రూ.80 వేలున్న బాగ్ ను ఆమె ఆటోలో మరిచిపోయింది.! తర్వాత ఆటో డ్రైవర్ తెచ్చిస్తే ఆమె ఏం చేసిందో తెలుసా.?

నేటి త‌రుణంలో నీతి, నిజాయితీలు అనేవి లేవు. దాదాపుగా చాలా మంది నిజాయితీగా ఉండ‌డం లేదు. అవి ఉన్న వారు నూటికో, కోటికో ఒక్క‌రు ఉంటున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మేం చెప్ప‌బోయే అత‌ను ఉన్నాడు. అత‌ను ఆటోడ్రైవర్‌. కానీ నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు. ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు త‌న ఆటోలో భారీగా న‌గ‌దు ఉన్న‌ బ్యాగ్ మ‌రిచిపోగా దాన్ని ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. దీంతో అత‌నికి ఆ మ‌హిళ అత‌ను ఊహించ‌ని బ‌హుమ‌తి ఇచ్చింది. ఇంత‌కీ అస‌లు జ‌రిగిన విష‌యం ఏమిటంటే…

అది ముంబైలోని చెంబుర్ అనే ప్రాంతం. అక్క‌డ స‌ర‌ళా నంబూద్రి (68) అనే మ‌హిళ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను న‌డుపుతోంది. అయితే గ‌తేడాది డిసెంబ‌ర్ 21వ తేదీన ఆమె మ‌ధ్యాహ్నం స్కూల్ అయిపోగానే అక్క‌డికి కొంత దూరంలో పార్క్ చేసి ఉన్న త‌న కారు ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకు ఓ ఆటోను పిలిచింది. అందులో ఆమె వెళ్లింది. కార్ ద‌గ్గ‌ర‌కు చేరుకుని అందులో ఎక్కి కొంత దూరం ప్ర‌యాణించ‌గానే అప్పుడు ఆమెకు గుర్తుకు వ‌చ్చింది. తాను ఆటోలో త‌న బ్యాగ్ వ‌దిలివెళ్లాన‌ని గుర్తించింది. అందులో రూ.80వేల న‌గ‌దు, త‌న డెబిట్‌, క్రెడిట్ కార్డులు, ఇంటితాళాలు, పాన్ కార్డు త‌దిత‌ర ముఖ్య‌మైన ప‌త్రాలు, న‌గ‌దు ఉన్నాయి. దీంతో ఒక్క‌సారిగా స‌ర‌ళా షాక్‌కు గురైంది.

అలా త‌న బ్యాగ్ ఆటోలో వ‌దిలాన‌ని గ్ర‌హించిన స‌ర‌ళా వెంట‌నే త‌న‌ను ఆ ఆటోడ్రైవర్ దింపిన ప్రాంతం వ‌ద్ద‌కు వెళ్లింది. అక్క‌డ ఆటో లేదు. ప‌క్క‌నే ఉన్న పాన్ షాప్ అత‌నిని అడిగింది. అయినా ఆటో డ్రైవ‌ర్ వివ‌రాలు తెలియ‌లేదు. దీంతో ఆమె చేసేది లేక పోలీసుల‌కు ఫిర్యాదు చేద్దామ‌ని అనుకుంది. కానీ అంత‌లోనే ఆ ఆటోడ్రైవ‌ర్ వ‌చ్చి ఆమెకు బ్యాగ్ తిరిగిచ్చి వెళ్లిపోయాడు. అయితే మొద‌ట షాక్ తిన్నా, త‌రువాత అత‌ని వివ‌రాల‌ను తీసుకోనందుకు ఆమె సిగ్గుప‌డింది. త‌రువాత అత‌ని వివ‌రాల కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. దీంతో చివ‌ర‌కు ఎలాగో క‌నుక్కొంది. అత‌ని పేరు అమిత్ గుప్తా అని తెలిసింది. దీంతో అత‌న్ని స్కూల్‌కు ర‌ప్పించి అత‌నికి రూ.10వేలు న‌గదు బ‌హుమ‌తి ఇచ్చింది. త‌రువాత అత‌ని ఆర్థిక స్థితి బాగాలేద‌ని తెలుసుకుని అత‌ని ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌న స్కూల్‌లో ఉచితంగా చ‌దువు చెప్పిస్తాన‌ని మాట ఇచ్చింది. అలాగే చేసింది. ఏది ఏమైనా.. ఆ ఇద్ద‌రూ చేసింది చాలా మంచి ప‌నే క‌దా.

Comments

comments

Share this post

scroll to top