నిద్రించే భంగిమ‌ను బ‌ట్టి… ఏయే అనారోగ్యాల‌ను ఎలా దూరం చేసుకోవ‌చ్చో తెలుసా..?

నిద్ర అనేది మ‌న‌కు ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. నిత్యం ప్ర‌తి ఒక్క‌రు క‌నీసం 6 నుంచి 8 గంటలు నిద్ర‌పోవాలి. అప్పుడే అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అయితే మీకు తెలుసా..? ప‌లు అనారోగ్యాల‌ను నిద్ర వ‌ల్ల త‌గ్గించుకోవచ్చ‌ని..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే..! అయితే మీరు ఎలా ప‌డితే అలా నిద్ర‌పోకూడ‌దు. ఎందుకంటే ఒక్కో అనారోగ్య స‌మ‌స్య‌కు ఒక్కో ర‌కంగా నిద్ర‌పోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

shoulder-pain

భుజాల నొప్పికి…
భుజాల నొప్పి ఉన్న‌వారు వెల్ల‌కిలా ప‌డుకోవాలి. పొట్ట‌పై ఇంకో దిండు పెట్టుకుని నిద్రించాలి. ఒక వేళ వెల్ల‌కిలా ప‌డుకోవ‌డం ఇష్టం లేక‌పోతే సైడ్‌కి తిరిగి కూడా ప‌డుకోవ‌చ్చు. కానీ నొప్పి లేని భుజం దిశ‌గా ప‌డుకోవాలి. అయితే పొట్ట‌ను బెడ్‌కు ఆనించి బోర్లా మాత్రం ప‌డుకోకూడ‌దు.

back-pain

వెన్ను నొప్పికి…
వెల్ల‌కిలా ప‌డుకుంటే వెన్ను నొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు. అయితే ఆ స్థితిలో ఓ దిండును మోకాళ్ల కింద ఉంచి నిద్ర‌పోవాలి. ఇలా చేస్తే వెన్ను నొప్పి ఇంకా ఎఫెక్టివ్‌గా త‌గ్గుతుంది. వెల్ల‌కిలా ప‌డుకోలేని వారు సైడ్‌కి తిరిగి ప‌డుకోవ‌చ్చు. కానీ మోకాళ్ల‌ను ఛాతి వ‌ర‌కు తెచ్చి నిద్రించాలి. బోర్లా ప‌డుకునే వారైతే పొట్ట కింద ఓ దిండు పెట్టుకుని నిద్రించాలి.

neck-pain

మెడ నొప్పికి…
మెడ నొప్పి ఉన్న‌వారు వెల్ల‌కిలా ప‌డుకుని రెండు చేతుల కింద రెండు దిండ్ల‌ను పెట్టుకుని నిద్రించాలి. ఒక‌వేళ సైడ్‌కి తిరిగి ప‌డుకుంటే దిండు ఎత్తుగా ఉండ‌కుండా చూసుకోవాలి. బోర్లా ప‌డుకుంటే పొట్ట కింద స‌న్న‌ని దిండు పెట్టుకోవాలి.

నిద్ర‌లేమికి…
బెడ్‌పై ప‌డుకున్నా త్వ‌ర‌గా నిద్ర రాకుంటే అలాంటి వారు పుస్త‌కాల‌ను చ‌ద‌వ‌డం అల‌వాటు చేసుకోవాలి. దీంతో నిద్ర బాగా వ‌స్తుంది. నిద్ర స‌రిగ్గా ప‌ట్టాలంటే నిద్రించ‌డానికి ముందు కాఫీ, టీ, ఎన‌ర్జీ డ్రింక్స్‌, సోడా వంటివి తాగ‌కూడ‌దు. నిత్యం వ్యాయామం చేస్తే రాత్రి చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది.

రాత్రి మెళ‌కువ వ‌స్తుంటే…
రాత్రి ప‌డుకున్నా కొంత సేపు అయ్యాక కొంద‌రికి మెళ‌కువ వ‌స్తుంది. అప్పుడు వారికి స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌దు. అలాంటి వారు ఏం చేయాలంటే మ‌ద్యం పానం మానేయాలి. రాత్రి ప‌డుకునే ముందు సెల్‌ఫోన్ వంటి గ్యాడ్జెట్ల‌ను వాడ‌కూడ‌దు. దీంతోపాటు గ‌ది ఉష్ణోగ్ర‌త 20 నుంచి 22 డిగ్రీల మ‌ధ్య ఉండేలా చూసుకుంటే బెట‌ర్‌.

టైముకు నిద్ర లేవ‌క‌పోతుంటే…
చాలా మందికి ఉన్న స‌మ‌స్యే ఇది. ఇందుకోసం నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. అయితే ముందు రోజు రాత్రి త్వ‌ర‌గా ప‌డుకుంటే త‌రువాతి రోజు ఉద‌యాన్నే లేచేందుకు అవ‌కాశం ఉంటుంది.

snoring

గుర‌క‌కు…
గుర‌క స‌మ‌స్య ఉన్న‌వారు వెల్ల‌కిలా ప‌డుకోకూడ‌దు. సైడ్‌కి తిరిగి మోకాళ్ల‌ను ఛాతి వ‌ద్ద‌కు తెచ్చి నిద్రించాలి. అలాగే దిండు కొంచెం ఎక్కువ ఎత్తు ఉన్న‌ది వాడితే బెట‌ర్‌.

leg-cramps

కాళ్లు ప‌ట్టుకుంటే…
కండ‌రాలు, పిక్క‌లు, కాలి వేళ్లు అప్పుడ‌ప్పుడు నిద్ర‌లో ప‌ట్టుకుంటాయి. దీంతో చాలా అవస్థ ఎదుర‌వుతుంది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించాలంటే కాళ్లు ప‌ట్టుకోగానే వెల్ల‌కిలా తిరిగి ఓ కాలిని మ‌రో కాలిపై పెట్టాలి. పాదం కొద్దిగా వంచిన‌ట్టు చేయాలి.

heart-burn-aching-legs

ఇత‌ర స‌మ‌స్య‌లు…
గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎడ‌మ వైపుకు తిరిగి ప‌డుకోవాలి. దీంతో జీర్ణ ర‌సాలు స‌రిగ్గా ఆహారానికి అందుతాయి. త‌ద్వారా ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అదే కాళ్లు బాగా నొప్పి ఉన్న‌వారు వాటి కింద ఎత్తు పెట్టుకుని నిద్రించాలి. ఇలాంటి వారు నిద్రించ‌డానికి ముందు టీ, కాఫీ వంటివి తాగ‌కూడ‌దు.

Comments

comments

Share this post

scroll to top