ప్రయాణికులతో నిండుగా ఉన్న బస్ బయలు దేరింది. మరో గంట అయితే ఎవరి గమ్యస్థానాలకు వారు చేరతారు. బస్ మంచి స్పీడ్ లో ఉంది. కొంతమంది బుక్స్ చదువుతున్నారు, మరికొంత మంది పాటలు వింటున్నారు. డ్రైవర్ మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నాడు. అంతలోనే ఎక్కడి నుండి వచ్చిందో ఏమో…?! ఓ ఇనుప ముక్క చాలా వేగంతో గాలిలో ఎగురుతూ వచ్చింది, అది అదే వేగంతో బస్ అద్దాలను పగులగొట్టుకొని డ్రైవర్ కు గుండెకు పక్కగా గుచ్చుకుంది. ఆ దెబ్బకు డ్రైవర్ కళ్లు తిరిగుతున్నాయ్. కానీ తన కర్తవ్యం తనకు గుర్తొచ్చింది. తాను చావుబతుకుల మద్య ఉన్నప్పటికీ…. ఎంతగానో కష్టపడి బ్రేక్ వేశాడు. బ్రేక్ వేయడం, బస్ ఆగడం క్షణాల్లో జరిగిపోయాయ్. ఏంజరిగిందో తెలుసుకోడానికి వచ్చిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. తమను కాపాడిన ఆ డ్రైవర్ లో దేవుడిని చూశారు ఈ ప్రయాణికులు. ఈ ఘటన 3 సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ…… ఇప్పటికీ కూడా ఆ ప్యాసింజర్స్ ఆ డ్రైవర్ ను తలుచుకొని…ఆ దుర్ఘటన జరిగిన రోజును గుర్తుచేసుకొని మరీ..అతడికి గ్రీటింగ్స్ చెబుతున్నారు. తమ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా…..!
Watch Video: