వ‌న్డే క్రికెట్ ల‌కు వైట్, టెస్ట్ ల‌కు పింక్ బాల్స్…ఎందుకు వాడుతారో తెలుసా?

ఫుట్‌బాల్ త‌రువాత ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ ఆద‌ర‌ణ ఉంది క్రికెట్ ఆట‌కే. అంత‌లా ఆ గేమ్ పాపుల‌ర్ అయింది. ఇక మ‌న దేశంలో అయితే క్రికెట్ అంటే చాలు… ఆఫీసులు, కాలేజీల‌కు సెల‌వు పెట్టి మరీ ఎంజాయ్ చేసే అభిమానులు ఉన్నారు. ఇదంతా స‌రే..! ఇప్పుడీ మ‌ధ్య డే నైట్ టెస్టులు వ‌స్తున్నాయి. కొన్ని దేశాలు ఇప్ప‌టికే ఈ టెస్టుల‌ను ఆడ‌డం ప్రారంభించాయి. అయితే ఆ టెస్టుల్లో ఎర్ర బంతికి బ‌దులుగా పింక్ బాల్‌ను వాడుతున్నారు. అలా ఎందుకు వాడుతున్నారో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

pink-and-white-balls

ఒక‌ప్పుడు… అంటే వ‌న్డేలు, ట్వంటీ 20లు లేన‌ప్పుడు మొద‌ట టెస్ట్ మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడేవారు. అది కూడా టెస్ట్ హోదా వ‌చ్చిన రెండు దేశాల మ‌ధ్యే ఆ మ్యాచ్‌లు జ‌రిగేవి. ఆ మ్యాచ్‌ల‌లో ఎర్ర బంతిని వాడేవారు. అయితే ప్రేక్ష‌కులను ఇంకా ఆక‌ర్షించ‌డం కోసం వ‌న్డేల‌ను ఆడ‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో మొద‌ట డే టైమ్‌లో వ‌న్డేల‌ను నిర్వ‌హించేవారు. అయితే రాత్రిపూట కూడా జ‌రిగేలా డే నైట్ వ‌న్డేల‌ను నిర్వ‌హిస్తే జ‌నం బాగా ఆద‌రిస్తార‌ని అనుకున్న క్రికెట్ బోర్డులు డే టైమ్‌లో జ‌రిగే వ‌న్డేల‌ను కాస్తా డే నైట్ వ‌న్డేలుగా మార్చాయి. మ‌రి బంతి సంగ‌తో..! అంటే… రాత్రి పూట ఎర్ర‌ని బంతి ఫ్ల‌డ్ లైట్ల వెలుగులో బ్రౌన్ క‌ల‌ర్‌లో క‌నిపించేది. అది పిచ్ క‌ల‌ర్‌లో క‌లిసిపోయేది. దీంతో ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం కోసం వ‌న్డేల కోసం ప్ర‌త్యేకంగా తెలుపు బంతిని ప్ర‌వేశ‌పెట్టారు. అప్ప‌టి నుంచి తెలుపు బంతితోనే డే, డే / నైట్ వ‌న్డేలు ఆడుతున్నారు. కానీ టెస్టుల్లో మాత్రం ఎర్ర బంతి వినియోగం అలా కొన‌సాగుతూ వ‌చ్చింది.

redball

white-ball

ఈ క్ర‌మంలో తాజాగా టెస్టుల‌కు కూడా మ‌రింత ఆద‌ర‌ణ తీసుకు వ‌చ్చేందుకు డే నైట్ టెస్ట్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యారు. అయితే… మ‌ళ్లీ ఇప్పుడు కూడా బంతి స‌మ‌స్యే ఎదురైంది. ముందే చెప్పాం క‌దా… ఫ్ల‌డ్ లైట్ల వెలుగులో ఎర్ర‌ని బంతి స‌రిగ్గా క‌నిపించ‌ద‌ని. దీంతో దాని స్థానంలో పింక్ క‌ల‌ర్ బంతిని తీసుకొచ్చారు. మ‌రి పింక్ క‌ల‌రే ఎందుకు, వ‌న్డేల్లా తెల్ల‌ని బంతి వాడ‌వ‌చ్చు క‌దా… అంటే… సాధార‌ణంగా వ‌న్డేల్లో ఒక ఇన్నింగ్స్‌కు రెండు తెల్ల‌ని బంతుల‌ను వాడుతారు. 30 నుంచి 40 ఓవ‌ర్ల మ‌ధ్య బంతిని మారుస్తారు. అప్ప‌టికే బంతి రూపం కోల్పోయి మురికిగా మారుతుంది. అలాంటప్పుడు అదే తెల్ల‌ని బంతిని ఒక వేళ డే నైట్ టెస్టుల్లో వినియోగిస్తే అప్పుడు ఆ బంతిని 30-40 ఓవ‌ర్ల‌కు క‌చ్చితంగా మార్చాలి. టెస్టు మ్యాచ్‌లంటే వన్డేల్లా కాదుగా, సుదీర్ఘంగా ఆడుతారు, అలాంటప్పుడు ప్ర‌తి 30-40 ఓవ‌ర్ల‌కు ఓ సారి బంతిని మారుస్తూ పోవ‌డం ఇబ్బందిగా ఉంటుంది. దీంతోపాటు పింక్ క‌ల‌ర్ అయితే అది అంత త్వ‌ర‌గా రంగు కోల్పోదు. క‌నుకే ఇప్పుడు జ‌ర‌గ‌బోయే డే నైట్ టెస్టు మ్యాచ్‌ల‌లో పింక్ క‌ల‌ర్ బంతిని వినియోగించ‌నున్నారు. అదీ… పింక్ బంతి వినియోగం వెనుక ఉన్న అస‌లు విష‌యం..!

Comments

comments

Share this post

scroll to top