“పాము” కాటేసినా ఇకపై ఎవరు మరణించరు..! అలాంటి ఐడియా కనిపెట్టారు ఆ ప్రొఫెసర్..!

ప్రపంచవ్యాప్తంగా  ప్రతి సంవత్సరం దాదాపు  50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా.. మన దేశంలో  దాదాపు  250 జాతుల పాములున్నప్పటకిీ వాటిలో  52 విష సర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం  5  పాములు  అత్యంత విషాన్ని కల్గిఉన్నవి. అవి కరిస్తే  మ్యాగ్జిమమ్ 3 గంటల్లో మనిషి చనిపోతాడు.. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు. పాము కాటుతో ఎవరు మరణించొద్దు అని ప్రొఫెసర్ ఒక ఐడియాతో ముందుకి వచ్చారు!

పాముకాటు వల్ల శరీరంలోకి విషం ఎక్కితే “యాంటీ స్నేక్ వీనమ్” తో తప్ప మరే వైద్యంతో బతికే అవకాశం లేదు. కానీ దేశంలో యాంటీ వీనమ్ అందించే సదుపాయాలే సరిగ్గా లేవు. దీంతో ఏటా వేలాది మంది చనిపోతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో…మరణాల సంఖ్యను తగ్గించడానికి ఓ ఉపాయాన్ని కనిపెట్టారు హిమాచల్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఒమేశ్ కుమార్ భారతి.

తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన 108 లాంటి ఎమర్జెన్సీ అంబులెన్సులలో యాంటీ స్నేక్ వీనమ్ ను అందుబాటులో ఉంచితే… ప్రమాదం నుంచి చాలా మందిని కాపాడే శక్తి ఉందని చెప్పారు.

rat-snake-fight

సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తిని గంటలోపు హాస్పిటల్ కు తీసుకువెళితే ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంది. కానీ మనదగ్గర అంబులెన్సులలో ఈ అవకాశం లేదు. దీనిపై ప్రభుత్వాలకు కూడా సమగ్ర దృష్టిలేదు. ఈ విషయాన్ని గమనించిన ఒమేశ్ కుమార్… హిమాచల్ ప్రదేశ్ లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్క ఏడాదిలో 42 మంది ప్రాణాలను కాపాడగలిగారు. దీనిపై ఓ పరిశోధన పత్రాన్ని ఇండియన్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ రిసెర్చ్ – 2015కు సమర్పించారు. అది దేశవ్యాప్తంగానే కాదు… వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ పరిశోధనను ప్రశంసించింది. ఈ విషయాన్ని గతేడాది జెనీవాలో జరిగిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సదస్సులో ప్రస్తావించారు. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. పాము కాటు మరణాల్లో నూటికి 95శాతం సరైన వైద్యం అందకపోవడమేనని.. అంబులెన్సులలో యాంటీ స్నేక్ వీనమ్ అందుబాటులో ఉంచితే … ఈ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నారు డాక్టర్ ఒమేశ్.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో 108 సర్వీసులు అందిస్తున్న జీవీకే EMRI దీనిపై దృష్టి పెట్టింది. వెంటనే సుమారు 1000 అంబులెన్సులలో యాంటీ స్నేక్ వీనమ్ ను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల చాలా మంది ప్రాణాలను కాపాడగలుతున్నామని అంటున్నారు 108 సర్వీసుల సిబ్బంది.

 

Comments

comments

Share this post

scroll to top