శివాలయాల్లోనే ఎక్కువ‌గా న‌వ‌గ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

న‌వ‌గ్ర‌హాల గురించి తెలుసు క‌దా. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహ‌స్పతి, శ‌ని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం 9 గ్ర‌హాలు ఉంటాయి. వీటి స్థితి కార‌ణంగానే వ్య‌క్తుల జాత‌కాలు చెబుతారు జ్యోతిష్యులు. ఈ క్ర‌మంలో ఏవైనా గ్ర‌హ దోషాలు ఉంటే కొంద‌రు పూజ‌లు కూడా చేస్తారు. అయితే ఈ న‌వ‌గ్ర‌హాలు అనేవి ప్ర‌ధానంగా శివాల‌యాల్లోనే మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. దీనికి కార‌ణం ఏమిటో తెలుసా..? అదే తెలుసుకుందాం ప‌దండి..!

navgrah-mandap
న‌వ‌గ్రహాల‌లో ఒక్కో గ్ర‌హానికి ఒక్కో అధిష్టాన దేవ‌త ఉంటుంది. ఆ దేవ‌త‌ల‌ను నియ‌మించింది శివుడే. దీంతోపాటు గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడుకి అధిదేవత కూడా శివుడే. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ వుంటాయి. అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ వుంటాయి.

ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహమే ఉంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెబుతున్నాయి. అందుకే  చాలా మంది భ‌క్తులు శివాల‌యాల్లో న‌వ‌గ్ర‌హ పూజ చేసినా చేయ‌కున్నా, శివునికి మాత్రం క‌చ్చితంగా అభిషేకం లేదా అర్చన చేయిస్తారు. అలా చేస్తే న‌వ‌గ్ర‌హ దోషాలు ఉంటే పోతాయ‌ని  భ‌క్తుల విశ్వాసం. అయితే శివాల‌యం కాకుండా కొన్ని ఇత‌ర ఆలయాల్లోనూ మ‌న‌కు న‌వ‌గ్ర‌హాలు ద‌ర్శ‌న‌మిస్తాయి. కానీ… ఏ ఆల‌యంలో న‌వ‌గ్ర‌హ మండ‌పాలు ఉన్నా చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేయ‌డం ఉత్త‌మం. అలా చేస్తే గ్ర‌హ దోషాలు పోతాయి.

Comments

comments

Share this post

scroll to top