ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక రకాల వైద్య విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరికి నచ్చిన వైద్య విధానంలో వారు తమ తమ అనారోగ్యాలకు చికిత్స చేయించుకుంటారు. అయితే ఆయా వైద్య విధానాల్లో కొన్ని మనకు ఆశ్చర్యాన్ని, వింతను కలిగించే విధంగా ఉంటాయి. వాటిని చూస్తే షాక్ అవుతాం. ఇప్పుడు మేం చెప్పబోయే ఓ వైద్య విధానం కూడా ఇదే కోవకు చెందుతుంది. వింటే షాకవుతారు. అది ఏంటంటే… ఆ డాక్టర్ తన వద్దకు వచ్చే పేషెంట్లకు మందు మాకు ఇవ్వదు. వాటికి బదులుగా తన పేషెంట్లను కొరుకుతూ మసాజ్ చేస్తుంది. దీంతో వ్యాధి తగ్గిపోతుందట. అవును, షాకింగ్‌గానే ఉన్నా ఇది నిజమే.
‘
ఆమె పేరు డోర్తి స్టెయిన్. కొందరు ఆమెను డాక్టర్ డాట్ అని కూడా పిలుస్తారు. ఈమెది అమెరికాలోని న్యూజెర్సీ. అయితే డోర్తి 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే ఈ కొరుకుడు మసాజ్‌ను కనిపెట్టింది. ఓ రోజున తన తల్లికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆమె శరీరాన్ని స్టెయిన్ సున్నితంగా కొరుకుతూ మసాజ్ చేసింది. దీంతో తన తల్లికి వచ్చిన అనారోగ్య సమస్య పోయింది. ఇక అప్పటి నుంచి స్టెయిన్ కొరుకుడు మసాజ్‌ను, చికిత్సను ప్రాక్టీస్ చేస్తూనే ఉంది.
మొదట్లో డోర్తి స్టెయిన్ ఉచితంగానే కొరుకుడు మసాజ్ చేసేది. కానీ అది క్రమంగా పాపులర్ అవడంతో ఇక ఆమె తాను అందిస్తున్న కొరుకుడు మసాజ్ సేవకు చార్జి వసూలు చేయడం మొదలు పెట్టింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా అలా డోర్తి స్టెయిన్ కొరుకుడు మసాజ్ చేస్తోంది. అంతేకాదు, పలు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈమెచేత కొరుకుడు మసాజ్ చేయించుకుంటారట. కేటీ పెర్రీ, ఎమినెమ్, రాబర్ట్ ప్లాంట్, కోర్ట్నీ లవ్ తో పాటు చాలా మంది సెలబ్రిటీలు ఈమె దగ్గర కొరికించుకుంటూ మసాజ్ చేయించుకుంటారు. ఇక ఈమెతో ఒకసారి ఎవరైనా కొరుకుడు మసాజ్ చేయించుకుంటే వారు ఈమెకు రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోతారట.
అలా డోర్తి స్టెయిన్ ఇప్పుడు కొరుకుడు మసాజ్ చేస్తూ సేవలు అందిస్తోంది. ఆమె వద్దకు చాలా మంది పేషెంట్లు వచ్చి పోతుంటారు. ఇప్పుడు ఈమె తన కొరుకుడు మసాజ్ కు గంటకు 150 నుంచి 250 డాలర్ల వరకు తీసుకుంటుందట. అలాగే విత్ ఆయిల్, వితౌట్ ఆయిల్ అని చెప్పి రక రకాలుగా ఈమె మసాజ్ చేస్తుందట. దీంతో ఆమె మసాజ్ కోసం చాలా మంది ఆమె వద్దకు వస్తున్నారు. అవును మరి, ఎవరైనా ఏదైనా వింతగా చేస్తే అది జనాలకు నచ్చుతుంది కదా..!