మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో డ‌బ్బును ఇత‌రుల‌కు ఎందుకు ఇవ్వ‌రో తెలుసా..?

మిగ‌తా విష‌యాలు ఎలా ఉన్నా చాలా మంది డ‌బ్బుల విష‌యానికి వ‌స్తే మాత్రం చాలా క‌చ్చితంగా ఉంటారు. అవును మ‌రి, ఎందుకంటే డ‌బ్బు అంటే సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి స్వ‌రూప‌మే అని న‌మ్ముతారు క‌దా. అందుక‌నే చాలా మంది శుక్ర‌వారం పూట డ‌బ్బుల‌ను ఇవ్వ‌రు. వ‌స్తే తీసుకుంటారు గానీ డ‌బ్బుల‌ను ఇచ్చేందుకు మాత్రం విముఖ‌తను ప్ర‌ద‌ర్శిస్తారు. ఎంతో పురాత‌న కాలం నుంచి ఈ ఆచారాన్ని మ‌న పెద్ద‌లు పాటిస్తూ వ‌స్తున్నారు. దాన్నే మ‌నం కూడా అనుస‌రిస్తున్నాం. అయితే ఇది స‌రే. కానీ అస‌లు అదే రోజున డ‌బ్బుల‌ను ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

భృగు మ‌హ‌ర్షి బ్ర‌హ్మ దేవుడికి మాన‌స పుత్రుడు. ప్ర‌జాప‌తుల‌లో, సప్త రుషుల్లో ఈయ‌న ఒక‌రు. ఈయ‌నకు, ద‌క్ష ప్ర‌జాప‌తి పుత్రిక ఖ్యాతిదేవికి వివాహం అవుతుంది. దీంతో భృగు మ‌హ‌ర్షికి, ఖ్యాతి దేవికి ముగ్గురు సంతానం క‌లుగుతారు. వారు దాత‌, విధాత‌, శ్రీ‌మ‌హాల‌క్ష్మి. శ్రీ‌మ‌హాల‌క్ష్మి విష్ణువును వివాహ‌మాడుతుంది. అయితే మ‌నం వ్య‌వ‌హ‌రించే శుక్ర‌వారానికి మ‌రోపేరు భృగు వారం. ఈ క్ర‌మంలో ఆ రోజునే మ‌హాల‌క్ష్మి ఆయ‌న్ను విడిచి విష్ణువును పెళ్లి చేసుకుని వెళ్లింద‌ని చెబుతారు. అందుకే ఆ రోజున మ‌హాల‌క్ష్మి స్వ‌రూప‌మైన డ‌బ్బును ఎవ‌రూ ఇత‌రుల‌కు ఇవ్వ‌రు. అలా ఇస్తే ఇక వారికి ఆ డ‌బ్బు ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ట‌. ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ‌తాయ‌ట‌. అందుకే శుక్ర‌వారం పూట ఎవ‌రూ డ‌బ్బును ఇత‌రుల‌కు ఇవ్వ‌రు.

ఇక శుక్ర‌వారమే కాదు, మంగ‌ళ‌వారం కూడా డ‌బ్బును ఎవ‌రూ ఇత‌రుల‌కు ఇవ్వ‌రు. కానీ దీన్ని పాటించే వారు చాలా త‌క్కువ మందే ఉంటారు. మ‌రి మంగ‌ళ‌వారం ఎందుకు డ‌బ్బును ఇత‌రుల‌కు ఇవ్వ‌రు అంటే… ఆ రోజు కుజ గ్ర‌హానికి సంబంధించిన‌ది. కుజుడు మాన‌వుల‌కు సంప‌ద‌ను, ఆరోగ్యాన్ని, క‌ల‌హాలు లేని వైవాహిక జీవితాన్ని ఇస్తాడ‌ట‌. అందుకని ఆ రోజున ఎవ‌రైనా సంప‌ద‌ను దూరం చేసుకుంటే అలాంటి వారికి కుజుడు ఇక సంప‌ద‌ను అనుగ్ర‌హించ‌డ‌ట‌. దీంతో క‌ష్టాలు వ‌స్తాయ‌ని న‌మ్ముతారు. అందుకే మంగ‌ళ‌వారం రోజున కూడా డ‌బ్బును ఎవ‌రూ ఇత‌రుల‌కు ఇవ్వ‌రు..!

Comments

comments

Share this post

scroll to top