కాఫీలో ఈ మిశ్ర‌మాన్ని క‌లుపుకొని తాగితే.., నెల‌కు 5-7 KG ల బ‌రువు త‌గ్గుతారు.

చ‌ల్ల‌ని వేకువ జామున వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ మ‌జాయే వేరుగా ఉంటుంది క‌దా. ఒక్కో కాఫీ గుట‌క వేస్తూ దాన్ని ఆస్వాదిస్తుంటే… వాహ్‌… అది అందించే రుచి, తాజాద‌నం… మాటల్లో చెప్ప‌లేం. అలా కాఫీ తాగి చాలా మంది త‌మ రోజును ప్రారంభిస్తారు. ఇంకొంద‌రైతే బెడ్‌పై ఉండే వేడి వేడి కాఫీని ఆస్వాదించి గానీ త‌మ రోజును మొద‌లు పెట్ట‌రు. అయితే కాఫీ ఎలా తాగినా అందులో ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ మిశ్ర‌మాన్ని క‌లుపుకుని తాగి చూడండి. దాంతో ఏం జ‌రుగుతుందో కొన్ని రోజుల్లో మీరే గ‌మ‌నిస్తారు. అలా కాఫీ తాగితే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మాత్ర‌మే కాదు, ఒంట్లో ఉన్న కొవ్వు కూడా ఇట్టే క‌రిగిపోతుంద‌ట‌. నెల‌కు క‌నీసం ఎంత లేద‌న్నా 5 నుంచి 7 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గుతార‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు. ప‌లువురు సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌న‌ల ఫ‌లితం. ఇంత‌కీ కాఫీలో క‌ల‌పాల్సిన ఆ మిశ్ర‌మం ఏమిటో తెలుసా..?

coffee-for-fat
3/4 క‌ప్పు కొబ్బ‌రి నూనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిల‌ను తీసుకుని బాగా క‌ల‌పాలి. కొబ్బ‌రి నూనె (వంట‌ల్లో వాడేది) మ‌న‌కు మార్కెట్‌లో దొరుకుతుంది. లేదంటే నూనె గానుగల ద్వారా ల‌భించేది కూడా వాడ‌వ‌చ్చు. అయితే ఆ రెండింటినీ బాగా క‌లిపి చ‌క్క‌ని పేస్ట్‌లా త‌యారు చేసుకోవాలి. దీనికి కావాల‌నుకుంటే తేనె, కోకో పౌడ‌ర్ కూడా క‌ల‌ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో వాటిని మిశ్ర‌మంగా క‌లిపి ఓ జార్‌లో నిల్వ చేసుకుని దాన్ని ఫ్రిజ్‌లో పెట్టేయాలి. రోజూ మీరు కాఫీ తాగేట‌ప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని అందులో క‌ల‌పాలి. అనంత‌రం ఆ కాఫీని తాగాలి. ఇలా క‌నీసం నెల రోజుల పాటు చేయండి. దీంతో మీ శ‌రీరంలో క‌లిగే అద్భుత‌మైన మార్పును మీరే గ‌మ‌నిస్తారు.

fat-reduce
పైన చెప్పిన విధంగా కాఫీ తాగ‌డం వ‌ల్ల నెల‌కు 5 నుంచి 7 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గుతార‌ట‌. దీన్ని సైంటిస్టులు ప‌రిశోధించి చెబుతున్నారు కూడా. అమెరికాకు చెందిన ఓ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌క బృందం ఈ మిశ్ర‌మంపై ప్ర‌యోగాలు చేసి బ‌రువు త‌గ్గుతార‌ని తేల్చి చెప్పింది. కాఫీ, కొబ్బ‌రినూనె, దాల్చిన చెక్క పొడిల‌లో కొవ్వును క‌రిగించే ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ట‌. ఈ క్ర‌మంలో వీటిని రోజూ తీసుకుంటుంటే శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంద‌ని స‌ద‌రు సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, ఇలా కాఫీ తాగ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటార‌ట‌.

Comments

comments

Share this post

scroll to top