ఆ డాక్టర్లు భూకంపం వస్తున్నా….భయపడకుండా ఆపరేషన్ చేసి పేషెంట్ను బతికించారు!

ఆప‌రేష‌న్ టైంలో భూకంపం వ‌స్తే… అది కూడా  పేషెంట్‌కు ఆప‌రేష‌న్ చేసే మధ్యలో వస్తే …ఆప‌రేష‌న్ చేసే వైద్యులు, సహాయ‌క సిబ్బంది, రోగి ప‌రిస్థితి ఏంటీ ? ఆప‌రేష‌న్, రోగిని వ‌దిలేసి పారిపోతారా ? ప‌్రాణాల‌కు ఎదురొడ్డి, ప్రాణాలు కాపాడుతారా ? సినిమాలో అయితే ఏదో అద్భుతం జ‌రిగేదేమో కానీ జ‌మ్మూకాశ్మీర్‌లో మాత్రం స్కిమ్స్ ఆసుప‌త్రి వైద్యులు సాహ‌సం చేశార‌నే చెప్పాలి. స్కిమ్స్ ఆసుప‌త్రిలో వైద్యులు ఒక రోగికి ఆప‌రేష‌న్ చేస్తున్న స‌మ‌యంలోనే ఆఫ్ఘ‌న్‌, పాకిస్తాన్‌లో వ‌చ్చిన భూకంపం వ‌ల్ల కాశ్మీర్‌లో కూడా ఆ ప్ర‌భావం క‌నిపించింది. అయితే స‌హాయ‌క సిబ్బంది మాత్రం భ‌య‌ప‌డి పారిపోతే దేవుడి లాంటి వైద్యులు గోడ‌లు ప‌ట్టుకుని ధైర్యంగా నిల‌బ‌డి రోగికి ఆప‌రేష‌న్ పూర్తి చేశారు. అత‌ని ప్రాణాలు నిల‌బెట్టారు. వైద్యో నారాయ‌ణా హ‌రీ అనే మాట‌ను నిజం చేశారు. ఈ దేవుడి లాంటి వైద్యులు.

13-1431517808-nepal-earthquake-victim-getting-treatment

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top