మనలో కొందరు ఎడమ చేయి వాటం కలిగి ఉంటారు. అది ఎందుకు వస్తుందో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా ఉండే జనాల్లో కుడి చేయి వాటం కలిగిన వారు కొందరు ఉంటే ఎడమ చేయి వాటం కలిగిన వారు కొందరు ఉంటారు. వారు చిన్నప్పటి నుంచే ఏదైనా ఒక చేయిని ఎక్కువగా వాడుతారు. అందుకే వారికి ఏదో ఒక చేయి వాటం వస్తుంది. ఇక కొందరు అయితే రెండు చేతులను బాగా వాడగలుగుతారు. అయితే మీకు తెలుసా..? నిజానికి ఈ చేతి వాటం అనేది ఎలా వస్తుందో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

చేయి వాటం అనేది ఎవరికైనా తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడే వస్తుందట. సైంటిస్టులు చెబుతున్న ప్రకారం… తల్లి కడుపులో బిడ్డ పిండంగా ఉన్నప్పుడు వారిలో ఉండే జీన్స్‌ (జన్యువులు) వారి చేతి వాటాన్ని నిర్దారిస్తాయి. ఈ క్రమంలోనే డి టైప్‌ జీన్స్‌ ఎక్కువగా ఉన్నవారు కుడి చేయి వాటం వారు అవుతారు. అదే సి టైప్‌ జీన్స్‌ ఎక్కువగా ఉన్నవారు ఎడమ చేయి వాటం వారు అవుతారు. అయితే ప్రపంచంలో ఉన్న జనాభాలో 85 శాతం మంది కుడి చేయి వాటం వారేనట. కేవలం 15 శాతం మంది మాత్రమే ఎడమ చేయి వాటం వారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి 10 మంది జనాభాలో ఒకరు ఎడమ చేయి వాటం ఉన్న వారు ఉంటారట.

ఇక గర్భస్థ పిండంలో ఈ జీన్స్‌ కారణంగా చేయి వాటం నిర్దారణ కాగానే తరువాత కొన్ని వారాలకు బిడ్డ ఎదుగుతున్న క్రమంలో కుడి చేయి వాటం వారు అయితే కుడి చేతి వేలును నోట్లో ఉంచుకుంటారట. అదే ఎడమ చేయి వాటం వారు అయితే ఎడమ చేతి వేలును నోట్లో పెట్టుకుంటారట. దీన్ని సైంటిస్టులు ప్రయోగాత్మకంగా నిరూపించారు కూడా. దీన్ని బట్టి మనకు తెలుస్తుందేమిటంటే.. చేయి వాటం అనేది గర్భంలో పిండంగా ఉండగానే డిసైడ్‌ అవుతుంది. అంతేకానీ బిడ్డ పుట్టాక రాదు. ఇది తెలియని చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఎడమ చేయి వాటం వచ్చినా, ఎడమ చేయిని వారు ఎక్కువగా ఉపయోగించినా ఆ అలవాటును మాన్పించాలని చూస్తారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల వారిలో సహజంగా ఉండే సృజనాత్మకత పోతుందట. కనుక తల్లిదండ్రులు పిల్లల చేతి వాటం మార్చకూడదు.

ఇక వెనుకటి రోజుల్లో ఇలా ఎడమ చేయి వాటం ఉంటే వారిపై దుష్ట శక్తుల ప్రభావం ఉండేదని, అందువల్లే వారికి అలా ఎడమ చేయి వాటం వచ్చిందని కొన్ని చోట్ల నమ్మేవారు. ఇప్పుడు ఇలా నమ్మేవారు లేరు లెండి. దీంతోపాటు ఎడమ చేయి వాటం ఉన్న వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, వారు చాలా క్రియేటివ్‌గా, సెన్సిటివ్‌గా ఉంటారని, వారికి ఆయువు కూడా తక్కువగానే ఉంటుందని కొందరు నమ్ముతారు. కానీ ఈ విషయాలు కూడా నిజం కావు. ఏది ఏమైనా మీ పిల్లలకు గనక ఎడమ చేయి వాటం వస్తుంటే దాన్ని మాన్పించకండి. అది మంచిదే. మాన్పిస్తే వారికి ఉండే క్రియేటివిటీ పోతుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించండి..!

Comments

comments

Share this post

scroll to top