పుష్క‌రాల్లో 12 రోజుల పాటు ఈ వ‌స్తువులు దానం చేస్తే అనేక శుభాలు కల్గుతాయంట!

పుష్క‌రాలు… హిందువుల‌కు ఎంతో ప‌విత్ర‌మైనవి. 12 సంవ‌త్సరాల‌కు ఒక‌సారి ఒక్కో న‌దికి వ‌స్తుంటాయి. అలా వ‌చ్చే పుష్క‌రాలు 12 రోజుల పాటు ఉంటాయి. ఆ రోజుల్లో న‌దిలో స్నానం ఆచ‌రిస్తే ఎంతో పుణ్యం క‌లుగుతుంద‌ని భ‌క్తులు న‌మ్ముతారు. చాలా మంది చ‌నిపోయిన త‌మ కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితుల‌కు పిండ ప్ర‌దానాలు కూడా చేస్తారు. అయితే మీకు తెలుసా..? ఇవే కాకుండా పుష్క‌రాలు ఉన్న 12 రోజుల్లో రోజూ ప‌లు వ‌స్తువుల‌ను, ప‌దార్థాల‌ను దానం ఇస్తే చాలా మంచిద‌ట‌. దీంతో అనేక శుభాలు క‌లుగుతాయ‌ట‌. ఈ క్రమంలో ఆ 12 రోజుల్లో భ‌క్తులు ఏమేం దాన‌మివ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

krishna-pushkaram

 • 1వ రోజు…
  బంగారం, వెండి, ధాన్యం, భూమి దానం చేయాలి. అన్ని ర‌కాల ఐశ్వ‌ర్యాలు సొంత‌మ‌వుతాయి. సూర్య‌చంద్ర లోకాల ప్రాప్తి క‌లుగుతుంది. భూ సంప‌ద చేకూరుతుంది. ధ‌నం మిక్కిలిగా వ‌స్తుంది.
 • 2వ రోజు…
  ఆవు, దుస్తులు, ర‌త్నం, ల‌వ‌ణాలు దానం చేయాలి. రుద్రలోకం ప్రాప్తి చెందుతుంది. వ‌స్తువులు స‌మ‌కూరుతాయి. శారీర‌క ఆరోగ్యం క‌లుగుతుంది.
 • 3వ రోజు…
  కూర‌లు, పండ్లు, గుగ్గిళ్లు, గుర్రాలు దానం చేయాలి. ఇంద్రుడి లాంటి వైభ‌వం పొందుతారు.
 • 4వ రోజు…
  పాలు, తేనె, నెయ్యి, నూనెలు దానం చేయాలి. సిరి సంప‌ద‌లు క‌లుగుతాయి. ఆయుష్షు వృద్ధి చెందుతుంది. న‌ర‌క‌లోకం సంప్రాప్తించ‌దు.
 • 5వ రోజు…
  ధాన్యం, బండి, గేదె, ఎద్దుల‌ను దానం చేయాలి. కైలాస నివాసం క‌లుగుతుంది. అన్ని భోగ భాగ్యాలు స‌మ‌కూరుతాయి.

13957580_1071992319505219_698052318_n

 • 6వ రోజు…
  అగ‌రు, క‌స్తూరి, చంద‌నం, వ‌ట్టివేరు, జాజికాయ‌, జాపత్రి, క‌ర‌క్కాయ వంటివి దానం చేయాలి. ఆరోగ్యం క‌లుగుతుంది. ల‌క్ష్మీ క‌టాక్షం క‌లుగుతుంది.
 • 7వ రోజు…
  గృహం, పీఠం, శ‌య్య‌ల‌ను దానాలు చేయాలి. అంతులేని సౌఖ్యం క‌లుగుతుంది. త‌రువాతి జ‌న్మ‌లో ప్ర‌భుత్వ అధికారం చేతికందుతుంది.
 • 8వ రోజు…
  గంధం, దారు, పుష్ప‌మాల‌లు దానం చేయాలి. ఇంద్ర‌లోకంలో ఉండే శుభాలు క‌లుగుతాయి.
 • 9వ రోజు…
  పిండ‌దానం, పితృదేవ‌త ఆరాధన చేయాలి. వంశం వృద్ధి చెందుతుంది. స్వ‌ర్గ సుఖాలు ల‌భిస్తాయి.
 • 10వ రోజు…
  పుస్త‌కాలు, వెండి, ముత్యం, లోహ‌పు గొలుసుల‌ను దానం చేయాలి. భూమి సంప‌ద సిద్ధిస్తుంది. పుణ్య‌లోకాలు క‌లుగుతాయి.
 • 11వ రోజు…
  ఏనుగు, గుర్రం ల‌ను దానం చేయాలి. వైకుంఠ లోకం ప్రాప్తి చెందుతుంది.
 • 12వ రోజు…
  మేక‌, ఆవు, బంగారం, వెండి, గేదె, ర‌త్నాలు, పుస్త‌కాలు, ప‌త్తి, ఏనుగు, గుర్రం, దాసి, త్రాసు, ఇల్లు, తేనె, శ‌య్య‌, క‌న్యాదానం చేయాలి. అన్ని క‌ష్టాలు పోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణ విముక్తి క‌లుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top