ఈ దివాళికి బయట తినడానికి ఏం కొనకండి..! ఎందుకో తెలుసా..? ఏం చేయాలంటే..!

దీపావ‌ళి వ‌చ్చేసింది. అంద‌రూ ప‌టాకులు పేల్చేందుకు సిద్ధమైపోయారు. దీనికి తోడు తీపి వంట‌కాల విందును ఆర‌గించేందుకు కూడా అంద‌రూ సిద్ధ‌మ‌వుతున్నారు. ఇది స‌రే… తీపి వంట‌కాల విష‌యానికి వ‌స్తే చాలా మంది ఏం చేస్తారంటే.. బ‌య‌ట దొరికే స్వీట్ల‌ను తెచ్చుకుని తింటారు. కానీ అలా కాదు. ఈ సారి కొంచెం వెరైటీగా ట్రై చేయండి. కింద ఇచ్చిన కొన్ని పిండి వంట‌ల‌ను మీరే ఇంట్లో స్వ‌యంగా చేసుకోండి. అవి చేయ‌డం చాలా సులువే. మ‌రి ఆ వంట‌కాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా..!

1. bhajiyas
వీటిని చేయ‌డం చాలా తేలిక‌. ఆలుగ‌డ్డ‌లు, ఉల్లిపాయ‌లు, మిర్చి ఉంటే చాలు. అన్నింటినీ మిక్స్ చేసి బజ్జీల్లా వేసుకోవ‌చ్చు. ఇవి చాయ్‌లో తిన్నా, చెట్నీలో అద్దుకుని తిన్నా భ‌లేగా ఉంటాయి.

2. Shahi Tukda
దీన్ని చేయ‌డం కూడా చాలా తేలికే. పాలు, చ‌క్కెర‌, యాల‌కులు, నెయ్యి, కుంకుమ పువ్వు ఉంటే చాలు. వెంట‌నే షాహీ టుక్‌డా త‌యారైపోతుంది.

3. Aam Paak
మామిడికాయ ర‌సం, చ‌క్కెర‌, నెయ్యితో దీన్ని త‌యారు చేస్తారు. దీని రుచి భ‌లేగా ఉంటుంది. దీపావ‌ళి రోజు క‌చ్చితంగా ఎంజాయ్ చేయాల్సిన వంట‌కం ఇది.

4. Dry fruits chocolates
అన్ని ర‌కాల డ్రై ఫ్రూట్స్ వేసి త‌యారు చేసే చాక్లెట్ ఇది. ఇంట్లోనే చేసుకోవ‌చ్చు. చిన్న పిల్ల‌లు బాగా ఇష్టంగా తింటారు.

5. Sandwiches
ట‌మాటాలు, ఉల్లిపాయ‌లు, మిర్చి, పెరుగుతో శాండ్ విచ్‌ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. భ‌లే టేస్టీగా ఉంటాయి.

6. Fruit Sandesh
పాలు, పండ్ల కాంబినేష‌న్‌తో దీన్ని త‌యారు చేస్తారు. సీజ‌న‌ల్‌గా అందుబాటులో ఉండే ఏ పండుతో అయినా దీన్ని చేసుకోవ‌చ్చు. రుచి భ‌లేగా ఉంటుంది.

7. Papdi Chaat
పాప్‌డీలను ప్లేట్‌పై పెట్టి వాటిపై ఆలూ కా మ‌సాలా వేసి, చింత‌పండు చెట్నీ, కొత్తిమీర చెట్నీ, త‌రిగిన ట‌మాటా ముక్క‌లు, ఉల్లిపాయ‌లు వేసి తింటే మ‌జాగా ఉంటుంది.

8. Ras malai
ఈ తీపి వంట‌కం అంటే చాలా మందికి ఇష్ట‌మే. పాల‌ను బాగా మ‌ర‌గ‌బెట్టి చ‌ల్ల‌బ‌రిచి త‌యారు చేస్తారు.

9. Kulfi falooda
ఫాలూదా నూడుల్స్‌, కుల్ఫీ లను ఉప‌యోగించి దీన్ని త‌యారు చేస్తారు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది.

10. రోల్స్
కూర‌గాయ‌ల‌ను కూర‌లుగా వండి చేసే రోల్స్ కూడా పండ‌గ పూట తిన‌ద‌గిన‌వే.

11. Waffles
మోడ్ర‌న్ స్వీట్ కావాల‌నుకుంటే దీన్ని ట్రై చేయ‌వ‌చ్చు. ఇంట్లోనే కావ‌ల్సిన ప‌దార్థాల‌తో దీన్ని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీపావళి రోజు ఈ వంట‌కం తింటే భ‌లేగా ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top