వీ6 ఛానల్ కు “తీన్మార్ బిత్తిరి సత్తి” రాజీనామా.? అసలు కారణం ఏంటి.? చివరికి ఏమైంది.?

‘తీన్మార్’ ప్రోగ్రాంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బిత్తిరి సత్తి వీ6 ఛానల్‌కు రిజైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌కు సత్తికి మధ్య గొడవ అయ్యిందని, ఫలితంగా అతడు రాజీనామా చేశాడని వార్త విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణ యాసతో తనదైన శైలిలో ప్రేక్షకుల్ని కట్టి పడేసే సత్తి అలియాస్ రవి కెరీర్‌ను వీ6లో ప్రసారమయ్యే తీన్మార్ ప్రోగ్రాం మలుపు తిప్పింది. సత్తికి ఇటీవల పాపులారిటీ బాగా పెరిగింది. దీంతో అతడు తీన్మార్ కోసం పని చేస్తూనే బయట కూడా వేరే ప్రోగ్రాంలు చేస్తున్నాడు. దీనికి వీ6 యాజమాన్య కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇటీవలి కాలంలో ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తుండటం, ఉదయాభాను లాంటి యాంకర్లతో కలిసి పని చేసే అవకాశంతో సత్తి ఆలోచనా విధానం మారిందని తెలుస్తుంది.

వీ6 ఛానెల్‌కు అత్యంత కీలకమైన తీన్మార్ ప్రోగ్రాంకు తన హావభావాలు, మాటతీరుతో సత్తి ప్రత్యేకతను తీసుకొచ్చాడు. ఇప్పుడు సడెన్‌గా అతడు దూరమైతే అది ఛానెల్‌కే గట్టి ఎదురు దెబ్బ. అందుకే అతణ్ని వదులకునేందుకు వీ6 పెద్దలు ఏ మాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది. సత్తితో గొడవ వ్యవహారం తుది అంకానికి చేరుకున్న పరిస్థితుల్లో వీ6 అధినేత వివేక్ అతడితో మాట్లాడినట్టు సమాచారం. ఏకంగా పెద్దాయనే మాట్లాడటంతో సత్తి కూడా రాజీ పడ్డాడని తెలుస్తోంది. వాస్తవానికి బిత్తిరి సత్తికి వీ6 అనేక విధాలుగా వెసులుబాటు కల్పిస్తోంది. తీన్మార్‌ షూటింగ్ కోసం అతడెక్కడ ఉంటే అక్కడికే కెమెరాతో సిబ్బంది వాలిపోతున్నారు. కానీ ఇటీవల సత్తి వ్యవహార శైలిలో చాలా మార్పు వచ్చిందని, దీంతో నిలదీయడంతో గొడవైందని తెలుస్తోంది. ఈ కారణంగానే బిత్తిరి సత్తి రాజీనామా నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

రంగారెడ్డి జిల్లాకు చెందిన చెవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి సినిమాల్లో అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూశాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు. తర్వాత 6 టీవీలో నర్సయ్య తాత క్యారెక్టర్ చేసే అవకాశం లభించింది. తర్వాత వీ6కు మారాడు. తొలుత తీన్మార్ షో రాచ రాములమ్మ, మల్లన్న, తీన్మార్ లచ్చవ్వ లాంటి కొత్త క్యారెక్టర్లతో మొదలైంది. అనతి కాలంలోనే ఈ షో ఎంతో పాపులర్ అయ్యింది. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతో మల్లన్న ఆ షోకు గుడ్ బై చెప్పాడు. టాలెంటెడ్ యాంకర్ కోసం వీ6 చూస్తున్న సమయంలో మల్లన్నను మరిపించేలా బిత్తిరి సత్తి దూసుకొచ్చాడు.

Comments

comments

Share this post

scroll to top