పాట పాడుతూ మగాళ్ళ మీద వీర లెవల్లో పంచులేసిన మంచు లక్ష్మీ.!

నటి  మంచు లక్ష్మి ‘దొంగాట’ చిత్రంలో ‘యాందిరో..’అనే పాట పాడి తనలో సింగింగ్ టాలెంట్ కూడా ఉందని నిరూపించింది  అయితే ఈ పాటలో మగవాళ్ళపై పెద్ద యుద్ధమే ప్రకటించింది మంచు లక్ష్మి. మగాళ్ళు ఆడవాళ్ళ గురించి ఆలోచించందే ఆరోజు గడవదు, ఎప్పుడూ ఆడవాళ్ళ గురించే మాట్లాడతారు,ఆడవాళ్ళు వేసుకునే దుస్తులపై ఏకంగా రీసర్చ్ లే జరుపుతారు, అదే స్కూటీ వేసుకుని అలా తిరుగుతే చాలు బరితెగించారు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారంటూ మగాళ్ళను ఎకి పారేసింది.  అంతే కాదండోయ్ మగవాళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడినా, వెకిలి చేష్టలు చేసినా  ఆడవాళ్ళు భరిస్తూ ఉంటారు. అదే వారి గొప్పదనం అంటూ మరోవైపు ఆడవాళ్ళను పొగిడేసింది. ఇక ఈ పాటను అందరు ఆడవాళ్లకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది ఈ నయా సింగర్. ఇంతకీ ఆ సాంగ్ మీరు విన్నారో లేదో వీలయితే ఒకసారి వినరాదు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top