అతని అయిదేళ్ళ కష్టానికి ఫలితం..డ్రైవర్ లేకుండా నడిచే కారు తయారీ.

ఒకసారి ఎయిర్ పోర్ట్ నుండి ఇంటికి వస్తుండగా క్యాబ్ డ్రైవర్ నిద్రపోవడంతో, డ్రైవర్ కు బదులుగా నేను డ్రైవింగ్ చేయవలసి వచ్చింది. అప్పుడనిపించింది డ్రైవర్ లేని కారును తయారుచేయాలని. అలా ఐదేళ్ళ కష్టానికి ఫలితే ఈ  డ్రైవర్ లేని కారు.  అంటాడు డా. రోషి జాన్, దీనికే  ‘అటానమస్ కారు’ అని పేరు పెట్టుకున్నాడాయన. డ్రైవర్ లేని కార్ రూపొందించాలి, దానికి ఏ కారైతే సూట్ అవుతుందోనని తన టీం మెంబర్స్  చర్చించి  చివరకు నానో కార్ తో ఈ ప్రయోగాన్ని సూపర్ సక్సెస్ చేశాడు రోషి టీసీఎస్ లో రోబోటిక్స్ మరియు కాగ్నటిక్స్ విభాగానికి హెడ్ గా పనిచేస్తున్న రోషీ జాన్ ఇంతకుముందు కొన్ని పరిశ్రమలకు రోబోలను తయారుచేశాడు. అదే రోబోటిక్ నాలెడ్జ్ ను డ్రైవర్ లేని కారు తయారీకి ఉపయోగించాడు.

నానో కారును సెలెక్ట్ చేసుకొని, వాటికి ఆక్యుయేటర్స్ మరియు సెన్సార్ లను బిగించాడు. దీనికి ఆటోమేటిక్ గా నడిచే గేర్లను అమర్చాడు. అలా ఐదేళ్ళ నిరీక్షణ తర్వాత మొదట ఈ అటానమస్ కారును ఎవరూలేని ప్రదేశంలో ప్రయోగం చేశారు. ఆ తర్వాత బిజీగా ఉన్న రోడ్లపైనా ఈ డ్రైవర్ లేని కారును నడిపించి విజయవంతం అయ్యాడు. డ్రైవర్ సహాయం లేకుండా, సెన్సార్, కెమెరాలు చెప్పిన ప్రకారం గమ్యస్థానానికి చేర్చే ఈ డ్రైవర్ లేని కారును కేవలం ఒక గంట వ్యవధిలోనే రోషి అండ్ టీమ్ ఏర్పాటు చేస్తుంది. 

ఈ ప్రయోగం చేసేటప్పుడు మొదట్లో కొన్ని సమస్యలు ఎదురైనా, ఆ తర్వాత మాత్రం ఎంతో కష్టపడి ఆ సమస్యలను అధిగమించామని, నేను చాలా గర్వపడుతున్నానని అన్నాడు. ఎందుకంటే కార్పోరేట్ సంస్థలతో ఎలాంటి సంబంధం లేకుండా భారతదేశంలో ఒక భారతీయుడు కనుగొన్నది కాబట్టి.  అంతకుముందు గూగుల్, ఆపిల్, సాంసంగ్ వంటి సంస్థలు డ్రైవర్ లేని కారును నిర్మించాయి.
 
Watch Video:

Comments

comments

Share this post

scroll to top