ప్రెగ్నెన్సీ సమయంలో యాంటీ బయాటిక్స్ ఎక్కువగా తీసుకోకూడదు..ఎందుకో తెలుసా?

ప్రెగ్నెన్సీ టైంలో సాధారణంగా ఐరన్,కాల్షియం ట్యాబ్లెట్స్ ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు..మరీ తప్పని పరిస్థితుల్లోనే యాంటీ బయాటిక్స్ ఇస్తారు..గర్భిణులకు యాంటీ బయాటిక్స్ అంత సురక్షితం కాదు..మీరు కానీ గర్భధారణ సమయంలో యాంటీబయాటిక్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నారా? అలా చేస్తే  మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరె దెబ్బతీసినవారవుతారు.. పరిశోధకులు ఈ వాస్తవాన్ని తెలుసుకునేందుకు ఎలుకల ఫై ప్రయోగం చేసారు.గర్భధారణ సమయంలో,అలాగే తల్లిపాలను ఇచ్చే సమయంలో యాంటీబయాటిక్స్ ని మితిమీరి తీసుకోవడం శిశువుకు మంచిది కాదు…దాని వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకోండి.

  • యాంటీబయాటిక్స్ శిశువులో లాభదాయకమైన బాక్టీరియా యొక్క పెరుగుదలను దెబ్బతీయవచ్చు మరియు ఇది రోగనిరోధక వ్యవస్థలో మార్పులకు కారణమవుతుంది.
  • గర్భధారణ సమయంలో యాంటీబయాటిక్స్ ఉపయోగించడం అనేది చాలా కీలకమైనది మరియు అప్రమత్తంగా ఉండటం చాల అవసరం.
  • తల్లి శరీరంలో మార్పులు శిశువుపై కూడా ప్రభావం చూపుతాయి మరియు యాంటీబయాటిక్స్ వాడడం అనేది పిల్లలలో ప్రేగు లో ప్రమాదాన్ని పెంచుతుంది.

  • యాంటీబయాటిక్స్ సమస్య వారి పిల్లల చిన్న ప్రేగులలో సూక్ష్మజీవుల స్థాయిల మార్పుల కి కారణం కావచ్చు మరియు ఇది వారి హార్మోన్స్ ని అసంతులనం చేస్తుంది.
  • తప్పనిసరి పరిస్థితుల్లో యాంటీ బయాటిక్స్ వాడాల్సి ఉంటే డాక్టర్ ని సంప్రదించండి..పూర్తిగా వాడకూడదని కాదు కానీ మీ పిల్లల ఆరోగ్యం పట్ల మీకు జాగ్రత్త చాలా అవసరం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడాలి.చాలా వరకు అవాయిడ్ చేయడం ఉత్తమం

 

Comments

comments

Share this post

scroll to top