ఈ డాక్టర్ కుటుంబం కొత్త అడవినే తయారు చేశారు, అంతే కాదు మందుల అవసరం లేకుండా బ్రతకడం కూడా నేర్పిస్తారు !!

ఇప్పుడు ఉన్న పరిస్థితిలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి అంటేనే భయపడతారు జనాలు. చిన్న జబ్బు అయినా కూడా చాలా మందులు రాసిస్తారు అని భయపడతారు. కానీ పూణే నగరంలోని ప్రవీణ్ చోర్డియా అనే ఒక డాక్టర్ ఉన్నాడు, ఇతనికి మాత్రం మందులు అంటే అస్సలు నచ్చవు. ఇతను పూణే నగరానికి దగ్గరలో 110 ఎకరాల బంజరు భూమి కొన్నాడు. ఇప్పుడు దాని ఒక అడవిగా మార్చాడు. మరి ఈ డాక్టర్ గురించి మరింత తెల్సుకోవాలి అంటే మొత్తం చదవాల్సిందే..

పూణే నగరంలో ప్రవీణ్ చోర్డియా ఒక సాధారణ సర్జన్, 22 ఏళ్ళ నుండి ఒక హాస్పిటల్ కూడా నడుపుతున్నాడు. కానీ అతనికి ప్రకృతితో దూరంగా ఉంటున్నాము అని చెప్పి ఎప్పుడు ఒక అసంతృప్తి ఉండేది. దాంతో అతను పూణే నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం దగ్గర్లో ఉన్న 110 ఎకరాలను కొన్నాడు. పూణేలోని తన ఆసుపత్రి కూడా వదిలేసి అక్కడ ఉన్న బంజరు భూమిలో చెట్లు పెట్టడం మొదలుపెట్టాడు. ఇప్పటికే 45 ఎకరాల భూమిని అడవిగా మార్చేశారు వీరి కుటుంబం. అంతే కాదు అక్కడ ఉన్న గ్రామం వారికి సేంద్రియ పద్దతిలో వ్యవసాయం ఎలా చేయాల్నో కూడా నేర్పించారు. ఇంకా వారికి ఉపాధి కల్పించడానికి అగర్బత్తులు కూడా తయారు చేయిస్తున్నారు.

వీరు తయారు చేసిన అడవిలో 1000 పై రకాల చెట్లు ఉన్నాయి. దాదాపు 50 ,000 చెట్లు నాటారు. డాక్టర్ ప్రవీణ్ చోర్డియా ఈ ప్రాంతానికి “సెరెన్ ఎకో విల్లెజ్” అని పేరు కూడా పెట్టారు. రెండేళ్ల నుండి ఇక్కడికి చెట్లు అంటే ఇష్టం ఉంది సేంద్రియ వ్యయసాయం నేర్చుకోవాలి అనుకునేవారికి రావడానికి అనుమతి ఇస్తున్నారు. ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికి ప్రవీణ్ చోర్డియా 2000 మందిని మందులు అవసరం లేకుండా బ్రతికేలా చేసాడు.

Comments

comments

Share this post

scroll to top