తాగి హాస్పిటల్ కి “ఆడి కార్” లో వచ్చాడు..కానీ వెళ్ళేటప్పుడు “అంబులెన్సు” తీసుకెళ్లాడు..! చివరికి ఏమైందో తెలుసా..?

మ‌ద్యం సేవిస్తే నిజంగా ఒక్కొక్క‌రు ఒక్కో రకంగా ప్ర‌వర్తిస్తారు. కొంద‌రైతే తాము ఏం చేస్తుందీ తెలియ‌దు. ఏం మాట్లాడుతున్నారో కూడా వారికే తెలియ‌దు. అంతలా ప్ర‌వ‌ర్తిస్తారు. అయితే ఇంత వ‌ర‌కు ఓకే. కానీ ఆ వ్య‌క్తి మాత్రం మ‌ద్యం తాగాక త‌న కారు అనుకుని ఏకంగా ఆంబులెన్స్‌నే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్లాడు. తీరా ఇంటికెళ్లాక ఇంట్లో కుటుంబ స‌భ్యులు చెబితే గానీ తెలియ‌లేదు ఆ వ్య‌క్తికి, అది ఆంబులెన్స్ అని. దీంతో అతను స‌ద‌రు హాస్పిట‌ల్‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఆంబులెన్స్‌ను తిరిగిచ్చేశాడు. ఈ సంఘ‌ట‌న జ‌రిగింది చెన్నైలో..!

చెన్నైలోని ఓ హాస్పిట‌ల్‌కు ఈ నెల 17వ తేదీన రాత్రి ఓ వ్యాపారవేత్త త‌న ఆడి కారులో వ‌చ్చాడు. అయితే అత‌ను అప్ప‌టికే పీక‌ల‌దాకా మ‌ద్యం సేవించి ఉన్నాడు. అయిన‌ప్ప‌టికీ త‌న స్నేహితుడికి గాయాలు అవ‌డంతో అత‌ను త‌న ఆడి కారులో త‌న స్నేహితున్ని హాస్పిట‌ల్‌కు తీసుకొచ్చి దిగ‌బెట్టాడు. కొంత సేప‌టి త‌రువాత ఆ వ్యాపార వేత్త ఇంటికి బ‌యల్దేరాడు. అయితే తాను తీసుకొచ్చిన ఆడి కారు కాకుండా హాస్పిట‌ల్ ఆంబులెన్స్‌ను అత‌ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. అత‌ను ఆంబులెన్స్‌ను త‌న కారు అనుకున్నాడు. అందుకే ఆంబులెన్స్‌ను డ్రైవ్ చేస్తూ ఇంటి కెళ్లాడు. ఆ హాస్పిట‌ల్‌కు అత‌ని ఇంటికి 13 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది.

అయితే ఇంటికెళ్లాక ఇంట్లో ఆ వ్యాపార‌వేత్త కుటుంబ స‌భ్యులు ఆడి కారు ఏది అని అడ‌గ‌డంతో అప్పుడు అత‌ను స్పృహ‌లోకి వ‌చ్చాడు. అయితే అప్ప‌టికే అర్థ‌రాత్రి 3 గంట‌లు అయింది. ఈ క్ర‌మంలో హాస్పిట‌ల్ వారు ఆంబులెన్స్ మిస్ అయింద‌ని తెలుసుకుని పోలీసుల‌కు కంప్లెయింట్ ఇచ్చారు. వారు కంప్లెయింట్ తీసుకుని ఆంబులెన్స్‌ను వెదికే ప‌నిలో ప‌డ్డారు. అయితే మ‌రో ప‌క్క స‌ద‌రు వ్యాపార వేత్త ఆంబులెన్స్‌ను తెచ్చాన‌ని తెలుసుకోవ‌డంతో త‌న డ్రైవ‌ర్‌కు ఆ ఆంబులెన్స్‌ను ఇచ్చి హాస్పిట‌ల్‌లో ఇచ్చి వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్పి ర‌మ్మ‌న్నాడు. దీంతో ఆ డ్రైవ‌ర్ అలాగే చేశాడు. అయితే ఆ వ్యాపార వేత్త ఆ ఆంబులెన్స్‌ను తీసుకువెళ్లే స‌మ‌యంలో దాని రియ‌ర్ వ్యూ మిర్ర‌ర్ పగిలింది. దానికి కూడా న‌ష్ట‌ప‌రిహారం క‌ట్టిస్తామ‌ని చెప్ప‌డంతో హాస్పిట‌ల్ వారు ఇక ఆ వ్యాపార వేత్త‌పై కేసు ఏమీ పెట్ట‌లేదు. చూశారుగా.. మ‌ద్యం మ‌త్తులో అత‌ను ఎలా ప్ర‌వ‌ర్తించాడో..! నిజంగా ఇది షాకింగే మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top