దొంగతనం చేసే ముందు వారు రోడ్డు మీద కొబ్బరికాయతో ఏం చేస్తారో తెలుసా.? చూస్తే షాక్ అవుతారు!

ఇళ్ల‌ల్లో దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డేవారు స‌హ‌జంగా ఆ దొంగ‌త‌నాల‌ను ఎలా చేస్తారు ? ముందుగా ఆ ఇంట్లో ఎవ‌రు ఉంటారు ? ఆ ఇంట్లో దొంగ‌తనం చేస్తే ఏం దొర‌క‌వ‌చ్చు ? ఏ టైంలో చేస్తే మంచిది ? వ‌ంటి వివ‌రాల‌పై రెక్కీ నిర్వ‌హిస్తారు. త‌రువాత త‌మ‌కు అనుకూల‌మైన స‌మ‌యం చూసుకుని దొంగ‌త‌నం చేస్తారు. ఇది దొంగ‌లు ఎక్క‌డైనా ఫాలో అయ్యే రొటీన్‌. కానీ అక్క‌డ అలా కాదు. ఇలా దొంగ‌త‌నం చేసే ముందు దొంగలు ఒక వింతైన ఆచారం పాటిస్తారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ అస‌లు విషయం ఏమిటంటే…

అది థానేలోని న‌వ్‌ఘ‌డ్ ప్రాంతం. అక్క‌డ ఈ మ‌ధ్య కాలంలో దొంగ‌త‌నాలు పెరిగిపోయాయి. దొంగ‌లు రెచ్చిపోయి మ‌రీ దొంగ‌త‌నాల‌ను చేస్తున్నారు. దొరికిన ఇంటిని దొరికిన‌ట్టే దోచుకుంటున్నారు. అయితే వారు ఏ ఇంటిని ప‌డితే ఆ ఇంటిని దోచుకోరు. అందుకు ఓ ప్రాసెస్‌ను, ఆచారాన్ని ఫాలో అవుతారు. ముందుగా ఓ టెంకాయకు ప‌సుపు పూసి రోడ్ల కూడ‌లిలో పెట్టి దాన్ని తిప్పుతారు. అది ఎటు వైపు ఆగుతుందో, ఏ దిక్కుకు చూపెడుతుందో ఆ దిక్కుకు వెళ్తారు. అక్క‌డ ఉండే ఇంట్లో మాత్రమే దొంగ‌త‌నం చేస్తారు. ఇలా ఆ దొంగ‌లు దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారు.

అలా దొంగలు టెంకాయ తిప్పి అనంతరం పూజ చేసి మ‌రీ దోచుకోవడం ప్రారంభిస్తారు. ఈ క్ర‌మంలోనే ధానేలో ఇలాంటి దొంగ‌త‌నాలు పెరిగిపోయాయి. అయితే దొంగ‌త‌నం జ‌రిగిన ప్ర‌తి చోట టెంకాయ‌, పూజా సామ‌గ్రి ల‌భిస్తుండ‌డంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. ఆ దొంగ‌తనాల‌న్నీ ఒకే ముఠా చేస్తుంద‌ని గ‌మ‌నించారు. దీంతో కాపు కాసి మ‌రీ ఒక చోట ఆ దొంగ‌ల‌ను ప‌ట్టుకున్నారు. మొత్తం న‌లుగురు దొంగ‌ల‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. ఆ దొంగ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని ల‌క్ష‌ల సొమ్ము దోచుకున్న‌ట్లు పోలీసులు చెప్పారు. చూశారుగా.. దొంగ‌లు ఎలా దొంత‌నాలు చేస్తున్నారో..! నిజంగా ఇలాంటి పూజ‌లు చేసే దొంగ‌ల‌ను ఇప్పుడే క‌దా చూడ‌డం..!

Comments

comments

Share this post

scroll to top