ఈ 5 విషయాలు….పెళ్లి తర్వాత మీ భార్యకు/భర్తకు చెప్పకపోవడమే బెటర్.!?

ఆలుమగల మధ్య ఎటువంటి రహాస్యం ఉండకూడదు..అలాంటప్పుడే జీవితం సాఫీగా సాగుతుందంటారు. కానీ ఈ సూత్రం అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా పనిచేయదు. కొన్ని కొన్ని విషయాలను  భాగస్వాముల వద్ద దాచడమే బెటరంట. వ్యక్తిగతమైన ప్రతీ రహస్యం చెప్పుకుంటూ పోతే…ఒకరిమీద ఒకరికి చులకన భావం ఏర్పడి, చివరికి ఆ  సంసారంలో గొడవలు తప్పవట.! అందుకే…ఏ విషయం ఎక్కడ చెప్పాలో, ఏ విషయం ఎక్కడ దాచాలో ..తెలిసినోళ్ల సంసారాలే పచ్చగా ఉంటాయన్నమాట. ఇంతకీ ఆలుమగల మద్య దాచాల్సిన విషయాలేంటో ఓ సారి చూద్దాం.

గ‌తంలోని అనారోగ్య సమస్యల గురించి:
గ‌తంలో ఏవైనా తీవ్ర అనారోగ్య సమస్యలను అనుభవించుంటే….వాటిని భాగస్వామ్యులకు చెప్పకపోవడమే బెటర్. ఆ   ప్రాబ్ల‌మ్ ఇప్పటికీ  కంటిన్యూ అవుతుంటే మాత్రం ఖ‌చ్చితంగా చెప్పాలి. లేదంటే మోసం చేసి పెళ్లి చేసుకున్నారనే అపవాదును మోయాల్సి వస్తుంది.

top-10-most-common-dental-health-problems

అవ‌మానాలు:
గతంలో జ‌రిగిన అవ‌మానాల‌ను ఎట్టి ప‌రిస్థితిలో మీ పార్ట్ న‌ర్ తో చెప్ప‌కూడ‌దు. ఇది  చులకన భావానికి గురిచేస్తుంది. ఇక అదే అదునుగా భావిస్తే….మీ పార్ట్ నర్ పదే పదే మీ మనస్సును గాయపరిచే అవకాశముంది.

hotel, travel, relationships, and sexual problems concept - upset man sitting on the bed with woman on the back

క‌ల‌లు: 
ప‌రాయి స్త్రీతో గ‌డిపిన‌ట్టుగా క‌ల వ‌స్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భాగస్వామ్యులకు చెప్ప‌కూడ‌దు.. మీరు పరాయి వ్య‌క్తిని క‌ల‌లో ఊహించుకోవడం మీ భాగ‌స్వామికి ఇష్టం ఉండ‌దు. సంసారాలు కూలే ప్రమాదముంది.

wet-dreams

ప్రేమ‌.. సంబంధం..
తమ లవ్ స్టోరీలు ఇతరులకు చెప్పడానికి చాలా మంది ఇంట్రస్ట్ చూపుతారు. కానీ మన భాగస్వామ్యుల వద్ద మాత్రం ప్రేమ వ్యవహారాలు చెప్పకపోవడమే బెటర్…..లేదంటే ప్రతిదానికి అనుమానాలు పెరిగిపోతాయి. ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశముంది.

41a6373c-122f-4eb1-94c0-9eb39e255e00

శారీరక సంబంధం:
పెళ్లికి ముందు ఏవైనా శారీరక సంబంధాలున్నా…వాటిని చెప్పకపోవడమే మంచిది. అలా చెబితే మీ ప్రతి కదలిక మీ పార్ట్ నర్ కు అనుమానం కల్గించేదిగా ఉంటుంది. వీరి మధ్య ఆప్యాయతల కంటే కూడా అనుమానాలే ఎక్కువుంటాయి.couple-in-bed-romance-hot-images
సో మొత్తానికి గ‌తం గ‌తః.. పెళ్లికి ముందు వ‌ర‌కు ఎన్ని జ‌రిగినా అవ‌న్నీ మూడు ముళ్ల బంధానికి ముందే  పటాపంచలు చేసుకుంటేనే సంసారం నూరేళ్ల హాయిగా సాగుతుంది. గతం ఓ పీడకల, ప్రస్తుతం అందమైన జీవితానికి బాట అనుకొని ముందుకు సాగండి. ఆలుమగల మధ్య అన్యోన్య బంధం ఉంది అనుకుంటే….ఈ విషయాలను కూడా పంచుకోవొచ్చు.

Comments

comments

Share this post

scroll to top