“దృశ్యం”లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి గుర్తుందా? ఇప్పుడు హీరోయిన్ లా మారి ఎలా ఉందో చూడండి!

దృశ్యం సినిమాలో ప్రతి పాత్ర మనకు గుర్తుండిపోతుంది..నటుడు వెంకటేష్ మొదలుకొని సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ సహజనటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు  .అను గా నటించిన బాలనటి గుర్తుందా..అదేనండీ  వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన అమ్మాయి ఇప్పుడు ఎలా మారిందో తెలుసా.. తెలుగు దృశ్యం లోనే కాదు తమిళ్,మళయాలి లో కూడా ఈ అమ్మాయే నటించింది..తమిళ్లో కమల్ హాసన్,మళయాలంలో మోహన్ లాల్ నటించారు..ఇప్పుడు మళయాలి సినిమా ద్వారా అను అలియాస్ ఎస్తర్ అనిల్ హీరోయిన్ గా పరిచయం కాబోతుంది..

బాలనటిగా ఎస్తెర్ అనిల్ మొదటి చిత్రం ‘నల్లవన్’లో నటించినప్పటికీ, మోహన్ లాల్ కుమార్తెగా ‘ఒరు నాల్ వరుమ్’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2013లో మలయాళంలో విడుదలై ట్రెండ్ సెట్టర్ గా, అతిపెద్ద హిట్ గా నిలిచిన ‘దృశ్యం’ తన కెరీర్ లో అతిపెద్ద విజయం. ఇక అదే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయగా, హీరో హీరోయిన్లు, ఇతర పాత్రధారులు మారినప్పటికీ, ఎస్తర్ పోషించిన అను పాత్ర ఆమెకే దక్కింది.అంతేకాదు బాలనటిగా సోషల్ మీడియాలో అత్యదికంగా పాతికలక్షలు లైకులు పొందింది కూడా ఎస్తెరే..

ప్రముఖ నటుడు అభి కుమారుడు షేన్ నిగమ్,ఎస్తెర్ నటీనటులుగా దర్శకుడు షాజీ ఎన్ కరుణ్ ఒక సినిమా మొదలుపెట్టారు.ఇందులో ఇష్క్ ఫేం ఇషా తల్వార్, లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.బాలనటిగా గుర్తింపు పొందిన ఎస్తెర్ ,హీరోయిన్ గా కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటూ,తగిన గుర్తింపు పొందుతుందని ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top