డిన్నర్ చేసిన వెంటనే ఈ పనులు చేస్తున్నాారా….అయితే ఇది చదవండి..

రాత్రి పూట డిన్నర్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం..పడుకుంటాం ..కొందరు పడుకుంటారు..కొందరు వాకింగ్ చేస్తారు… ఇంకొందరు స్నానం చేస్తారు. మరి కొందరైతే స్మోకింగ్ చేస్తారు.కానీ వాస్తవంగా చెప్పాలంటే రాత్రి పూట భోజనం తరువాత ఈ పనులు అస్సలు చేయకూడదు. ఇవే కాదు, రాత్రి పూట డిన్నర్ చేసిన వెంటనే చేయకూడని కొన్ని పనులున్నాయి…అవేంటంటే….

 

  • రాత్రి పూట డిన్నర్ చేసిన వెంటనే కొంచెం లేచి అటు ఇటు నడువు అని మన పెద్దవాళ్లు అంటుంటారు..అలా నడిస్తే ఆరోగ్యానికి మంచిదని కూడా అంటారు. కానీ తిన్న వెంటనే నడవడం వల్ల రక్తం చేతులకు, కాళ్లకు వెళ్తుంది. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. కనుక తిన్న వెంటనే వాకింగ్ చేయరాదు. నైట్ టైం వాకింగ్ అలవాటున్న వాళ్లు తిన్నవెంటనే వాకింగ్ చేయకుండా డిన్నర్ ఎర్లీగా కంప్లీట్ చేసుకుని ఒక గంట లేదా గంటన్నర తర్వాత చేయొచ్చు
  • మన శరీరానికి నీరు అవసరమే. కానీ దాన్ని తగిన సమయంలోనే తాగాలి. ప్రధానంగా రాత్రి పూట డిన్నర్ చేసిన వెంటనే నీటిని అస్సలు తాగరాదు. కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటు వేచి ఉండాలి. లేదంటే జీర్ణవ్యవస్థ పనికి నీరు అడ్డు పడి మలబద్దకం సమస్య వస్తుంది.      
  • రాత్రి పూట భోజనం చేసిన వెంటనే పండ్లను తినడం చాలా మందికి అలవాటు. రాత్రి పూట డిన్నర్ తరువాత పండ్లను తింటే దాంతో పొట్ట ఉబ్బరంగా తయారవుతుంది. గ్యాస్ సమస్యలు వస్తాయి. దీంతోపాటు తిన్నది కూడా సరిగ్గా జీర్ణమవదు. కాబట్టి డిన్నర్ అయ్యాక పండ్లు తినకూడదు..   
  • డిన్నర్ చేసిన వెంటనే బ్రష్ చేయడం కూడా చాలా మందికి అలవాటు.తిన్నవెంటనే బ్రష్ చేస్తే దంతాల మీద ఉన్న ఎనామిల్ పొర తొలగిపోతుంది. అప్పుడు దంతాలు తమ సహజ కాంతిని కోల్పోతాయి. కాబట్టి డిన్నర్ చేసిన వెంటనే పళ్లు తోముకోరాదు. కనీసం 30 నిమిషాల వెయిట్ చేసి ఆ తర్వాత బ్రష్ చేస్కొవాలి.   
  • డిన్నర్ చేసిన వెంటనే కాదు, అసలు ఏ సమయంలోనూ, ఎప్పుడూ కూడా స్మోకింగ్ చేయరాదు.అయితే ఆ అలవాటును మానలేం అనే వారు, కనీసం డిన్నర్ చేశాకైనా మానేయడం మంచిది. ఎందుకంటే డిన్నర్ చేసిన వెంటనే స్మోకింగ్ చేస్తే సాధారణ సమయంలో చేసిన స్మోకింగ్ కన్నా క్యాన్సర్ వచ్చే రిస్క్ ను మరింతగా పెంచుతుంది.   
  • చాలా మంది డిన్నర్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. నిజానికి అలా డిన్నర్ అయిన వెంటనే టీ, కాఫీ వంటివి తాగితే జీర్ణ క్రియకు ఆటంకం ఏర్పడుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. తిన్న ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. ప్రధానంగా ఐరన్‌ను శరీరం ఏమాత్రం గ్రహించలేదు.   
  • తిన్న వెంటనే స్నానం చేస్తే రక్త ప్రసరణ శరీరంలోని ఇతర భాగాలకు జరుగుతుందే తప్ప జీర్ణ వ్యవస్థకు సరిగ్గా జరగదు. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరగదు.
  • డిన్నర్ చేసిన వెంటనే పడకెక్కేసే అలవాటుంటే మానేయండి. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్, అసిడిటీ పెరగడంతోపాటు తిన్న ఆహారం కొవ్వుగా మారుతుంది. అప్పుడు అధికంగా బరువు పెరుగుతారు.కాబట్టి పడుకోవడానికి రెండు గంటలు ముందే డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి.

 

Comments

comments

Share this post

scroll to top