సునీత. పేదింటి కుటుంబానికి చెందిన స్త్రీ. రెండో భార్య సురూచి.రాజకుటుంబానికి చెందిన స్త్రీ. సునీత కుమారుడు ధృవ, సురూచి కుమారుడు ఉత్తమ. ధృవ పెద్దవాడు కావడం వలన తండ్రి ఉత్తనపద తర్వాత రాజ్యాన్ని పరిపాలించే  అధికారం ధృవకు చెందుతుంది. అయితే సునీత, ఆమె కుమారుడు అంటే మొదటినుండీ ఇష్టం లేని సూరూచి వాళ్లిద్దరినీ రాజ్యం నుండి బయటకు పంపే పన్నాగం పన్నింది. సునీత కంటే అందగత్తె అయిన సురూచి, ఉత్తనపద రాజుకు మాయమాటలు చెప్పి, పూర్తిగా తన మోహంలో ఉండేలా చూసుకుంది సురూచి. సూరుచి మాయలో ఉన్న రాజు, సునీతను ధృవను రాజ్యం నుండి బయటకు పంపాడు. అలా బయటకు వచ్చిన తల్లికొడుకులు అడవికీ దగ్గరగా ఉన్న కుటీరంలో నివసించేవారు. సునీత ధృవకు  దేవుడి గురించి గొప్ప గొప్ప విషయాలు చెబుతుండేది. వాటిని ఎంతో శ్రద్ధగా వినేవాడు ధృవ.
dhruva4
ఒకరోజు తన తండ్రిని చూడాలనిపించడంతో ధృవ రాజ్యానికి వెళతాడు. ఆ సమయంలో తన తండ్రి ఒడిలో ఉత్తమ కూర్చొని సంతోషంగా ఉంటాడు. తనకు కూడా తన తండ్రి ఒడిలో కూర్చోవాలనిపించి కూర్చోవడానికి వెళతాడు. ఇది గమనించిన సురూచి ఈ రాజ్యంలో, ఉత్తమకే తన తండ్రి ఒడిలో కూర్చునే అర్హత ఉందని గట్టిగా హెచ్చరిస్తుంది. ఇదంతా చూస్తున్న రాజు కనీసం ఒక్కమాటైనా మాట్లాడకుండా అలానే ఉండిపోయాడు. బరువెక్కిన గుండెతో ధృవ ఇంటికి చేరాడు. నేను కూడా తన తండ్రితో కలిసి సంతోషంగా జీవించాలంటే ఏమి చేయాలమ్మా అని ధృవ తన తల్లిని అడుగుతాడు. నిస్సహాయ స్థితిలో ఆ తల్లి బాధను మిగదింగుకొని ఏమి మాట్లాడలేదు. “దేవుడు గొప్పవాడని, మంచి వాడని నువ్వు చెబుతావు, అదే దేవుడ్ని ఎన్ని రోజులైనా సరే నేను వేడుకుంటాను, తన తండ్ర్రితో రాజ్యంతో కలిసి జీవించే అవకాశం కల్పించమని తల్లికి చెప్పి అడవిలోకి వెళతాడు.
dhruva1
దేవుడ్ని వేడుకుంటున్న ఆ ఐదేళ్ళ ద్రువను చూసిన నారదుడు, తనకు ఇంత చిన్న వయసులో వచ్చిన కష్టాన్ని చూసి బాధపడతాడు. ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేలా ‘ఓం నమో వాసుదేవాయా” అనే మంత్రాన్ని జపించమని చెబుతాడు. అహోరాత్రులు,నిద్రాహారాలు లేకుండా, అడవిలో ఉన్న జంతువులను తనని చంపుతాయనే భయంలేకుండా ధైర్యంగా..ఉచ్ఛ్వాసనిస్వాసల్లోనూ ఆ మంత్రాన్ని జపిస్తున్నాడు ధృవ .ధృవ తపస్సుకు ముగ్ధుడైన విష్ణుమూర్తి అతడి ముందు ప్రత్యక్ష్యమై తనకు కావాల్సిన వరంతో పాటు ఇంకో వరాన్ని కూడా ఇస్తాడు. తన తండ్రే నీకోసం ఎదురుచూస్తాడని, రాజ్యం మొత్తం నీకోసం ఎదురుచూస్తుందని , ఎప్పటికీ సంతోషంగా ఉంటావని విష్ణు ధృవకు వరం ఇస్తాడు.
తన కొడుకు అడవులలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతున్నాడని, ఆ దేవుళ్ళను నీతో కలిసి ఉండటానికి ప్రార్థిస్తున్నాడని నారదుడు ఉత్తనపద రాజుకు జరిగిన విషయాన్ని చెబుతాడు నారదుడు.బాధతో కన్నీళ్ళుకారుస్తాడు ఆ రాజు. ధృవ రాకకోసం అతడి తండ్రి రాజ్యం మొత్తం వేయికళ్ళతో ఎదురుచూస్తోంది. ధృవను చూడగానే రాజు కళ్ళు సంతోషించాయి. ఒక్కసారిగా తన చేతులతో ధృవను తీసుకొని హత్తుకొని ముద్దాడాడు. తన భార్య సునీతను రాజ్యానికి తీసుకువచ్చి, ధృవను యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేసి, మిగిలిన జీవితాన్ని ఆశ్రమంలో గడపడానికి బయలుదేరాడు ఉత్తనపద రాజు. చిన్న వయసులోనే రాజ్యపరిపాలనలో మెళకువలు నేర్చుకున్నాడు ధృవ.
 dhruva-mandala
పెరిగి పెద్దవాడైన ధృవ ఎన్నో సంవత్సరాలు రాజ్యపాలన ప్రజలు మెచ్చిన రాజుగా కీర్తింపబడి  ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారాలను చూపాడు. ధృవ మరణానంతరం ఆకాశంలో ఒక తారగా ప్రకాశించాడు.ఆ తారనే మనం ధృవ నక్షత్రంగా పిలవబడుతున్నాం. ఎన్ని నక్షత్రాలు తమ చోటును మరో చోటుకు మారినా ఒక్క ధృవ నక్షత్రం మాత్రం ఎప్పటికీ అలా నిలిచే ఉంటుంది. ఈ వరాన్ని విష్ణు మూర్తి ధృవకు ప్రసాదించాడు.పూర్వం ధృవ నక్షత్రాన్ని చూసుకుంటూ ప్రజలు తమ ఇళ్ళకు రాత్రి సమయాలలోనూ వేరే చోటు నుండి ప్రయాణం చేసేవారట. అలా ధృవతారగా నిలిచిపోయాడు ధృవ.
sage-narada-lord-vishnu-dhruva

Comments

comments

Share this post

scroll to top