ఫోన్ కొనాల‌ని అనుకుంటున్నారా..? అయితే జూన్ నెల చివ‌రి వ‌ర‌కు ఆగండి. ఎందుకో తెలుసా..?

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు క‌లిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి. ఎవ‌రైనా అలాంటి ఫోన్‌నే కొనాల‌ని చూస్తారు. ఈ క్ర‌మంలోనే వెదికి వెదికి మ‌రీ ఫోన్‌ను కొంటారు. అయితే ఎవ‌రు ఫోన్‌ను కొన్నా నేటి త‌రుణంలో గ‌మ‌నిస్తున్న అంశం ఒకటుంది. అదేనండీ… ఏ షాపులో మంచి ఆఫ‌ర్ ఉంది..? ఏ ఆన్‌లైన్ సైట్‌లో ఎక్కువ డిస్కౌంట్ ల‌భిస్తుంది..? అని యూజ‌ర్లు వెదికి మ‌రీ కొంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అయితే ఇలాంటి ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు ఎక్కువ‌య్యాయి. అయితే అది ఎందుకో తెలుసా..? ఫోన్ల‌ను అమ్మి లాభాలు గ‌డించాల‌ని కాదు, ఉన్న స్టాక్‌ను ఏదో ఒక ర‌కంగా వ‌దిలించుకోవ‌డానికి..! అవును, మేం చెబుతోంది నిజ‌మే. అది ఎందుకో మీరే చ‌ద‌వండి..!

జీఎస్టీ బిల్లు గురించి తెలుసు క‌దా. దేశంలో అనేక ప‌న్నులు ఉన్నాయ‌ని, వాట‌న్నింటిని ఒకే గొడుగు కింద‌కు తెస్తున్నామంటూ కేంద్ర ప్ర‌భుత్వం మొన్నా మ‌ధ్యే ఈ బిల్లును ఉభ‌య స‌భ‌ల్లోనూ పాస్ చేసింది. దీనికి అన్ని రాష్ట్రాల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. ఇదే బిల్లు వ‌చ్చే జూలై 1 నుంచి అమ‌లు కానుంది. అయితే మ‌రి… ఫోన్ల అమ్మ‌కాలకు, జీఎస్టీ బిల్లుకు సంబంధం ఏంటీ..? అంటే ఉంది. ఎందుకంటే జీఎస్‌టీ బిల్లు అమ‌లులోకి వ‌స్తే ఫోన్ల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. అందుకు కార‌ణం బిల్లు ప్ర‌కారం ఫోన్ల త‌యారీకి అవ‌స‌ర‌మ‌య్యే విడి భాగాల‌పై ప‌న్ను శాతం పెంచ‌డ‌మే. దీంతో ఫోన్ త‌యారీ ఖ‌ర్చు పెరుగుతుంది. అలా ఫోన్ ధ‌ర కూడా పెరుగుతుంది. మ‌ర‌లాంట‌ప్పుడు ఫోన్ ధ‌ర పెరిగితే జూలై 1 నుంచి పాత స్టాక్‌ను అమ్మ‌డానికి క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది క‌దా. దీంతో న‌ష్టాలు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకే ఆన్‌లైన్ సైట్లు మాత్రమే కాదు, రీటెయిల్ షాపుల వారు కూడా ఫోన్ల‌ను ఇప్పుడు చాలా చ‌వ‌క ధ‌ర‌ల‌కే అందిస్తున్నారు.

అయితే జూన్ చివ‌రి వ‌ర‌కు ఆగితే ఆయా వ్యాపారులు అందించే ఆఫ‌ర్లు, రాయితీలు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ట‌. ఎందుకంటే ఇక వారికి పాత స్టాక్‌ను అమ్మేందుకు అదే ఆఖరి వారం క‌దా. క‌నుక ఉన్న స్టాక్‌నంతా క్లియ‌ర్ చేసుకుంటానికి వారు ఇంకా భారీ ఆఫ‌ర్లు, రాయితీలు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ట‌. దీన్ని మేం చెప్ప‌డం లేదు, మార్కెట్ నిపుణులే అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌నుక ఎవ‌రైనా ఫోన్ కొనే ఆలోచ‌న‌లో ఉంటే జూన్ చివ‌రి వ‌ర‌కు ఆగండి. ఇప్పుడు ఉన్న ధ‌ర క‌న్నా ఇంకా త‌క్కువ ధర‌కే ఫోన్‌ను పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. అలా అని చెప్పి జూలై 1 త‌రువాత ఫోన్‌ను కొనేరు..! అప్పుడు రేట్లు బాగా పెరుగుతాయి జాగ్ర‌త్త‌..!

Comments

comments

Share this post

scroll to top