భార‌త్‌లో గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్స‌ప్‌ల‌ను ఎవ‌రూ వాడ‌వ‌ద్దన్న సునీల్ మిట్ట‌ల్‌… ఎందుకో తెలుసా..?

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఆ ప‌ద‌విలోకి రాక ముందు నుంచే త‌మ దేశంలో ప‌నిచేస్తున్న భార‌తీయుల‌ను వెన‌క్కి పంపిస్తామ‌ని, ఇకపై వ‌చ్చే భార‌తీయుల‌కు కూడా నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తామ‌ని చెబుతూ వ‌చ్చాడు. అన్న‌ట్టుగానే అంత పనీ చేశాడు. మ‌న దేశం నుంచి అమెరికా వెళ్లి పనిచేసే వారికి వీసా నిబంధ‌న‌ల‌ను క‌ఠినత‌రం చేశాడు. దీంతో ఐటీ ఉద్యోగుల‌కు పెద్ద సంఖ్య‌లో దెబ్బ ప‌డింది. ఈ క్ర‌మంలో వారు ఇక‌పై అమెరికా వెళ్ల‌డం చాలా క‌ష్ట‌మే కానుంది. అయితే మ‌న దేశానికి చెందిన ఐటీ ఉద్యోగుల‌ను అమెరికాలో అడుగు పెట్ట‌నివ్వ‌డం లేదు, కరెక్టే..! కానీ మ‌రి… వాళ్ల దేశానికి చెందిన స‌ర్వీసుల‌ను మ‌నం ఎందుకు వాడాలి..? ముఖ్యంగా ఇంట‌ర్నెట్‌, సోష‌ల్ ప్ర‌పంచాల‌ను శాసిస్తున్న గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్స‌ప్ వంటి అమెరికా యాప్‌ల‌ను మ‌నం ఎందుకు వాడాలి..? ఇదే ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు ఆయ‌న‌..!

భార‌తీ ఎయిర్ టెల్ చైర్మ‌న్ సునీల్ మిట్ట‌ల్ ఉన్నారు క‌దా..! ఆయ‌నే తాజాగా పైన చెప్పిన ఆ వ్యాఖ్య‌లు చేశారు. అవును మ‌రి, అది కరెక్టే క‌దా. మ‌న ఉద్యోగులను అక్క‌డ అడుగు పెట్ట‌నివ్వ‌ట్లేదు క‌దా, అలాంట‌ప్పుడు వారి యాప్స్‌ను మ‌నం ఎందుకు వాడాలి..? అంటున్నారీయ‌న‌. అందులో నిజం ఉంది క‌దా. ఇంకా సునీల్ మిట్ట‌ల్ ఏమంటున్నారంటే… అమెరికా తీసుకున్న నిర్ణయం భార‌త ఐటీ నిపుణుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని అన్నారు. అమెరికా వ్యాపార సంస్థ‌ల‌కు భార‌త్‌లో కార్యాల‌యాలు ఉన్నాయ‌ని ఆ విష‌యం అమెరికా గుర్తుంచుకుంటే బాగుంటుంద‌న్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, గూగుల్ లాంటి సంస్థ‌ల‌కు భార‌త్ గుడ్ బై చెబితే ప‌రిస్థితి ఎలాగుంటుందో ఊహించుకోవాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

భార‌త్‌లో సొంతంగా రూపొందించిన సోష‌ల్ మీడియా యాప్స్ చాలా ఉన్నాయ‌ని అలాంట‌ప్పుడు అమెరికాలో రూపొందించిన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, గూగుల్ యాప్స్‌ను భార‌త్ ఎందుకు ఉప‌యోగించాల‌ని మిట్ట‌ల్ ప్ర‌శ్నించారు. అమెరికా కంపెనీలు భార‌త్‌లోకి ప్ర‌వేశించి చాలా లాభాలు ఆర్జిస్తున్నాయ‌ని మ‌రి అలాంట‌ప్పుడు అమెరికాలో భార‌తీయుల ఎంట్రీపై ఆంక్ష‌లు స‌బ‌బు కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్‌లో ఫేస్‌బుక్‌కు 20 కోట్ల మంది యూజ‌ర్లు, వాట్సాప్‌కు 15 కోట్ల మంది,గూగుల్‌కు 10 కోట్ల మంది యూజ‌ర్లు ఉన్నార‌ని సునీల్ మిట్ట‌ల్ గుర్తు చేశారు. వారంతా ఆయా యాప్‌లు, వాటి సేవ‌లను వినియోగించుకోవ‌డం మానేస్తే అప్పుడు తెలుస్తుంద‌ని అన్నారు. భార‌త్‌లో ఓ వైపు అమెరికా కంపెనీలు వ్యాపారాలు చేసి లాభాలు గ‌డించ‌వ‌చ్చు, కానీ భార‌త ఉద్యోగులు మాత్రం అమెరికాకు ఎందుకు అవ‌స‌రం లేదు, అలాంట‌ప్పుడు వారి సేవ‌ల‌ను వాడుకోవాల్సిన అవ‌సరం మ‌న‌కేం ఉంద‌ని మిట్ట‌ల్ తెలిపారు. నిజంగా ఆయ‌న చెప్పిందాంట్లో కూడా పాయింట్ ఉంది క‌దా.! భార‌త్‌లోని యూజ‌ర్లంద‌రూ గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్స‌ప్‌ల‌ను వాడ‌డం ఆపేయాలి. అప్పుడు గానీ ట్రంప్‌కు దిమ్మ‌తిరిగి దారికి రాడు..!

 

Comments

comments

Share this post

scroll to top