పైనాపిల్‌ను తిన్న‌ప్పుడు నాలుక ప‌గులుతుంది. అలా ఎందుక‌వుతుందో తెలుసా..?

మ‌న‌కు మార్కెట్‌లో త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉన్న పండ్ల‌లో పైనాపిల్ ఒక‌టి. దీని వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ఎన్నో విట‌మిన్లు, మిన‌రల్స్ ఈ పండ్ల‌లో ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో పైనాపిల్ మ‌న‌కు విరివిగా దొరుకుతుంది. అయితే పైనాపిల్‌ను తింటే ఎవ‌రికైనా నాలుక అంతా ప‌గిలిన‌ట్టు అవుతుంది. దీంతోపాటు నాలుక‌పై దుర‌ద పుడుతుంది. మంట వ‌స్తుంటుంది. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం..!

పైనాపిల్ పండును తిన్న‌ప్పుడు నాలుకంతా ప‌గులుతుంది. కొంత మందికి మంట, దుర‌ద‌గా కూడా అనిపిస్తుంది. అందుకు కార‌ణం ఏమిటంటే బ్రొమిలెయిన్ అనే ర‌సాయ‌న‌మే. అయితే దీంతో మ‌న‌కు ఎలాంటి అపాయం లేదు. అంతా మేలే జ‌రుగుతుంది. పైనాపిల్ పండును తిన్న‌ప్పుడు అందులోంచి బ్రొమిలెయిన్ ర‌సాయం విడుద‌లై అది కెమిక‌ల్ రియాక్ష‌న్ వ‌ల్ల మ‌ళ్లీ వివిధ ర‌సాయ‌నాలుగా మారుతుంది. దీంతోపాటు నాలుక‌పై ఉండే ప్రోటీన్ విడిపోతుంది. అందువ‌ల్లే మ‌న‌కు పైనాపిల్‌ను తిన్న‌ప్పుడు అలా నాలుక‌ దుర‌ద‌గా ఉంటుంది. ప‌గులుతుంది. ఈ క్ర‌మంలో పైనాపిల్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో చేరే బ్రొమిలెయిన్ యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీగా ప‌నిచేస్తుంది. అంటే నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తుంద‌న్న‌మాట‌. అంతేకాదు దీంట్లో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. అంటే వృద్ధాప్యం కార‌ణంగా చ‌ర్మంపై వచ్చే ముడ‌త‌ల‌ను త‌గ్గిస్తుంద‌న్న‌మాట‌. దీంతో ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా ఉండ‌వ‌చ్చు. అదేవిధంగా బ్రొమిలెయిన్ వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఫుడ్ అల‌ర్జీలు పోతాయి. ఆస్త‌మా, సైన‌స్‌, కీళ్ల నొప్పులు త‌గ్గిపోతాయి. ఇన్ని ప్ర‌యోజ‌నాలు మ‌న‌కు పైనాపిల్‌ను తిన‌డం వ‌ల్ల క‌లుగుతాయి.

అయితే పైనాపిల్‌ను తిన్న‌ప్పుడు మ‌న నాలుక‌ ప‌గ‌ల‌కుండా, మంట పుట్ట‌కుండా, దుర‌ద‌గా ఉండ‌కుండా చేసుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. ఓవెన్ గ్రిల్‌పై పైనాపిల్ ముక్క‌ల‌ను వేసి గ్రిల్ చేసుకుని తింటే నోరు ప‌గ‌ల‌దు. పైనాపిల్ ముక్క‌లు మృదువుగా లోప‌లికి వెళ్లిపోతాయి. అదే విధంగా పైనాపిల్ ముక్క‌ల‌పై కొద్దిగా ఉప్పు లేదా కారం చ‌ల్లుకుని తిన్నా నాలుక‌ ప‌గ‌ల‌దు. మంట పుట్ట‌దు. ఇంకో టిప్ ఏంటంటే పైనాపిల్‌ను కోసేట‌ప్పుడు పొట్టు రాకుండా చూసుకోవాలి. అలా పొట్టు రాకుండా పైనాపిల్ ముక్క‌ల‌ను కోసుకుని తిన్నా చాలు మ‌న నోరు ప‌గ‌ల‌దు. క‌నుక ఇక ముందు మీరు పైనాపిల్ ను తినేట‌ప్పుడు ఈ టిప్స్ పాటించి చూడింది. దీంతో నోరు ప‌గ‌ల‌కుండా చూసుకోవచ్చు.

Comments

comments

Share this post

scroll to top