ఆ బీటెక్ విద్యార్థినిపై ఎలాంటి నిందలు వేసారో తెలుసా.? తట్టుకోలేక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.!

 ‘భార్య దూరమైతే కంటికి రెప్పలా కాపాడుకుంటినే.. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్లిపోయావా తల్లీ అంటూ  కూతరు శవంపై పడి తండ్రి చేస్తున్న రోధన చూసేవారికి కూడా కంటతడి పెట్టిస్తుంది. ఉన్నత చదువులు చదువుకుని మంచి కొలువులో స్థిరపడుతుందనుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కన్నీరు మున్నీరయ్యాడు కన్నతండ్రి..తండ్రి ఆశల్ని అడియాసలు చేసి ఆ కూతురు తన జీవితాన్ని అర్దాంతరంగా ముగించడానికి గల కారణాలేంటి..

శ్రీకాళహస్తి మండలం వేలవేడు పంచాయతీ మాధమాల గ్రామానికి చెందిన అక్కుపల్లి బలరామయ్య యాదవ్, భారతి దంపతుల కూతురు మాధవి.వయసు పద్దెనిమిదేళ్లు. మాధవికి రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే తల్లి భారతి మృతి చెందింది.దాంతో సుజాత అనే మహిళను మళ్లీ పెళ్లిచేసుకున్నాడు బలరామయ్య.వీరికి కూడా ఒక కుమార్తె ఉంది..కుటుంబకలహాలతో సుజాత బలరామయ్య విడిపోయారు.దాంతో కూతురుని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు బలరామయ్య.మాధవి 1 నుంచి 5వ తరగతి వరకు స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివింది. 10వ తరగతి వరకు ఏర్పేడు మండలం పల్లం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ శ్రీకాళహస్తిలోని రాయలసీమ జూనియర్‌ కళాశాలలో పూర్తి చేసింది.చదువులో చురుకుగా ఉంటున్న కూతుర్ని పై చదువులు చదివించాలని ఆశపడ్డాడు..కుమార్తె చదువుల్లో రాణిస్తుండడంతో బలరామయ్య ఉన్నత చదువులు చదివించడానికి ఆసక్తి చూపాడు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆగస్టు 10వ తేదీన సివిల్‌ ఇంజినీరింగ్‌లో చేర్పించాడు.కాని అక్కడే తన కూతురి ఆయుష్షు తీరిపోతుందని గుర్తించలేకపోయాడు..

కాలేజ్ కి చెందిన హాస్టల్లోనే ఉండి చదువుకుంటోంది మాధవి. మాధవి ఉంటున్న హాస్టల్‌ గదిలో ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌ కనిపించకపోవడంతో తోటి విద్యార్థినులు మాధవిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయమై మాధవి తన తండ్రికి తెలియజేయడంతో ఆయన నాలుగు రోజుల క్రితం కళాశాలకు వచ్చి హెచ్‌వోడీతో మాట్లాడారు. అయినప్పటికి తోటివిధ్యార్దులు అనుమానంగా చూడడాన్ని అవమానంగా భావించిన మాధవి బాత్రూంలోకి వెళ్లి ఉరివేసుకుని చనిపోయింది.

Comments

comments

Share this post

scroll to top