మీ వాట్సాప్ కి …”Dance of the Hillary” పేరుతో ఈ వీడియో వ‌స్తే…ఓపెన్ చేయ‌కండి!

మీ వాట్సాప్ కి కానీ, ఫేస్ బుక్ కు కానీన మెయిల్ కు కానీ…….”Dance of the Hillary” పేరుతో వీడియో వ‌స్తే…ఓపెన్ చేయ‌కండి. ఎందుకంటే…అందులో వైర‌స్ ఉంది. దీనిని ఓపెన్ చేస్తే…మొబైల్ ఫార్మాట్ అయిపోయి.. డేటా మొత్తం మాయం అవుతుంది. ఈ విష‌యాన్ని బీబీసీ రేడియోలో ప్రకటించింది. ఇది వాన్నా క్రై (Wanna Cry) ర్యాన్స‌మ్ వేర్ అనే వైర‌స్…ఇప్ప‌టికే 100 కు పైగా దేశాలు దీని బారిన ప‌డ్డాయి.తాజాగా ఈ వైర‌స్ ఇండియాలో కూడా సోకుతుండ‌డంతో…ఇంట‌ర్నెట్ యూజ‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెబుతున్నారు సాఫ్ట్ వేర్ ఎక్స్ ప‌ర్ట్స్.

డ‌బ్బు కోసం హ్యాకర్ల అస్త్ర‌మే ఈ వైర‌స్ :
వాన్నా క్రై (Wanna Cry). Ransom:Win32.WannaCrypt రూపంలో ఇది ఉంటుంది. ఇది వైర‌స్‌ల‌లో ఓ ర‌కానికి చెందిన‌ది. దీన్నే ర్యాన్‌స‌మ్ వేర్ అంటారు. ర్యాన్‌స‌మ్ వేర్ ఏదైన‌ప్పటికీ అది చేసే ప‌ని ఒక్క‌టే. యూజ‌ర్ల కంప్యూట‌ర్లలోకి చొర‌బ‌డి వాటిని లాక్ చేస్తుంది. ఆ త‌రువాత కొంత డ‌బ్బు చెల్లిస్తే గానీ కంప్యూట‌ర్ అన్‌లాక్ కాదు, అని మెసేజ్ చూపుతుంది. దీంతో ఆ వైర‌స్ బారిన ప‌డ్డవారు చేసేది లేక స‌ద‌రు హ్యాక‌ర్లు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించి కంప్యూట‌ర్‌ను అన్ లాక్ చేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా హ్యాక‌ర్లు ప్ర‌వేశ‌పెట్టిన వాన్నా క్రై ర్యాన్‌స‌మ్ వేర్ కూడా 100కు పైగా దేశాల్లో ఉన్న కొన్ని కోట్ల కంప్యూట‌ర్ల‌లోకి చొర‌బ‌డింది. దీంతో అవ‌న్నీ లాక్ అయ్యాయి. దీని కార‌ణంగా ఇప్పుడు అనేక కంపెనీల‌కు కొన్ని ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల న‌ష్టం వాటిల్లింది. బ్రిట‌న్ వంటి దేశాల్లోనైతే కొన్ని హాస్పిట‌ల్స్ కూడా మూత ప‌డ్డాయి. అందుకు కార‌ణం ఈ ర్యాన్స‌మ్ వేరే. ప్ర‌స్తుతం ప‌లు ప్ర‌ముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ‌లు ఆ వైర‌స్ భ‌ర‌తం ప‌ట్టే ప‌నిలో ఉన్నాయి.

ఇలా త‌ప్పించుకోవ‌చ్చు..!

1. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు పంపే ఈ-మెయిల్స్ అస్స‌లు ఓపెన్ చేయ‌వ‌ద్దు. వాటిలో పైన చెప్పిన‌టువంటి వైర‌స్‌లు ఉండేందుకే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక అలాంటి మెయిల్స్ వ‌స్తే వెంట‌నే వాటిని డిలీట్ చేయాలి త‌ప్ప ఓపెన్ చేయ‌కూడ‌దు.

2. అశ్లీల్ వెబ్‌సైట్‌లు, పైరేటెడ్ సాఫ్ట్‌వేర్‌లు డౌన్‌లోడ్ చేసుకునే వెబ్‌సైట్లు, సినిమాలు, ఫొటోలు, వీడియోలు, పాట‌ల‌ను పైరేటెడ్‌గా ఉంచే సైట్ల‌ను ఓపెన్ చేయ‌రాదు.

3. మాక్ లేదా విండోస్ ఏ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను వాడినా ఒరిజిన‌ల్‌ను వాడాలి. పైరేటెడ్ వెర్ష‌న్ వాడ‌కూడ‌దు. ఒరిజిన‌ల్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ వాడే వారు ఆ ఓఎస్‌కు గాను ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల‌య్యే సెక్యూరిటీ ప్యాచ్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

4. యూజ‌ర్లు త‌మ‌కు ముఖ్య‌మ‌ని భావించిన స‌మాచారాన్నంతా ఎప్ప‌టిక‌ప్పుడు పీసీ నుంచి బ్యాక‌ప్ తీసుకోవాలి. ఎక్స్‌ట‌ర్న‌ల్ హార్డ్ డిస్క్‌, సీడీ, డీవీడీ వంటి వాటిలో డేటాను కాపీ చేసి పెట్టుకుంటే ర్యాన్స‌మ్ వేర్ బారిన ప‌డ్డా ఏమీ కాదు. పీసీని మ‌ళ్లీ ఫార్మాట్ చేసుకునేందుకు వీలుంటుంది. అప్పుడు అలా డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌సరం రాదు.

5. కాస్ప‌ర్ స్కై, ఏవీజీ, అవాస్ట్‌, నార్ట‌న్ వంటి సంస్థ‌లు యాంటీ వైర‌స్‌ల‌ను అందిస్తున్నాయి. వాటిని పీసీల్లో ఇన్‌స్టాల్ చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ఇలా చేస్తే వైర‌స్‌ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top