స్మార్ట్ ఫోన్లలో మస్త్ మస్త్ ఫీచర్స్ పిచ్చెక్కిస్తుంటాయ్… కానీ వాటితో ఉన్నదల్లా ఒకటే ప్రాబ్లమ్…. పుసుక్కున చేయిజారి కింద పండిదో పుటుక్కుమంటుంది డిస్ ప్లే..ఇక దాని కోసం సెల్ ఫాప్ కు పోతం మనం, సార్ స్టాక్ లేదంటూ వాడు. ఉన్నా దీనికి సెట్ అవ్వదు అంటాడు. మన కోపమేమో నషాలనికి అంటుతుంటది. ఇదిగో ఆ బాధలకు చెక్ పెట్టడానికి మోటరోలా కంపెనీ ఓడు మస్త్ ఐడియాతో ముందుకొచ్చిండు
షట్టర్ షీల్డ్ అనే ప్రత్యేకమైన టెక్నాలజీతో ఓ కొత్త ఫోన్ ను తీసుకొచ్చారు మోటరోలా కంపెనీ వాళ్ళు, దీని విశేషమేమంటే ఇది పొరపాటున చేయిజారి కిందపడినా కూడా దాని డిస్ ప్లే కు ఎటువంటి నష్టము జరుగదు. కనీసం చిన్న గీతలు కూడా పడవు. ఎత్తు నుంచి కింద పడినప్పటికి తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా డిజెన్ చేశారు ఫోన్ .మీకు డౌటుంటే ఈ టెస్టింగ్ వీడియో ను చూడండి.
Watch Testing Video: