గర్భిణికి కి HIV రక్తం ఎక్కించిన వైద్యులు..!! ప్రభుత్వ ఆస్పత్రి పైన మండిపడుతున్న జనాలు..!!

తమిళనాడు లోని విరుదునగర్ జిల్లా శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణికి HIV రక్తం ఎక్కించారు, అయితే కావాలని ఆ రక్తం ఆమెకు ఎక్కించలేదు, దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటన వెలుగులోకి రావడం తో గవర్నమెంట్ అధికారుల పనితీరు పైన మండిపడుతున్నారు జనాలు. వివరాల్లోకెళితే, 19 ఏళ్ళ కుర్రాడు కొన్ని నెలల క్రితం రక్త దానం చేసాడు, అయితే రక్త దానం చేసే సమయం లో అతని రక్తాన్ని సరిగ్గా పరిశీలించలేదు. అతని బ్లడ్ ని గర్భిణికి కొన్ని రోజుల క్రితం ఎక్కించారు, అతనికి HIV ఉందని గ్రహించిన వెంటనే, బ్లడ్ బ్యాంకు కి వెళ్లి తన రక్తాన్ని ఎవరికి ఎక్కించారో కనుక్కున్నాడు ఆ కుర్రాడు, వెంటనే శివకాశి ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి వారికి సమాచారం ఇచ్చాడు, దీంతో అందరు ఒక్క సారిగా షాక్ అయ్యారు.

బిడ్డ కు ఏం కాకుండా చికిత్స చేస్తున్నారు :

అయితే ఆ గర్భిణి కడుపు లో ఉన్న శిశువుకు HIV సోకకుండా వైద్యం అందిస్తున్నారు డాక్టర్స్, తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉప కార్యదర్శి రాధాకృష్ణన్ రక్తం సేకరించిన బ్లడ్ బ్యాంక్ వద్దకు వెళ్లి విచారించారు. అనంతరం బ్లడ్ బ్యాంకుకు చెందిన ముగ్గురు సీనియర్ ఉద్యోగులను పదవి నుంచి తొలగించామని అధికారులు తెలిపారు, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో బ్లడ్ ఎక్కించుకున్న వారంతా భయబ్రాంతులకు గురయ్యారు, వారిలో చాలా మంది HIV పరీక్షలు కూడా చేయించుకున్నారు ఈ విషయం తెలిసాక. బ్లడ్ బ్యాంకు లో పని చేసిన ఆ ముగ్గురి నిర్లక్ష్యం వలన ఇప్పుడు తల్లి బిడ్డ కు ముప్పు వచ్చింది. బాధిత మహిళకు అవసరమైన వైద్యం అందించి, ఆమె డిగ్రీ పూర్తి చేసి ఉండటంతో. ప్రసవం తర్వాత ఆమెకు, ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ఆత్మహత్యాయత్నం :

రక్తం ఇచ్చిన బాధితుడు బాధలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రక్త దానం చేసేటప్పుడే కాదు, రక్తం ఎక్కించేటప్పుడు కూడా ఆ రక్తాన్ని క్షుణ్ణంగా పరీక్షించాలి, బ్లడ్ బ్యాంకు లో కలెక్ట్ చేసే బ్లడ్ ని ఒకటికి రెండు సార్లు పరీక్షించాలి, అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.

 

 

Comments

comments

Share this post

scroll to top