చ‌నిపోయింద‌నుకుని పూడుద్దామనుకునే స‌రికి… ప‌సికందు బ‌తికింది… అందుకు కార‌ణం వైద్యుల నిర్ల‌క్ష్య‌మే..!

మ‌న దేశంలో ఉన్న ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రోగుల‌కు వైద్యం ఎలా అందుతుందో చెప్పేందుకు ఈ సంఘ‌ట‌నే ఓ ఉదాహ‌ర‌ణ‌. విన‌డానికే నిస్సిగ్గుగా అనిపించేటంత‌టి ఈ ఘ‌ట‌న‌లో బాధితుల‌కు ఇంకా ఇబ్బంది క‌లిగి ఉంటుందో మ‌నం ఇట్టే ఊహించ‌వ‌చ్చు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే… గ‌ర్భంతో ఉండి తీవ్ర‌మైన అవ‌స్థ ప‌డుతున్న ఓ మ‌హిళ‌కు ఆ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి వైద్యులు కాన్పు చేశారు. అయితే పుట్టిన బిడ్డను పూర్తిగా చెక్ చేయ‌కుండానే చ‌నిపోయింద‌ని చెప్పారు. దీంతో ఆ చిన్నారిన ఖ‌ననం చేసేందుకు య‌త్నించిన త‌ల్లిదండ్రులు షాక్ తిన్నారు. అప్ప‌టికి ఇంకా ఆ ప‌సికందు బ‌తికే ఉంది. ఈ ఘ‌ట‌న జ‌రిగింది రాజ‌స్థాన్‌లో..!

రాజ‌స్థాన్ లోని కోటా జిల్లా బుండి గ్రామంలో ఉన్న ఓ మ‌హిళ‌కు గ‌ర్భం కార‌ణంగా ఇటీవ‌లే తీవ్ర‌మైన అవ‌స్థ ఎదురైంది. అయితే వెంట‌నే ఆమెను త‌న భ‌ర్త ద‌గ్గ‌ర్లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. ఈ క్ర‌మంలో అక్క‌డి వైద్యులు వెంట‌నే ఆప‌రేష‌న్ చేసి బిడ్డ‌ను బ‌య‌టికి తీయాల‌ని చెప్పారు. లేదంటే త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రికీ ప్ర‌మాద‌మేన‌న్నారు. దీంతో నెల‌లు నిండ‌క‌పోయినా వారు ఆప‌రేష‌న్‌కు ఒప్పుకున్నారు. ఈ క్ర‌మంలో ఆ మ‌హిళ‌కు ఆప‌రేష‌న్ చేసిన వైద్యులు ప‌సికందును బ‌య‌టికి తీశారు.

అయితే ఆ ప‌సికందును అసలు ఆ వైద్యులు చెక్ చేయ‌లేదు. అలా చేయ‌కుండానే ఆ పాప చ‌నిపోయింద‌ని చెప్పారు. దీంతో ఆ త‌ల్లిదండ్రులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. వెంట‌నే తేరుకుని ఆ ప‌సికందును పూడ్చి పెట్ట‌డానికి శ్మ‌శానానికి వెళ్లారు. తీరా కార్య‌క్ర‌మం చేస్తుండ‌గా ఒక్క‌సారిగా ఆ ప‌సికందు ఏడ్చింది. దీంతో ఆ పాప త‌ల్లిదండ్రులే కాదు, అక్క‌డ చుట్టూ ఉన్న వారు కూడా షాక్‌కు గుర‌య్యారు. వెంట‌నే ఆ చిన్నారిని మ‌రో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో పాప ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించిన ఆస్ప‌త్రి సిబ్బందిపై కేసు పెట్టారు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చూశారుగా..! ఇలా మాత్రం ఎవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌దు..!

Comments

comments

Share this post

scroll to top