ఈ ఆకుకూర తినడం వల్ల కలిగే 8 లాభాలేంటో మీకు తెలుసా..? ఇంతకీ అదేం ఆకంటే..!

మ‌నం త‌ర‌చూ వండుకు తినే కూర‌గాయ‌ల్లో మున‌గ‌కాయ‌లు కూడా ఒక‌టి. వీటిని చారులో వేసుకోవ‌చ్చు లేదంటే కూర, ప‌చ్చ‌డి గాను చేసుకు తిన‌వచ్చు. ఎలా తిన్నా మున‌గ‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. అయితే మీకు తెలుసా..? కేవ‌లం మున‌గ‌కాయ‌లే కాదు, మునగ ఆకుల వ‌ల్ల కూడా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు కూడా. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలో మున‌గ ఆకుల వ‌ల్ల ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పోష‌కాల గ‌ని…
మున‌గ చెట్టు ఆకుల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. దీంతోపాటు విట‌మిన్ బి6, విటమిన్ ఎ, ప్రోటీన్లు, విట‌మిన్ బి2, ఐర‌న్‌, మెగ్నిషియం వంటి ముఖ్య‌మైన పోష‌క ప‌దార్థాలు మున‌గ ఆకుల్లో పుష్క‌లంగా ఉన్నాయి. నిత్యం మున‌గ ఆకును మ‌న ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో ముందు చెప్పిన పోష‌కాల‌న్నీ మ‌న‌కు అందుతాయి.

దృఢ‌మైన ఎముక‌ల‌కు…
మున‌గ చెట్టు ఆకుల‌ను నిత్యం కూర‌, లేదా ర‌సం రూపంలో ఏదో ఒక విధంగా తీసుకున్న‌ట్ట‌యితే దాంతో శ‌రీరానికి కాల్షియం, ఐర‌న్ పుష్క‌లంగా అందుతాయి. దీంతో ఎముక‌లకు బ‌లం చేకూరుతుంది. అవి దృఢంగా మారుతాయి.

క్యాన్స‌ర్‌ను నిరోధిస్తుంది….
మున‌గ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉన్నాయి. ఇవి శ‌రీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్స‌ర్‌లు దూర‌మ‌వుతాయి. క‌ణ‌జాలాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటాయి. విట‌మిన్ సి, బీటా కెరోటిన్‌లు కూడా ఉండ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ కార‌క ప‌దార్థాలు నాశ‌న‌మ‌వుతాయి.

త‌ల‌నొప్పికి…
మున‌గ చెట్టు వేళ్ల‌ను తీసుకుని బాగా క‌డిగి వాటిని జ్యూస్‌లా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని నిత్యం బెల్లంతోపాటు తీసుకుంటుంటే త‌ల‌నొప్పి మాయ‌మ‌వుతుంది.

కంటి సంబంధ స‌మ‌స్య‌లు…
కొన్ని మున‌గ ఆకుల‌ను తీసుకుని పేస్ట్‌లా చేసి దానికి కొంత తేనెను క‌లిపి కంటి రెప్ప‌ల‌పై పెట్టుకుంటే నేత్ర సంబంధ స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. దృష్టి బాగా ఉంటుంది. కంటి వాపు కూడా త‌గ్గుతుంది. కురుపులు న‌య‌మ‌వుతాయి.

మ‌ధుమేహానికి…
మున‌గ చెట్టు ఆకుల‌ను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి. దీన్ని నిత్యం 7 గ్రాముల మోతాదులో ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో మధుమేహం ఉన్న వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. షుగ‌ర్ కంట్రోల్ అవుతుంది.

ర‌క్త శుద్ధికి, వృద్ధికి…
మున‌గ చెట్టు ఆకుల్లో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకుల‌కు చెందిన ర‌సాన్ని నిత్యం కొంత మోతాదులో తాగుతున్న‌ట్ట‌యితే ర‌క్తం శుద్ధి అవుతుంది. అందులో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి.

యాంటీ ఏజింగ్‌..
మున‌గాకు ర‌సాన్ని తాగితే వృద్ధాప్యం కార‌ణంగా శ‌రీరంపై వ‌చ్చే ముడ‌తలు పోతాయి. యాంటీ ఏజింగ్ గుణాలు ఈ ఆకుల్లో పుష్క‌లంగా ఉన్నాయి.

Comments

comments

Share this post

scroll to top