నెలలో రెండు సార్లు ప్రసవించిన మహిళ, ఆశ్చర్యం లో డాక్టర్లు..!!

ఎక్కడైనా ఒక ప్రసవం లో ఒకరు, ఇద్దరు బిడ్డలు పుడతారు, కొంత మందికి ముగ్గురు కూడా పుడతారు, కానీ ఒక నెలలోపు రెండు సార్లు ప్రసవించడం అంటే చాలా అరుదు, అలంటి అరుదైన ఘటన బాంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది, వివరాల్లోకి వెళితే… బంగ్లాదేశ్ కి చెందిన ఆరీఫా సుల్తానా(20) గత నెల ఫిబ్రవరి 5వ తేదీన ఓ బిడ్డకు జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీలో ఓ మగ బిడ్డ జన్మనిచ్చింది సుల్తానా. బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగానే ఉండటం తో ఆమె బిడ్డ ను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది, కాని డెలివరీ అయిన 26 రోజులకే ఆమెకు మళ్ళీ నొప్పులు మొదలవడం తో హాస్పిటల్ కి తరలించారు.

ఆశ్చర్యం లో డాక్టర్స్.. :

ఆమె కడుపులో మరో ఇద్దరు శిశువులు ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు, మొదటి డెలివరీ నార్మల్ డెలివరీ కాగా, ఈ సారి సీజేరియన్ చేసారు ఆమెకు. ఇద్దరు బిడ్డలను బైటికి తీసాక చికిత్స అందించారు, తల్లి మరియు ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారని డాక్టర్ లు తెలిపారు. మొదటి డెలివరీ లో బాబు పుట్టగా, రెండో డెలివరీ లో ఒక బాబు ఒక పాప పుట్టారు.

మొదటి డెలివరీ తరువాత.. :

మొదటి డెలివరీ సమయం లో ఆమె గర్భం లో ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నట్టు డాక్టర్ లు గుర్తించలేకపోయారు, ఆమె కూడా తెలుసుకోలేకపోయింది, మొదటి డెలివరీ అయిన 26 రోజుల తరువాత ఆమెకు నొప్పులు రావడం తో ఆమెకు అర్ధమయ్యింది. తన 30ఏళ్ల సర్వీసులో ఇలాంటి అరుదైన కేసు ఇప్పటి వరకు చూడలేదని టాయని గైనకాలజిస్ట్‌ పొద్దార్‌ తెలిపారు. ముగ్గురు పిల్లలు మరియు తల్లి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.

కష్ట పడి పెంచుకుంటా.. :

ఆరిఫా భర్త సుమోన్‌ బిస్వాస్‌ కూలీ పని చేస్తాడు, నెలకు RS.6 వేలు సంపాదిస్తాడు ఆరిఫా భర్త. దేవుడు ప్రసాదించిన వరం ఈ ముగ్గురు, కష్ట పడి ఈ ముగ్గురిని మంచిగా చూసుకుంటా, బాగా పెంచుతా అని ఆరిఫా సుల్తాన్ భర్త సుమోన్‌ బిస్వాస్‌ తెలిపారు.

 

Comments

comments

Share this post

scroll to top