అమెరికా చిత్తు కాగితాలు, ఇండియా బంగారంతో సమానమా..? అందరూ తెల్సుకోవాల్సిన నిజం.

రూపాయి పతనం అవుతోంది అని ఆందోళనపడేవారికి ఒక సలహా! దేశం మొత్తం అత్యవసరానికి తప్పనిస్తే కార్లు వాడడం వంటివి ఒక్క ఏడురోజులు – ఒక్క ఏడు రోజులు ఆపెయ్యండి డాలరు దెబ్బకు దిగివస్తుంది. ఇది నిజం. ఎందుకంటే డాలరుకు ఆ విలువని ఇచ్చేది పెట్రోలు ధరలు మాత్రమే! దీనినే Derivative ట్రేడింగ్ అంటారు. అమెరికా బంగారంతో తమ డాలరు విలువ కట్టడం మానేసి డెబ్భై సంవత్సరాలైంది. పెట్రోలు  బంగారంలాగా విలువగలిగిందని వారికి అర్ధమై వారు మిడిలీష్టు దేశాలన్నిటివద్దా వాళ్ల పెట్రోలును అమెరికా డాలర్లలో అమ్మేటట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే అమెరికన్ డాలర్ ని అన్ని అప్పులకు debts “లీగల్ టెండర్” అని ముద్రిస్తారు. అంటే ఒకవేళ మీకు డాలర్ నచ్చకపోతే వాళ్ల గవర్నరు వద్దకు వెళ్లి మీ డాలర్ నాకు నచ్చలేదు కాబట్టి నాకు దీనికి బదులుగా బంగారం ఇవ్వండి అంటే వాళ్లు ఇవ్వరు. ఇదీ దీని అర్ధం.

అదే మీరు భారత రూపాయిని చూడండి I promise to pay the bearer అని స్పష్టంగా గవర్నర్ గారి సంతకంతో ఉంటుంది. అంటే మీకు రూపాయి నచ్చకపోతే మీరు వెళ్లి అడిగితే దానికి దగ్గ బంగారం మీకు రిజర్వు బాంకు ఇస్తుంది అన్నమాట. [వాస్తవంలో లావాదేవీల షరతుల్లో తేడా ఉండచ్చు కానీ స్థూలంగా మీకు విషయం అర్ధం అవడానికి చెబుతున్నాను] ఒక ఉదాహరణ చూద్దాం. భారతదేశపు పెట్రోలు మంత్రిగారు పెట్రోలు కొందామని మిడిలీష్టు అంగడికి వెళ్ళారనుకోండి. ఆ అంగడివాళ్ళు చెబుతారు లీటరు పెట్రోలు ఒక డాలరు అని… అయితే భారతదేశంలో రూపాయలుంటాయిగానీ డాలర్లు ఉండవుగదా?! మరెలాగ? అందుకని మంత్రిగారు అమెరికా వెళ్లి అయ్యా మాకు డాలర్లు కావాలి అని అడుగుతారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వారు తమదగ్గర ఉన్న ఒక తెల్లకాగితం మీద డాలర్ ని ముద్రించి ఇచ్చేస్తారు. దాన్ని మనం తెచ్చుకుని దానిని చెల్లించి పెట్రోలు తెచ్చుకుంటామన్నమాట!

అయితే ఇందులో ఒక మోసం ఉంది. మనం మనసు మార్చుకుని మీ డాలర్ నాకు వద్దు మాకు దానికి బదులుగా బంగారం ఇవ్వండి అని అడగలేము… అలా అడిగామో వాళ్లు “తూచ్! మేము నీకు తిరిగి వేరేది ఇస్తామని నీతో ఎనాడైనా చెప్పామా?! కావాలంటే మా డాలర్ మీద స్పష్టంగా ఇది అప్పు అని ముద్రించాముగదా?! తీసుకునేముందర చూసుకోలేదా?!” అని అంటారు.

అంటే అమెరికావారికి తమ డాలర్లు ముద్రించడానికి ఏ విధమైన బంగారమూ తమ వెనుక ఉండాల్సిన అవసరం లేదు. అందుకని వాళ్లు తమ దగ్గర ఉన్న తెల్లకాగితాలమీద డాలర్లు ఎడాపెడా అచ్చు గుద్దేస్తుంటారన్నమాట. అయితే మరి అమెరికా వాళ్లు మిడిలీష్టువారికి ఏం ఇస్తారు? అంటే అక్కడ ఉన్న రాజులని కాపాడినందుకు అమెరికా సైన్యానికి ఈ రాజులు అద్దె చెల్లిస్తారు. అలాగే ఆ దేశాల్లో రోడ్లు భవనాలవంటివి నిర్మించిన అప్పు ఇంకా ఆ దేశ రాజులు తీరుస్తూనే ఉన్నారు. అదే అమెరికా డాలరు విలువ. అందుకే అమెరికా డాలరు ఏనాడో హఠాత్తుగా పతనం అవుతుందని అందరూ చెబుతారు.

ఇకపోతే భారతదేశపు కష్టం అల్లా ఆ అమెరికా డాలర్లను కొనుక్కోవడంలో వచ్చింది. అమెరికావారి చిత్తుకాగితాలు భారతదేశపు బంగారంతో సమానం అన్నమాట! దేశంలో కార్ల వాడకం తగ్గిస్తే దెబ్బకు డాలరు దిగుతుంది. అర్ధమైందా?!  

– by————-: మాధవ తురుమెళ్ల

Comments

comments

Share this post

5 Replies to “అమెరికా చిత్తు కాగితాలు, ఇండియా బంగారంతో సమానమా..? అందరూ తెల్సుకోవాల్సిన నిజం.”

 1. sam says:

  I agree with you

  1. Prasad says:

   I agree with you friend

 2. Raju says:

  Its not only fuel. But India needs to make products that world will consume. Make in India products should be exported in large scale like Dr. JP of Loksatta did by exporting food grains from and benefited the country by $ 12 Billion. More we export and less we import will make dollar fall.

 3. sridhar channagiri says:

  kani practicle ga yematram workout kadu. okka chance undi. celebrities vari fans ni include cheste 50% success avuthundi.
  realisation valla 10% avuthundi. migata 40% too hard.

 4. Prasad says:

  I agree with you friend

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top