జీవితమంతా హ్యాపీగా గ‌డ‌పాలంటే ఈ మూడింటిని వ‌దిలేయాల‌ని గ‌రుడ పురాణం చెబుతోంది..!

ఎలాంటి ఇబ్బందులు, క‌ష్టాలు, క‌న్నీళ్లు లేకుండా జీవితం హ్యాపీగా, జాలీగా గ‌డిచిపోవాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి..? అందుకోస‌మేగా ప్ర‌తి ఒక్క‌రు ప‌నిచేసేది, క‌ష్ట‌ప‌డేది. కానీ అంద‌రూ తాము అనుకున్న సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని అంత ఈజీగా సాధించ‌లేరు లెండి. దేనికైనా అదృష్టం ఉండాలి అని అందుకే అంటారు. అయితే చాలా క‌ష్ట‌ప‌డ‌డం, శ్రమించ‌డం వ‌ల్ల జీవితంలో సంతోషంగా జీవించ‌వ‌చ్చని ఎవ‌రైనా చెబుతారు, అది నిజ‌మే కానీ, గ‌రుడ పురాణం ప్ర‌కారం కింద పేర్కొన‌బ‌డిన ప‌లు అంశాల‌ను వెంట‌నే విడిచిపెట్ట‌డం వ‌ల్ల కూడా జీవితంలో సంతోషం నెల‌కొంటుంద‌ట‌. దీంతో జీవితాన్ని హాయిగా, సుఖ సంతోషాలతో గ‌డ‌ప‌వ‌చ్చ‌ట‌. ఇంత‌కీ, గ‌రుడ పురాణంలో పేర్కొన‌బ‌డిన ఆ అంశాలు ఏమిటంటే…

addtext_com_MDQxMTQwNzI3MDk

 

 

డ‌బ్బులు అప్పు తీసుకోవ‌డం…
స‌మాజంలో ఎవరైనా క‌ష్ట‌ప‌డి డ‌బ్బు సంపాదించి జీవితం హాయిగా గ‌డ‌పాల‌నే కోరుకుంటారు. కానీ కొంద‌రు మాత్రం ఎల్ల‌ప్పుడూ త‌మ త‌మ బంధువులు, స్నేహితుల వ‌ద్ద అప్పులు చేస్తూ, డబ్బు తీసుకుంటూ, దాన్ని తీర్చే ఉద్దేశం ఏ కోశానా లేక అలా బ‌తికేస్తుంటారు. అయితే అలా బ‌తికితే జీవితంలో సంతోషం ఏమాత్రం ఉండ‌ద‌ట‌. ఎల్ల‌ప్పుడూ టెన్ష‌న్‌, ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న ఉంటాయ‌ట‌. కాబ‌ట్టి అలా డ‌బ్బులు అప్పు తీసుకునే మ‌న‌స్త‌త్వాన్ని వ‌దిలి వేయాల‌ని గ‌రుడ పురాణం చెబుతోంది.

స్త్రీల‌ను గౌర‌వించ‌క‌పోవ‌డం…
స‌మాజంలో స్త్రీల‌ను గౌర‌వించ‌ని పురుషులు కూడా సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌లేర‌ట‌. అలాంటి పురుషులు ఎల్ల‌ప్పుడూ ఎవ‌రితోనూ స‌త్సంబంధాల‌ను కొన‌సాగించ‌లేర‌ట‌. కాబ‌ట్టి గ‌రుడ పురాణం ఇలాంటి మ‌న‌స్త‌త్వాన్ని కూడా వ‌దిలేయాల‌ని చెబుతోంది. స్త్రీల‌ను ఎల్ల‌ప్పుడూ గౌర‌విస్తేనే అలాంటి పురుషుల‌కు స‌మాజంలో గౌర‌వం ద‌క్కుతుంద‌ని, వారు ఎప్పటికీ సంతోషంగా జీవిస్తార‌ని గ‌రుడ పురాణం చెబుతోంది.

drop-things

జూదం ఆడ‌డం…
జూదం ఆడే వ్య‌క్తుల‌కు జీవితంలో అన్నీ క‌ష్టాలే ఎదుర‌వుతాయ‌ట‌. అలాంటి వారు ఎప్ప‌టికీ సంతోషంగా ఉండ‌లేర‌ట‌. జీవించ‌లేర‌ట‌. శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను అనుభ‌విస్తార‌ట‌. ఇత‌రుల‌తో స‌త్సంబంధాల‌ను కూడా కోల్పోతార‌ట‌. కాబ‌ట్టి జూదం ఆడ‌డం వ‌దిలేయాల‌ని గ‌రుడ పురాణం చెబుతోంది.

Comments

comments

Share this post

scroll to top