ఈసారి వ‌స్తున్న అక్ష‌య తృతీయ రోజున వీటిని దానం చేసి చూడండి. దాంతో ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

ప్ర‌తి ఏటా వ‌చ్చే అక్ష‌య తృతీయ పండుగ గురించి మ‌న‌కు తెలుసు క‌దా. ఆ రోజున ఎవ‌రైనా క‌నీసం కొంతైనా బంగారం కొంటే దాంతో వారికి స‌క‌ల శుభాలు క‌లుగుతాయని, అష్టైశ్వ‌ర్యాలు సిద్ధించి ఆయురారోగ్యాల‌తో ఉంటార‌ని పురాణాలు చెబుతున్నాయి. అందుక‌నే నేటి త‌రుణంలో చాలా మంది అక్ష‌య తృతీయ రోజున బంగారం కొనేందుకు ఆస‌క్తిని చూపుతున్నారు. ఇక వారికి అనుగుణంగా బంగారం వ్యాపారులు కూడా వారికిష్ట‌మైన బంగారు న‌గ‌ల‌ను, వివిధ ర‌కాల డిజైన్ల‌తో అందుబాటులో ఉంచుతూ ప‌లు ఆఫ‌ర్ల‌ను కూడా ప్ర‌క‌టిస్తున్నారు. ఈ సారి ఈ నెల 18వ తేదీన అక్ష‌య తృతియ వ‌స్తోంది. మ‌రి ఈ సారి బంగారం కొనేందుకు కూడా చాలా మంది ఆస‌క్తిగానే ఎదురు చూస్తున్నారు. అయితే ఆ రోజున బంగారం కొన‌డంతోపాటు కింద సూచించిన విధంగా ప‌లు దానాలు చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం ల‌భిస్తుంద‌ట‌. మ‌రి ఆ దానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఆహారం
ఆక‌లితో అల‌మ‌టించే వారికి అక్ష‌య తృతీయ రోజున అన్న‌దానం చేస్తే ముక్తి ల‌భిస్తుంద‌ట‌. వారికి మ‌రో జ‌న్మ ఉండ‌ద‌ట‌. నేరుగా శివ సాన్నిధ్యం చేరుకుంటార‌ట‌.

2. వస్త్రాలు
అక్ష‌య తృతీయ రోజున వ‌స్త్రాల‌ను దానం చేస్తే చంద్రుడు ప్ర‌సన్నుడై సక‌ల సంప‌ద‌ల‌ను ఇస్తాడ‌ట‌. దీంతోపాటు బెల్లం, నెయ్యి, పర‌మాన్నం కూడా దానం చేస్తే మ‌రింత ఫ‌లితం క‌లుగుతుంద‌ట‌.

 

3. నీరు
అక్ష‌య తృతీయ రోజున నీటిని నువ్వుల‌తో క‌లిపి దానం ఇస్తే స‌ర్వ పాపాలు తొల‌గిపోతాయ‌ని ప‌ద్మ పురాణంలో ఉంది. నేర పూరిత స్వభావంతో కాకుండా అనుకోకుండా, తెలియ‌కుండా చేసిన త‌ప్పుల‌కు మాత్ర‌మే ఇలా ప‌రిహారం అవుతుంద‌ట‌. క‌నుక అలాంటి త‌ప్పులు చేసిన వారు అక్ష‌య తృతీయ ఆ దానం ఇచ్చి చూస్తే ఫ‌లితం క‌నిపిస్తుంది.

4. ఔష‌ధాలు
అక్ష‌య తృతీయ రోజున అవ‌స‌రం ఉన్న వారికి ఔష‌ధాల‌ను దానం ఇస్తే ఆయురారోగ్యాలు క‌లిగి, అనారోగ్య స‌మ‌స్య‌లు పోతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి.

5. బియ్యం, వెండి, పంచదార
అక్ష‌య తృతీయ రోజున బియ్యం, వెండి, పంచదార దానం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్ప‌బ‌డింది. ఈ దానాల వలన మీ జాతకంలో ఉన్న చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి. వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు. స‌క‌ల శుభాలు క‌లిగేలా అనుగ్ర‌హిస్తాడ‌ట‌.

6. వాహనం
అక్ష‌య తృతీయ రోజున వాహన దానం చేస్తే రాజసూయ యాగం వలన కలిగే ఫలితం కలుగుతుందని అగ్ని పురాణంలో చెప్ప‌బ‌డింది. మురికివాడ‌ల్లో నివ‌సించే పేద‌ల‌కు, ముఖ్యంగా ఆడ‌పిల్ల‌ల‌కు సైకిళ్ల‌ను దానం చేయ‌వ‌చ్చు.

7. జ్ఞానదానం
అక్ష‌య తృతీయ రోజున ఇత‌రుల‌కు జ్ఞానం (చ‌దువు)ను దానం ఇస్తే దాంతో ఏడేడు జ‌న్మల పుణ్య ఫ‌లితం ల‌భించి మోక్షం పొందుతార‌ట‌. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్ప‌ద‌ని అందుకే అన్నారు.

Comments

comments

Share this post

scroll to top