ఈ ఆహార ప‌దార్థాల‌ను రెండో సారి వేడి చేసి అస్స‌లు తిన‌కూడ‌దు..!

ఏ ఆహార ప‌దార్థాన్న‌యినా వేడి వేడిగా వండుకుని తింటేనే ఆ ఆహారం బాగుంటుంది. చ‌క్క‌ని రుచి ఉంటుంది. వేడిగా ఉన్న‌ప్పుడు తింటేనే పోష‌కాలు అందుతాయి. కానీ… కొంద‌రు అలా కాదా. వేడిగా ఉన్న‌ప్పుడు కాకున్నా, చ‌ల్ల‌గా అయ్యాక దాన్ని మ‌ళ్లీ వేడి చేసుకుని తింటారు. దీంతో వేడిద‌నం త‌గిలి ఆహారం బాగుంటుంద‌ని వారు అనుకుంటారు. అయితే అది ఎంత మాత్రం క‌రెక్ట్ కాద‌ట‌. నిజంగా చెప్పాలంటే… ఆహారాన్ని తిరిగి వేడి చేసుకుని తిన‌డం మంచిది కాద‌ట‌. ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన ఆహార ప‌దార్థాల‌నైతే అస్స‌లు రెండో సారి వేడి చేసుకుని తిన‌కూడ‌ద‌ట‌. అలా తింటే ఏమ‌వుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

dont-reheat-foods

ఆలుగ‌డ్డ‌లు…
ఆలుగ‌డ్డ‌ల‌ను మొద‌టి సారి వండిన‌ప్పుడే, వేడిగా ఉన్న‌ప్పుడే తినాలి. వాటితో వండిన కూర‌ను ఎక్కువ సేపు ఉన్నాక తిన‌కూడ‌దు. అలాగే ఆ కూర‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వేడి చేసి తిన‌కూడ‌దు. అలా చేయ‌డం వ‌ల్ల వాటిలో విష ర‌సాయ‌నాలు త‌యార‌వుతాయి. అవి క‌డుపులోకి వెళ్తే మ‌న‌కు వికారం, వాంతులు, ఫుడ్ పాయిజన్ వంటి స‌మ‌స్య‌ల‌ను క‌లిగిస్తాయి.

అన్నం…
బియ్యం వండిన త‌రువాత త‌యార‌య్యే అన్నంలోనూ స్పోర్స్ అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన బాక్టీరియా ఉంటుంది. ఇది స‌మ‌యం గ‌డిచిన కొద్దీ త‌న ప్ర‌భావాన్ని చూపిస్తూ ఉంటుంది. అదే చాలా ఎక్కువ సేపు ఉంచాక అలాంటి అన్నం తింటే దాంతో ఆ బాక్టీరియా పెద్ద ఎత్తున మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. అలా ఎక్కువ సేపు ఉంచిన అన్నాన్ని వేడి చేసి కూడా తిన‌కూడ‌దు. ఎందుకంటే వేడి చేసినా ఆ బాక్టీరియా చావ‌దు. అలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఆ అన్నాన్ని తింటే దాంతో డ‌యేరియా, వాంతులు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

గుడ్లు…
కోడిగుడ్లతో చేసిన కూర‌ను ఒకే సారి తినాలి. దాన్ని మ‌ళ్లీ మళ్లీ వేడి చేసి తిన‌కూడదు. అలా తింటే ఆ కూర‌లో పేరుకుపోయిన విష ప‌దార్థాలు మ‌న శ‌రీరానికి హాని చేస్తాయి. ప్ర‌ధానంగా ప‌లు జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు.

చికెన్‌…
చికెన్‌ను కూడా మొద‌టి సారి వండిన‌ప్పుడే తినాలి. రెండోసారి వేడి చేసి తిన‌కూడ‌దు. అందులో ఉండే విష ప‌దార్థాలు జీర్ణ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతాయి. అజీర్ణం స‌మ‌స్య త‌లెత్తుతుంది.

పాల‌కూర‌…
పాల‌కూర మాత్ర‌మే కాదు, ఇత‌ర ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల్లో నైట్రేట్స్, ఐర‌న్‌లు ఉంటాయి. అయితే ఆహారాన్ని ప‌దే ప‌దే వేడి చేయ‌డం వ‌ల్ల ఇవి కాస్తా నైట్రైట్స్ గా మారుతాయి. దీంతో వాటి వ‌ల్ల క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

నూనెలు…
వంట‌ల కోసం ఉప‌యోగించే నూనెల‌ను కూడా ఒకేసారి వాడాలి. ఒక‌సారి వాడిన నూనెను కాగ‌బెట్టి మ‌ళ్లీ వాడితే అందులో పేరుకుపోయి విష ప‌దార్థాలు మ‌న శ‌రీరంలోకి వెళ్లి ప‌లు వ్యాధుల‌ను క‌లిగిస్తాయి. క‌నుక నూనెల‌ను ఒకేసారి వాడ‌డం ఉత్త‌మం. వేడి చేసి మ‌ళ్లీ మ‌ళ్లీ వాడ‌కూడదు.

పుట్ట గొడుగులు…
చికెన్‌, ఎగ్స్ లాగే పుట్ట గొడుగుల్లోనూ ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందుకని వీటితో కూర వండుకుంటే ఒకేసారి తినాలి. అంతేకానీ ఆ కూర‌ను మ‌ళ్లీ వేడి చేసుకుని తిన‌కూడ‌దు. అలా తింటే వాటిలో ఉండే విష ప‌దార్థాలు గుండె స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడ‌తాయి.

బీట్ రూట్‌…
పాల‌కూర‌లాగే బీట్‌రూట్ కూడా ఉంటుంది. దీన్ని ఒకేసారి వండుకుని తినాలి. అలా వండిన దాన్ని వేడి చేసి మ‌ళ్లీ తిన‌కూడ‌దు. తింటే క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి.

Comments

comments

Share this post

scroll to top