డాల‌ర్లు కొల్ల‌గొడుతున్న మూవీస్ – టాలీవుడ్ రికార్డ్

తెలుగు సినిమా రంగానికి మంచి రోజులు వ‌చ్చాయి. మూస ధోర‌ణికి అల‌వాటు ప‌డిన జ‌నానికి కొత్త టాలెంట్ కోట్లు కురిపించేలా చేస్తోంది. డాల‌ర్ల పంట పండుతోంది. విడుద‌లైన ప్ర‌తి సినిమాను ఓవ‌ర్సీస్ లో ప్ర‌ద‌ర్శించేలా నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు ఆయా హీరో, హీరోయిన్ల‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. అక్క‌డ కూడా విజ‌యోత్స‌వ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ నాలుగు రాళ్లు వెన‌కేసుకుంటున్నారు. ఇదో ర‌క‌మైన ప‌బ్లిసిటీ. టాలీవుడ్ సినిమాల‌తో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాల‌, హిందీ సినిమాలు పోటా పోటీగా రిలీజ్ అవుతున్నాయి. ప్ర‌వాస భార‌తీయులు ఎక్కువ మంది తెలుగు, త‌మిళ్‌, హిందీ మూవీస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇండియాలో రూపాయ‌ల‌కు విలువ త‌క్కువ‌. అదే అమెరికాలో అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా డాల‌ర్‌కు వాల్యూ అధికం. దీంతో ఒక రేంజ్‌లో ఆడుతున్నాయి మ‌న మూవీస్.

tollywood collections

ఎస్. ఎస్. రాజ‌మౌళి తీసిన బాహుబ‌లి అత్య‌ధిక వ‌సూళ్లు చేసింది. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, రామ్, అఖిల్‌తో పాటు విజ‌య దేవ‌ర‌కొండ‌, నాని త‌దిత‌రులు న‌టించిన సినిమాలు ఎక్కువ‌గా ఆద‌ర‌ణ పొందుతున్నాయి. టాలీవుడ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుంటే.ఓవ‌ర్సీస్‌లో భారీగా డాల‌ర్ల‌ను కొల్ల‌గొడుతున్నాయి. ప్ర‌వాస భార‌తీయులు ఎక్కువ‌గా మ‌న హీరోల‌ను ఇష్ట ప‌డుతున్నారు. అలాగే త‌మిళ హీరోల‌కు ఓటు వేస్తున్నారు. హిందీ మూవీస్ సైతం వ‌సూళ్ల‌లో ముందంజ‌లో ఉంటున్నాయి.

హీరోల విష‌యానికి వ‌స్తే అమెరికాలో త‌మిళ స్టార్ విజ‌య్‌కు ఫ్యాన్స్ ఎక్కువ‌. జ‌పాన్, సింగ‌పూర్, మ‌లేషియా దేశాల‌లో ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, విశాల్ సినిమాల‌కు డిమాండ్ ఉంటోంది. మోహ‌న్ లాల్, మ‌మ్ముట్టితో పాటు ఆయా మూవీల డైరెక్ట‌ర్ల‌కు ప్ర‌యారిటీ ఉంటోంది. మ‌ణిర‌త్నం, మురుగ‌దాస్ తో పాటు త్రివిక్రం శ్రీ‌నివాస్, క్రిష్, బోయ‌పాటి శ్రీ‌ను, శ్రీ‌ను వైట్ల‌, హ‌రీష్ శంక‌ర్, సుకుమార్, ప‌ర‌శురాం , త‌రుణ్ బాస్క‌ర్, వంశీ పైడిప‌ల్లి లాంటి వాళ్ల‌ను ఇష్ట‌ప‌డుతున్నారు. లిరిక్ రైట‌ర్స్ తో పాటు యంగ్ టాలెంట్ ప్ర‌ద‌ర్శిస్తున్న సింగ‌ర్స్ ను కూడా ఆద‌రిస్తున్నారు. బాలీవుడ్ విష‌యానికి వ‌స్తే ఖాన్ ల త్ర‌యం హ‌వా కొన‌సాగుతోంది. స‌ల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్‌తో పాటు ప్రియాంక చోప్రా, అనుష్క శ‌ర్మ‌, దీపికా ప‌ద్‌కొనే లాంటి వాళ్ల సినిమాలు బాగా ఆడుతున్నాయి. పాకిస్తాన్ సింగ‌ర్స్ రాహ‌త్ ఫ‌తేహ్ అలీఖాన్, ఆతిఫ్ అస్లాం లాంటి వాళ్లకు డిమాండ్ ఉంటోంది. త‌మ‌న్, దేవిశ్రీ ప్ర‌సాద్, రెహ‌మాన్, మిక్కీ జే మేయ‌ర్ లాంటి మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ యుఎస్ లో దుమ్ము రేపుతున్నారు. హీరోల రేంజ్ దాట‌డంతో డాల‌ర్లు నిర్మాత‌ల‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

తెలుగు సినిమా ప‌రిధి మ‌రింత పెరిగింది. ఓవ‌ర్సీస్‌లో మూవీస్ కు వ‌సూల‌వుతున్న కలెక్ష‌న్లు ఈ విష‌యాన్ని ధృవ‌ప‌రుస్తున్నాయి. ప్ర‌వాసులు కేవ‌లం హీరోలు, డైరెక్ట‌ర్ల‌కే ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా ప్ర‌తిభ ఉన్న వారికే పెద్ద‌పీట వేస్తున్నారు. కొత్త‌ద‌నం ఉన్న సినిమాల‌కు విజ‌యాన్ని క‌ట్ట‌బెడుతున్నారు. ఈ ఏడాది ప‌లు తెలుగు సినిమాలకు డాల‌ర్ల పంట పండింది. పెద్ద హీరోల సినిమాల‌తో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా ప్ర‌వాసుల‌ను అల‌రించాయి. జ‌యాప‌జ‌యాల‌ను ప‌క్క‌న పెడితే కొన్ని మూవీస్ గ‌ణ‌నీయ‌మైన వ‌సూళ్లు రాబ‌ట్ట‌గా మ‌రికొన్ని సినిమాలు అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ బోల్లా కొట్టాయి. యుఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద అత్య‌ధికంగా వ‌సూళ్లు చేసినవి ఇవే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్, స‌మంత న‌టించిన రంగ‌స్థ‌లం భారీ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది.

ఏకంగా 3.51 మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. కొర‌టాల శివ డైరెక్ట‌ర్‌గా మ‌హేష్‌బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను 3.42 మిలియ‌న్ డాల‌ర్ల‌ను రాబ‌ట్టింది. మ‌హాన‌టి మూవీ 2.59 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పెద్ద హీరోల‌కు, డైరెక్ట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు షాక్ ఇస్తూ ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గీత గోవిందం సినిమా 2.45 మిలియ‌న్ డాల‌ర్ల‌ను కొల్ల‌గొట్టింది. త్రివిక్రం శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత సినిమా 2.18 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేయ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అజ్ఞాత‌వాసి మూవీ కి కేవ‌లం 2.06 మిలియ‌న్ డాల‌ర్లు మాత్రమే వ‌చ్చాయి.

వీటితో పాటు నా పేరు సూర్య‌, గూఢ‌చారి, తొలిప్రేమ‌, భాగ‌మ‌తి, దేవ‌దాసు, కేరాఫ్ కంచ‌ర‌పాలెం, టాక్సీవాలా, శైలజారెడ్డి అల్లుడు , త‌దిత‌ర సినిమాలు యు ఎస్ లో రిలీజ్ అయినా ఆశించిన మేర ప్ర‌వాసుల‌ను ఆక‌ట్టుకోలేక చ‌తికిల‌ప‌డ్డాయి. మొద‌టి వారంలో కలెక్ష‌న్లు వ‌చ్చినా చివ‌రి దాకా నిల‌బెట్టుకోలేక పోయాయి. టాలీవుడ్ నిర్మాత‌లు రూట్ మార్చారు. ఎలాగైనా స‌రే పెట్టిన పెట్టుబ‌డి ఓవ‌ర్సీస్ ద్వారానే రాబ‌ట్టు కోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్, ఆడియా, సినిమా ట్రైల‌ర్ పేరుతో ఫంక్ష‌న్లు నిర్వ‌హిస్తూ మార్కెట్ చేసుకుంటున్నారు. ఎంత‌గా జిమ్మిక్కులు చేసినా కంటెంట్ .స‌బ్జెక్టు బాగా ఉన్న వాటికే ప్రేక్ష‌కులు పెద్ద పీట వేశారు. ఏది ఏమైనా నిర్మాత‌లు సేఫ్ సైడ్ లో ఉండ‌డం శుభ ప‌రిణామం.

Comments

comments

Share this post

scroll to top