ర‌జ‌నీ ‘క‌బాలి’ పోస్ట‌ర్ ఇర్ఫాన్ ఖాన్ సినిమా పోస్ట‌ర్‌కు కాపీనా..?

సినిమాల‌న్నాక ద‌ర్శ‌కులు, సంగీత ద‌ర్శ‌కులు, ఆర్ట్ డిజైనర్లు… ఇలా సినిమాకు సంబంధించిన ఆయా విభాగాల్లో ప‌నిచేసే వారు ఇత‌ర సినిమాల నుంచి ప‌లు సీన్ల‌నో, సంగీతాన్నో, ఆర్ట్‌నో కాపీ కొట్ట‌డం మామూలే. ఇది అన్ని రంగాల‌కు చెందిన సినిమా ఇండస్ట్రీల్లోనూ అప్పుడ‌ప్పుడు జ‌రుగుతూనే ఉంటుంది. అయితే ఆ కాపీని ఎవ‌రో ఒక‌రు ప‌సిగ‌ట్టి తెలియజేస్తే త‌ప్ప అంద‌రికీ దాని గురించి తెలియ‌దు. ఇక త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న సినిమాకు సంబంధించిన ఏ అంశాన్న‌యినా ఇత‌ర సినిమా యూనిట్ స‌భ్యులు కాపీ కొడితే ఇక అప్పుడు ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్‌కు కూడా స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. అదేమిటంటే…

kabali-madaari

నిశికాంత్ కామ‌త్ ద‌ర్శ‌క‌త్వంలో ఇర్ఫాన్‌ఖాన్ న‌టించిన తాజా చిత్రం ‘మ‌దారి’ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వాల్ పోస్ట‌ర్‌లో ఇర్ఫాన్‌ఖాన్ ఫొటో ప‌లు ఆకాశ హ‌ర్మ్యాలు, భ‌వ‌నాల మ‌ధ్య ఉంటుంది. అయితే అచ్చం ఈ పోస్ట‌ర్‌ను పోలి ఉండే విధంగానే ర‌జ‌నీ కాంత్ ‘క‌బాలి’ సినిమా పోస్ట‌ర్‌ను కూడా డిజైన్ చేశారు. ఈ క్ర‌మంలో ఇర్ఫాన్‌ఖాన్‌కు ఇటీవ‌లే ఈ విష‌యం తెలిసింది. అయితే మొద‌ట్లో ఆయ‌న దాన్ని ఖండించినా చివ‌రికి మాత్రం ఎందుకు గొడ‌వ అనుకున్నాడో ఏమో ర‌జ‌నీ ‘క‌బాలి’తోపాటు త‌న సినిమాను కూడా చూడ‌మ‌ని, రెండూ ఒకే లాంటి సినిమాలు అయి ఉండ‌వ‌ని అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేశాడు. అంతే క‌దా మ‌రి, పోస్ట‌ర్స్ ఒకే విధంగా ఉంటే సినిమా కూడా అలాగే ఒకే విధంగా ఉంటుంద‌ని ఫ్యాన్స్ అనుకోవ‌చ్చుగా. అందుకే ఇర్ఫాన్ ఖాన్ ఆ విన్న‌పం చేశారు.

కాగా ‘మ‌దారి’ పోస్ట‌ర్‌కు కాపీగా భావిస్తున్న ‘క‌బాలి’ పోస్ట‌ర్‌ను ఆ సినిమా యూనిట్ డిజైన్ చేయ‌లేద‌ని, ర‌జ‌నీ అభిమానులే ఎవ‌రో అలా చేశార‌ని ప‌లువురు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ కాపీ మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ క్ర‌మంలో రెండు సినిమాలు విడుద‌లైతే కానీ అస‌లు జ‌రిగిన విష‌యం ఏమిటి? వాటిలో ఉన్న క‌థేమిటి? రెండూ ఒకే విధంగా ఉంటాయా? లేదా? అనే విష‌యాలు మాత్రం తెలియ‌వు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top