అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వ‌చ్చేశాడుగా… పాకిస్థాన్‌కు ఇక చెడుగుడే..!

అగ్ర‌రాజ్యం అమెరికా స‌పోర్ట్‌ను చూసుకుని ఇన్ని రోజులు విర్ర‌వీగిన పాకిస్థాన్‌కు ఇకపై అలా చేస్తామంటే కుద‌రదు. ఎందుకో మీకు ఈ పాటే అర్థ‌మై ఉంటుంది. అదేనండీ, అమెరికా 45వ అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న విజ‌యం సాధించాడు క‌దా. అవును మ‌రి. అందుకే పాకిస్థాన్ ఆట‌లు ఇక చెల్ల‌వు. ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్థాన్ ఏం చేసినా అమెరికా చూస్తూ ఉంది త‌ప్ప దాని విష‌యంలో పెద్ద‌గా పొడిచిందేమీ లేదు. కానీ ఇక ముందు అలా కాదు. మ‌రి వారి భ‌ర‌తం ప‌ట్టే ట్రంప్ వ‌చ్చేశాడుగా ఇక అంతే..! పాకిస్థాన్‌కు చెడుగుడే..!

trump-on-pak

డొనాల్డ్ ట్రంప్ వ‌ల్ల పాకిస్థాన్ ఆట క‌ట్టినట్టేన‌ని మేం చెప్ప‌డం కాదు. అది ఆయ‌న వ్యాఖ్య‌ల వ‌ల్లే తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నిక‌ల ప్రచారంలో మాత్ర‌మే కాదు, గ‌తంలో కొన్ని సార్లు ట్రంప్ పాకిస్థాన్ చ‌ర్య‌లను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఆయ‌నేమ‌న్నాడంటే ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన దేశం పాకిస్థాన్ అన్నాడు. వారు ఒసామా బిన్ లాడెన్‌ను 6 ఏళ్ల పాటు దాచి పెట్టినందుకు త‌మ దేశానికి బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని అన్నాడు. అలా తాను చెప్పిస్తాన‌ని కూడా శ‌ప‌థం చేశాడు.

అంతేకాదు, పాకిస్థాన్‌కు చెక్ పెట్టే ప‌వ‌ర్ భార‌త్‌కే ఉంద‌ని కూడా తెలిపాడు. ప్ర‌పంచంలో పాకిస్థాన్ అనేది ఇప్పుడొక స‌మ‌స్య‌గా మారింద‌ని, వారి వ‌ద్ద పెద్ద పెద్ద న్యూక్లియ‌ర్ వెపన్స్ (అణు బాంబులు) ఉన్నాయ‌ని, వాటితో ఏ దేశానికైనా ముప్పేన‌ని వ్యాఖ్యానించాడు. ట్రంప్ ఈ విధంగా ఎప్పుడో వ్యాఖ్య‌లు చేయ‌గా ఇప్పుడు వాటి గురించి చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రి ఉగ్ర‌వాదులను నిర్మూలించ‌డానికి, పాక్ ఆట క‌ట్టించేందుకు ట్రంప్ ఎలా రంగంలోకి దిగుతాడో వేచి చూడాలి. ఏది ఏమైనా పాక్‌ను అంత ఈజీగా విడిచిపెట్ట‌బోన‌ని ట్రంప్ చెప్ప‌క‌నే చెప్పాడు. ఆ స‌మ‌యం కోసం మ‌నం వేచి చూద్దాం..!

Comments

comments

Share this post

scroll to top