ఒళ్ల నొప్పులు లేదా శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పి కలిగితే చాలు, వెంటనే పారాసిటమాల్ లేదా ఇతర ఏదో ఒక నొప్పి మాత్ర వేసుకోవడం చాలా మందికి అలవాటు. కానీ దాంతో దీర్ఘకాలింగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎవరూ పట్టించుకోరు. అయితే ఇది సరే… ఇప్పటి వరకు చాలా మందికి తెలిసిన విషయమిది. ఇప్పుడేంటి..? అంటారా..? ఏమీ లేదండీ..! ఇకపై మీకు నొప్పి కలిగితే పారాసిటమాల్ జోలికి పోకండి. మరి దేన్ని వేసుకోవాలి..? అనేగా మీ డౌట్..! దేన్ని వేసుకోవాలి కాదు, దేన్ని తాగాలి అని అడగండి. సరే… నొప్పి కలిగితే దేన్ని తాగాలి..? దేన్నో ఏమిటి..! ఎంచక్కా కొంచెం బీర్ పట్టించేసేయండి..! అవును, మీరు విన్నది కరెక్టే..!
ఏంటీ… నొప్పి కలిగితే బీర్ తాగమని చెబుతున్నారు..! ఇంకేమైనా ఉందా..? అని అంటారా..! అవును, మేం చెబుతోంది నిజమే. మీరు ఏమైనా అనుకోండి. ఎందుకంటే ఆ మాట మేం అంటున్నది కాదు, సాక్షాత్తూ సైంటిస్టులు చెబుతున్నదే. వారు చేసిన పరిశోధనలను బట్టి మీకు ఆ విషయం చెబుతున్నాం. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… పారసిటమాల్ మాత్ర కన్నా బీరు మెరుగైన పెయిన్‌కిల్లర్‌గా పనిచేస్తుందట. బీరును కొద్దిపాటి మోతాదులో తీసుకుంటే పారసిటమాల్ మాత్ర కన్నా బాగా పనిచేసినట్లు తమ పరిశోధనలో తేలిందని పరిశోధకులు తెలిపారు.
గ్రీన్విచ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 400 మందిపై 18 రకాల పరిశోధనలు చేశారు. మెదడు గ్రాహకంపై పనిచేయడం ద్వారా నొప్పి తీవ్రతను, ఆందోళనను బీరు తగ్గిస్తుందా, లేదా అనే విషయంపై అధ్యయనం చేశారు. ఎక్కువ బీరు తాగిన వ్యక్తులకు తక్కువ నొప్పి ఉన్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని వారు పేర్కొన్నారు. బీరు తాగిన వ్యక్తుల్లో ఆల్కహాల్ సమర్థవంతమైన పెయిన్‌కిల్లర్‌గా పనిచేసినట్లు బలమైన ఆధారం కనుగొన్నామని ఆ సైంటిస్టులు వివరించారు. పారసిటమాల్ మాత్ర కన్నా ఆల్కహాల్ మరింత ప్రభావం చూపింది అని ట్రెవర్ థాంప్సన్ అనే శాస్త్రవేత్త చెప్పారు. దుష్ప్రభావాలు లేని మందులనూ ఆల్కహాల్‌తో తయారు చేయవచ్చని అన్నారు. దీన్ని బట్టి తెలిసింది ఏమిటంటే… నొప్పి కలిగినప్పుడు మాత్ర వేసుకోకుండా కొంచెం బీర్ తాగితే చాలు, నొప్పి మటాష్ అవుతుందని వారు చెబుతున్నారు. అయితే ఆ బీర్ అనేది పరిమితంగా మాత్రమే తీసుకోవాలి సుమా, పెయిన్ కిల్లర్ కదా అని చెప్పి ఎక్కువ తాగితే అప్పుడు ఎఫెక్ట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది..!