పేప‌ర్లు పాతగా అయినా కొద్దీ…..అవి ప‌సుపు రంగులోకి ఎందుకు మారుతాయో తెలుసా?

ముఖ్య‌మైన పుస్త‌కాలు, డాక్యుమెంట్లు, పేప‌ర్ క‌టింగ్స్‌… ఇలా పేప‌ర్‌పై ప్రింట్ అయిన కొన్నింటిని చాలా మంది జాగ్ర‌త్త‌గా భ‌ద్ర‌ప‌రుచుకుంటారు. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు వాటితో ప‌ని ప‌డుతుంద‌నే భావ‌నతో ఎవ‌రైనా వాటిని దాస్తారు. అయితే కొన్ని ర‌కాల పుస్త‌కాల‌తోపాటు పేప‌ర్లు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. రోజులు గ‌డిచే కొద్దీ వాటి రంగు మారుతూ ఉంటుంది. కొత్త‌గా కొన్న‌ప్పుడు ఉన్న ద‌ళ‌స‌రి త‌నం కూడా ఉండ‌దు. అవి ముట్టుకుంటేనే చిరిగిపోయేంత‌గా మారుతాయి. అయితే అవి అలా రంగు ఎందుకు మారుతాయో తెలుసా..? దీని వెనుక ఉన్న అస‌లు కార‌ణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

paper-color-change

ఒక‌ప్పుడు… అంటే 11వ శ‌తాబ్దంలో ప‌లు ర‌కాల వ‌స్త్రాల‌తో పేప‌ర్‌ను త‌యారు చేసేవారు. అయితే అది కేవ‌లం కొన్ని రోజులు మాత్ర‌మే స‌రిగ్గా ఉండేది. ఆ త‌రువాత దానంత‌ట అదే చిరిగిపోయేది. దీంతో వ‌స్త్రంతో చేసిన పేప‌ర్ ప‌నికిరాద‌ని చెప్పి కొంద‌రు చెట్ల ఆకులు, కాండం పిప్పి నుంచి పేప‌ర్ త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలో పేప‌ర్ త‌యారీలో అప్ప‌టి నుంచి స‌మూల మార్పులు వ‌చ్చాయి. అయితే ఎలాంటి మార్పు వ‌చ్చినా కొన్ని ర‌కాల పేప‌ర్లు మాత్రం కాలం గ‌డుస్తున్న కొద్దీ పసుపు లేదా గోధుమ రంగులోకి మారిపోయి ప‌లుచ‌గా త‌యార‌వుతూ వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం ఏంటంటే… పేప‌ర్‌లో ఉండే ప‌దార్థ‌మే. దాని పేరు లిగ్నిన్‌. లిగ్నిన్ అనేది చెట్టు కాండం దృఢంగా ఉండ‌డానికి, చెట్టు ఎక్కువ పొడ‌వు పెర‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే చెట్టు నుంచి తీసుకునే ఆకులు, కాండంలో లిగ్న‌న్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అది పేప‌ర్ త‌యార‌య్యాక కూడా అలాగే ఉంటుంది. ఈ క్ర‌మంలో లిగ్న‌న్ ఉండ‌డం వ‌ల్ల అది సూర్య‌కాంతి ప‌డిన‌ప్పుడు రంగు మారుతుంది. ఫ‌లితంగా కాలం గ‌డుస్తున్న కొద్దీ పేప‌ర్ రంగులో మార్పు వ‌స్తుంది.

అయితే న్యూస్ పేప‌ర్‌, నోట్ బుక్స్ పేప‌ర్లు మాత్రమే త‌క్కువ కాలంలో రంగు మారుతాయి. ఇత‌ర పుస్త‌కాలు, బాండ్ పేప‌ర్స్ వంటివి అంత త్వ‌ర‌గా రంగు మార‌వు. ఎందుకంటే వాటిని త‌యారు చేసే పేప‌ర్ల‌ను బ్లీచింగ్ ప్ర‌క్రియ‌కు గురి చేస్తారు. అందువ‌ల్ల వాటిలో ఉండే లిగ్న‌న్ ఎక్కువ శాతం పోతుంది. అయినా అది ఎంతో కొంత మిగిలే ఉంటుంది, కానీ అది పేప‌ర్ల‌పై ప్రభావం చూప‌డానికి ఎక్కువ సమ‌యం ప‌డుతుంది. క‌నుకే పుస్త‌కాలు, బాండ్ పేప‌ర్ల వంటి వాటి రంగు అంత త్వ‌ర‌గా మార‌దు. అయితే ఏ పుస్త‌క‌మైనా, పేపర్ అయినా, డాక్యుమెంట్ అయినా రంగు మార‌కుండా ఎక్కువ కాలం అలాగే ఉండాలంటే వాటిని సూర్య‌కాంతి త‌గ‌ల‌ని చ‌ల్ల‌ని, పొడి ప్ర‌దేశంలో ఉంచాలి. ఎప్పుడైనా తీసి చ‌దివినా వాటిపై కాంతి ప‌డ‌కుండా ఉండేలా చూసుకుంటే చాలు, దీంతో ఎలాంటి పేప‌ర్ అయినా ఎక్కువ కాలం ఉన్నా రంగు మార‌దు.

Comments

comments

Share this post

scroll to top