“వాట్స్ ఆప్” లో మీరది క్లిక్ చేసారో మీ ఫోన్ డాటా మొత్తం హాకర్లకు తెలిసిపోయినట్టే! ఈ జాగ్రత్తలు పాటించండి!

వాట్స‌ప్‌..! ప్ర‌పంచ‌వ్యాప్తంగా అధిక శాతం మంది యూజ‌ర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇది. ఎన్నో కొత్త ఫీచ‌ర్లు ఎప్పటిక‌ప్పుడు వాట్స‌ప్‌లో యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్నాయి. అయితే ఆ ఫీచ‌ర్ల‌కు తోడు మ‌రోవైపు హ్యాక‌ర్ల బెడ‌ద కూడా ఎక్కువైపోయింది. తాజాగా ఓ హ్యాకింగ్ గ్రూప్ వాట్సప్‌లో బ‌గ్ (సాఫ్ట్‌వేర్ ఎర్ర‌ర్‌)ను ప్ర‌వేశ‌పెట్టి త‌ద్వారా కొన్ని వంద‌ల కోట్ల మంది యూజ‌ర్ల స‌మాచారం త‌స్క‌రించేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ దిశ‌గా ఆ గ్రూప్ ఇప్ప‌టికే అనేక మంది వాట్స‌ప్ అకౌంట్ల‌ను హ్యాక్ కూడా చేసింది. ఇంత‌కీ… అస‌లా బ‌గ్ ఏంటి..?  దాని నుంచి మ‌న‌ల్ని మ‌నం వాట్స‌ప్‌లో ఎలా ర‌క్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!


పైన చెప్పాంగా..! ఓ హ్యాకింగ్ గ్రూప్ వాట్స‌ప్‌లో బ‌గ్‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌ని. అయితే ఆ బ‌గ్ ఇమేజ్ లేదా వీడియో రూపంలో వ‌స్తుంది. ఎవ‌రైనా యూజ‌ర్‌కు అలా వ‌చ్చిన ఇమేజ్ లేదా వీడియోను క్లిక్ చేయ‌గానే అది వారి వారి ఫోన్ల‌లోకి డౌన్‌లోడ్ అవుతుంది. అయితే స‌ద‌రు ఇమేజ్ లేదా వీడియోలో నిజానికి కంటెంట్ ఏమీ ఉండ‌దు. చూసేందుకు అది మీడియా ఫైల్ లాగానే క‌నిపిస్తుంది. కానీ డౌన్‌లోడ్ చేశాక ఓపెన్ చేస్తే అందులో ఏమీ ఉండ‌దు. కానీ అలా ఓపెన్ చేసే క్ర‌మంలో అందులో ఉండే వైర‌స్ కాస్తా అటాక్ అవుతుంది. అప్పుడది ఆ యూజ‌ర్‌కు చెందిన వాట్స‌ప్ స‌మాచారం మొత్తం సేక‌రిస్తుంది. వాట్స‌ప్‌లో స‌ద‌రు యూజ‌ర్ ఎవ‌రెవ‌రితో ఏమేం చాటింగ్ చేశాడు, ఏమేం మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపాడు, అన్న వివ‌రాల‌న్నింటినీ ఆ వైర‌స్ సేక‌రించి స‌ద‌రు హ్యాకింగ్ గ్రూప్‌కు చేర‌వేస్తుంది. దీంతో వారు యూజ‌ర్ల‌ను బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇక అలాంటి ఫొటోలు, వీడియోల్లో సెన్సిటివ్ మ్యాట‌ర్ ఉన్నా లేదంటే బ్యాంకింగ్ సమాచారం ఉన్నా ఇక అంతే సంగ‌తులు. వాటికి సంబంధించిన అకౌంట్ల‌లో ఉన్న డ‌బ్బు మొత్తం నాక్కుపోతుంది. ఆ త‌రువాత బాధ‌ప‌డీ ప్రయోజ‌నం ఉండ‌దు. మ‌రి… ఈ వైర‌స్ నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోలేమా..? అంటే అందుకు కింది సూచ‌న‌లు పాటించాలి.


1. వాట్స‌ప్‌లో మీకు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి వ‌చ్చే ఇమేజ్‌లు, వీడియోల‌ను అస్స‌లు ఓపెన్ చేయ‌కూడ‌దు. అలా ఓపెన్ చేస్తే వాటిలో ఏదైనా వైర‌స్ ఉంటే వెంట‌నే మీ ఫోన్‌లోకి అది వ్యాపిస్తుంది.

2. తెలియ‌ని వ్య‌క్తుల నుంచి వ‌చ్చే వాట్స‌ప్ మెసేజ్‌ల‌లో ఉండే లింక్స్‌ను కూడా ఓపెన్ చేయ‌కూడ‌దు. ఎందుకంటే వాటిల్లో వైర‌స్ ఉండే చాన్స్ ఉంటుంది. క‌నుక రిస్క్ తీసుకోకూడ‌దు.

3. వాట్స‌ప్‌ల‌లో గ్రూప్ చాటింగ్ చేసేట‌ప్పుడు వాటిల్లో పోస్ట్ అయ్యే లింక్స్‌ను, ఇమేజ్‌లు, వీడియో ఫైల్స్‌ను యూజ‌ర్లు ఓ సారి ప‌రిశీలించాలి. అది న‌కిలీదా, అస‌లుదా అన్న విషయాన్ని తెలుసుకున్నాకే స‌ద‌రు లింక్‌ను ఓపెన్ చేయాలి. లేదంటే వైర‌స్ వ్యాపించేందుకు అవ‌కాశం ఉంటుంది.


4. యూజ‌ర్లు ఎవ‌రూ కూడా త‌మ ప్రొఫైల్ స‌మాచారాన్ని ప‌బ్లిక్‌తో షేర్ చేయ‌కూడ‌దు. కేవ‌లం వాట్స‌ప్‌లో అనుసంధానం అయి ఉన్న ఫ్రెండ్స్‌తో మాత్ర‌మే ఆ సమాచారాన్ని షేర్ చేసుకోవాలి.

5. వాట్స‌ప్‌లో పాస్‌కోడ్ అనే ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. దాన్ని వాడితే యూజ‌ర్ వాట్స‌ప్ అకౌంట్‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఓపెన్ చేయ‌డానికి వీలు కాదు. కనుక దీంతో సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

6. మీకు తెలియ‌ని వ్య‌క్తుల‌తో మీ వాట్స‌ప్ ఫోన్ నంబ‌ర్‌ను అస్స‌లు షేర్ చేయ‌కూడ‌దు.

ఈ సూచ‌న‌లు పాటిస్తే వాట్స‌ప్‌లో సురక్షితంగా ఉండ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top