పురాణ గాథ‌ల యుద్ధాల్లో చ‌నిపోయిన సైనికుల అవ‌శేషాలు ఇప్పుడు మ‌న‌కు ఎందుకు క‌నిపించ‌వో తెలుసా..?

రామాయ‌ణంలో లంకను చేరుకోవ‌డం కోసం రాముడు వాన‌ర సేన‌తో క‌లిసి నిర్మించిన రామ సేతు గురించి తెలుసు క‌దా..! దాని ఆన‌వాళ్లు శ్రీ‌లంక ద‌గ్గ‌ర ఉన్నాయని ఇప్ప‌టికీ పండితులు చెబుతున్నారు. అయితే అది ఓకే. రామాయ‌ణ‌మైనా, మ‌హాభార‌త‌మైనా ఆయా గాథ‌ల్లో యుద్ధాలు జ‌రిగిన‌ప్పుడు కొన్ని కోట్ల మంది సైనికులు మృతి చెందారు క‌దా. మ‌రి వారి అస్తిక‌లు లేదంటే ఇత‌ర ఆన‌వాళ్లు ఏవీ మ‌న‌కు ఎందుకు క‌నిపించ‌డం లేదు. అవును, నిజ‌మే క‌దా..! అంటే మ‌రి ఆయా గాథ‌లు జ‌ర‌గ‌లేదా..! అంటే కాదు, జ‌రిగాయి. కానీ మ‌రి వారి ఆన‌వాళ్ల సంగ‌తి అంటే… అందుకు కార‌ణ‌మేంటో మీరే చ‌దివి తెలుసుకోండి.

ఇప్పుడంటే దేశాల మ‌ధ్య యుద్ధం జ‌రిగితే శ‌త్రు దేశ సైనికుల‌ను కాల్చి చంపి లేదంటే బందీలుగా ప‌ట్టుకున్న అనంత‌రం వారిని చిత్ర‌హింస‌ల‌కు గురి చేసి చంపుతున్నారు. అనంత‌రం కొన్ని సంద‌ర్భాల్లో వారి మృత‌దేహాల‌ను వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా అప్ప‌గించ‌డం లేదు. అయితే ఒక‌ప్పుడు అలా కాదు. యుద్ధం జ‌రుగుతున్న‌న్ని రోజులు ప్ర‌తి నిత్యం సాయంత్రం చ‌నిపోయిన సైనికుల మృత‌దేహాల‌ను వారి వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించే వారు. దీంతో వారికి ద‌హ‌న కార్యక్ర‌మాలు చేసే వారు. అందుకే అప్ప‌టి కోట్ల మంది సైనికుల ఆన‌వాళ్లు ఏవీ ఇప్పుడు మ‌న‌కు అందుబాటులో లేవు.

రామాయ‌ణంలో రాముడు, మ‌హాభార‌తంలో పాండ‌వులు త‌మ శ‌త్రువుల‌ను చంపిన త‌రువాత వారిని వారి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించార‌ట‌. అదీ… ఒక‌ప్ప‌టి యుద్ధ‌నీతి. ఇక కురుక్షేత్ర యుద్ధం పూర్త‌య్యే వ‌ర‌కు బాణాల‌తో నిర్మించిన శయ్య‌పై పడుకున్న భీష్ముడు యుద్ధంలో చ‌నిపోయిన వీరుల మృత‌దేహాల‌కు పుణ్య లోకాలు క‌ల‌గాల‌ని ప్రార్థించాడ‌ట‌. అవును మ‌రి. ఎంతైనా వారు రాజులు క‌దా. వారి రాజ‌నీతి, ధ‌ర్మం అలాగే ఉంటాయి.

Comments

comments

Share this post

scroll to top